Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రపంచాన్ని షాక్‌కు గురి చేసిన ఫైనాన్షియల్ ఫ్రాడ్ ఓటీటీలో. 30 ఏళ్లు పోలీసులకు దొరకని మాస్టర్‌మైండ్ కథ

ప్రపంచాన్ని షాక్‌కు గురి చేసిన ఫైనాన్షియల్ ఫ్రాడ్ ఓటీటీలో. 30 ఏళ్లు పోలీసులకు దొరకని మాస్టర్‌మైండ్ కథ

Big TV Live 1 week ago

True Crime Documentary: నిజ జీవితంలో జరిగిన కొన్ని ఆర్థిక నేరాలు సినిమా కథలకంటే కూడా షాకింగ్‌గా ఉంటాయి. కోట్ల రూపాయలు కాదు… ఒక కంపెనీ సొంత డబ్బుతోనే అదే కంపెనీని కొనేసి ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచిన ఘటనలు ఊహకు కూడా అందవు.

అలాంటి సంచలన సంఘటన ఆధారంగా తెరకెక్కిందే ‘ఇన్‌సైడ్ ది ట్రస్టర్ స్కాండల్’ (Inside The Trustor Scandal). స్వీడన్ చరిత్రలోనే అతిపెద్ద కార్పొరేట్ మోసాల్లో ఒకటిగా నిలిచిన ఈ కేసు వెనుక దాగి ఉన్న నిజాలను బయటపెట్టే క్రైమ్ డాక్యుమెంటరీ ఇది. ప్రతి నిమిషం కొత్త విషయాన్ని బయటపెడుతూ నిజంగానే ఇలా జరిగిందా ? అనే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మరి ఈ ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ తెలుగులో అందుబాటులో ఉందా ? ఇంతకీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

1997లో స్వీడన్‌కు చెందిన ప్రముఖ పెట్టుబడి సంస్థ ట్రస్టర్ ఐదుగురు వ్యక్తుల చేతికి వెళుతుంది. బయటకు చూస్తే ఇది సాధారణ కార్పొరేట్ డీల్‌లా కనిపిస్తుంది. కానీ కొద్ది నెలల్లోనే ఆ కొనుగోలు వెనుక భారీ మోసం జరిగినట్లు బయట పడుతుంది.

విచారణలో బయటపడిన విషయం మరింత షాకింగ్‌గా ఉంటుంది. కంపెనీని కొనడానికి ఉపయోగించిన డబ్బు పెట్టుబడిదారులది కాదు. అదే ట్రస్టర్ కంపెనీ బ్యాంకు ఖాతాల్లో ఉన్న సొమ్మును అక్రమంగా వినియోగించి కంపెనీని తమ ఆధీనంలోకి తీసుకున్నారని తేలుతుంది. ఈ మొత్తం ఆపరేషన్ వెనుక జోచిమ్ పోసెనర్ అనే వ్యక్తి మాస్టర్‌మైండ్‌గా ఉన్నట్లు అధికారులు గుర్తిస్తారు.

ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చిన వెంటనే జోచిమ్ పోసెనర్ అదృశ్యమవుతాడు. అంతర్జాతీయ స్థాయిలో అతని కోసం గాలింపు ప్రారంభమైనా, ఏళ్ల తరబడి అతని ఆచూకీ దొరకదు. ఇంటర్‌పోల్, స్వీడిష్ పోలీసులు ఎంత ప్రయత్నించినా అతను ఎక్కడ ఉన్నాడో తెలుసుకోలేకపోతారు.

కాలం గడిచినా ఈ కేసు చుట్టూ ఉన్న ఎన్నో ప్రశ్నలు అలాగే మిగిలిపోతాయి. దోచుకున్న భారీ మొత్తం డబ్బు ఏమైంది? ఈ స్కామ్‌ను ఎలా అమలు చేశారు ? మిగిలిన నిందితుల పాత్ర ఎంతవరకు ఉంది ? వంటి అంశాలపై దర్యాప్తు కొనసాగుతూనే ఉంటుంది.

ఈ డాక్యుమెంటరీలో దశాబ్దాల తర్వాత తొలిసారి జోచిమ్ పోసెనర్ స్వయంగా కెమెరా ముందుకు వచ్చి తన కథను చెబుతాడు. దర్యాప్తులో పాల్గొన్న అధికారులు, కీలక వ్యక్తుల వాంగ్మూలాలు, గతంలో బయటకు రాని వివరాలు ఈ డాక్యుమెంటరీకి మరింత బలం చేకూరుస్తాయి. చివరకు ఈ సంచలన ఆర్థిక కుంభకోణం వెనుక అసలు నిజం ఏమిటో తెలుసుకోవాలంటే ఈ డాక్యుమెంటరీని చూడాల్సిందే.

తెలుగులో అందుబాటులో ఉందా ?

‘ఇన్‌సైడ్ ది ట్రస్టర్ స్కాండల్’ సాధారణ క్రైమ్ డాక్యుమెంటరీ కాదు. నిజ జీవితంలో జరిగిన భారీ కార్పొరేట్ మోసాన్ని ఆధారాలు, ఇంటర్వ్యూలు, దర్యాప్తు వివరాలతో ఆసక్తికరంగా చూపిస్తుంది. దర్శకురాలు కరిన్ ఆఫ్ క్లింట్‌బర్గ్ కథను థ్రిల్లర్ తరహాలో చెప్పడం వల్ల ప్రతి ఎపిసోడ్ ఆసక్తిని పెంచుతుంది. ఫైనాన్షియల్ క్రైమ్‌లు, వైట్ కాలర్ స్కామ్‌లు, నిజ జీవిత మిస్టరీ కేసులపై ఆసక్తి ఉన్నవారికి మస్త్ ఎంటర్టైన్మెంట్.

ఈ డాక్యుమెంటరీ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ డాక్యుమెంటరీ స్వీడిష్ ఒరిజినల్ ఆడియోలో అందుబాటులో ఉంది. తెలుగు డబ్బింగ్ ప్రస్తుతం లేదు. ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో వీక్షించవచ్చు. నిజ జీవితంలో జరిగిన సంచలన ఆర్థిక కుంభకోణాలపై రూపొందిన డాక్యుమెంటరీలు నచ్చితే దీన్ని పొరపాటున కూడా మిస్ అవ్వొద్దు. చివరి వరకు ఉత్కంఠను కొనసాగించే ఈ డాక్యుమెంటరీ, డబ్బు కోసం మనుషులు ఎంత దూరం వెళ్తారో కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది.

10 కోట్ల బ్యాగ్‌ దొరకడంతో మొదలయ్యే గందరగోళం… కితకితలు పెట్టే ఇమ్మిగ్రెంట్స్ కష్టాలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live