Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రతి పని కచ్చితంగా జరగాలని కోరుకుంటారు.. ఈ పేర్లు గలవారు పుట్టుకతోనే పర్‌ఫెక్షనిస్ట్

ప్రతి పని కచ్చితంగా జరగాలని కోరుకుంటారు.. ఈ పేర్లు గలవారు పుట్టుకతోనే పర్‌ఫెక్షనిస్ట్

Big TV Live 1 week ago

Name Astrology Perfectionist| నామ జ్యోతిష్యం (నేమ్ ఆస్ట్రాలజీ) ప్రకారం మన పేరు మొదటి అక్షరం వ్యక్తిత్వానికి సంబంధించిన కొన్ని విషయాలను తెలియజేస్తుందని నమ్ముతారు.

మన ఆలోచనలు, ప్రవర్తన, పనులు చేసే విధానంపై పేరు మొదటి అక్షరం ప్రభావం చూపుతుందని జ్యోతిష్యం చెబుతోంది. కొంతమంది తప్పులు జరిగినా పెద్దగా పట్టించుకోరు. మరికొందరు మాత్రం ప్రతి పనిని కచ్చితంగా, ఎలాంటి లోపాలు లేకుండా పూర్తి చేయాలని కోరుకుంటారు. చిన్న తప్పు కనిపించినా అసంతృప్తికి గురవుతారు. నామ జ్యోతిష్యం ప్రకారం.. F, J, P, R అక్షరాలతో మొదలయ్యే పేర్లు గలవారు పర్ఫెక్షనిస్ట్‌లుగా ఉంటారు.

F అక్షరంతో పేరు మొదలయ్యే వారికి క్రమశిక్షణే ప్రధానం

F అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వారు క్రమశిక్షణతో, పద్ధతిగా ఉంటారని నామ జ్యోతిష్యం చెబుతుంది. వారు ఏ పనినైనా తొందరగా పూర్తి చేయకుండా జాగ్రత్తగా చేస్తారు. పని కచ్చితంగా ఉండాలని కోరుకుంటారు. ఇంట్లో లేదా ఆఫీసులో.. వస్తువులు చక్కగా అమర్చి, అలంకరించి ఉండటం వారికి ఇష్టం. ప్రతి వస్తువుకు ఒక నిర్దిష్ట స్థానం ఉండాలని వారు భావిస్తారు. తమ నుంచి మాత్రమే కాకుండా ఇతరుల నుంచి కూడా ఎక్కువగా ఆశిస్తారు. అయితే ఈ అధిక అంచనాలు కొన్నిసార్లు వారిపైనే ఒత్తిడిని పెంచే అవకాశం ఉంది.

J అక్షరంతో పేరు మొదలయ్యే వారు లక్ష్యాలపైనే దృష్టి

J అక్షరంతో పేర్లు మొదలయ్యే వారికి ఎప్పుడూ లక్ష్యసాధనపైనే దృష్టి ఉంటుంది. అసంపూర్తిగా ఉన్న పనులు వారికి సాధారణంగా నచ్చవు.
తమ ప్రణాళిక ప్రకారం పనులను పూర్తి చేయాలని ప్రయత్నిస్తారు. పనిలో ఏదైనా తప్పు జరిగితే దాన్ని సరిచేసే వరకు ప్రయత్నిస్తూనే ఉంటారు. పట్టుదలతో ఎన్నికష్టాలొచ్చినా బాధ్యతలను నిర్వహించడంలో సహాయపడుతుంది. అందుకే వీరిలో నాయకత్వ లక్షణాలు కనిపించవచ్చని నామ జ్యోతిష్యం చెబుతుంది. వారి ప్రణాళిక, నిర్వహణ నైపుణ్యాలు వారికి ఉపయోగపడవచ్చు.

P అక్షరంతో పేరు మొదలయ్యే వారు చిన్న విషయాలను కూడా గమనిస్తారు

P అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వారు ప్రతి విషయాన్ని లోతుగా పరిశీలిస్తారని చెబుతారు. ఇతరులు పట్టించుకోని చిన్న తప్పులను కూడా వారు గుర్తించవచ్చు. బాధ్యతలను చాలా సీరియస్‌గా తీసుకుంటారు. నిబంధనలను పాటించడంలో కూడా శ్రద్ధ చూపుతారు. పనిలో నిర్లక్ష్యం కనిపిస్తే వారు త్వరగా అసహనానికి గురయ్యే అవకాశం ఉంటుంది. విషయాన్ని సూక్ష్మంగా పరిశీలించే అలవాటు మంచి ఫలితాలను సాధించడంలో సహాయపడుతుంది. అయితే ప్రతి ఒక్కరి నుంచి పరిపూర్ణతను ఆశించకుండా ఉండటం మంచిది.

R అక్షరంతో పేరు మొదలయ్యే వారు తమను తాము మెరుగుపరుచుకుంటారు

R అక్షరంతో పేరు మొదలయ్యే వారు తెలివైన, కష్టపడే వ్యక్తులుగా ఉంటారని నమ్ముతారు. వారికి అప్పగించిన బాధ్యతను పర్ఫెక్ట్‌గా పూర్తి చేయాలని ప్రయత్నిస్తారు. తమ పనిలోని తప్పులను కూడా వెంటనే గుర్తించే అవకాశం ఉంటుంది. అందుకే వారు తమను పనితీరుని స్వయంగా విమర్శించుకుంటూ మెరుగుపరిచేందుకు కృష్టి చేస్తూ ఉంటారు. తమ లోపాలను సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్లాలని కోరుకుంటారు. వ్యక్తిగత జీవితం, ఉద్యోగంలో నాణ్యతకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు.

పర్ఫెక్షనిజం కొన్నిసార్లు సమస్యగా మారుతుంది

పర్ఫెక్షనిజం.. క్రమశిక్షణ, ఏకాగ్రత, నాణ్యతను పెంచుతుంది. అయితే ప్రతి పనిలో పరిపూర్ణతను కోరుకోవడం ఒత్తిడిని కూడా పెంచవచ్చు. అంచనాలు ఎక్కువగా ఉన్నప్పుడు చిన్న తప్పులు కూడా పెద్ద సమస్యగా అనిపిస్తాయి. జీవితంలో అప్పుడప్పుడు తప్పులు జరగడం సహజమని అర్థం చేసుకోవాలి. నాణ్యతతో పాటు కొంత సౌలభ్యాన్ని పాటించడం మంచిది.

నామ జ్యోతిష్యం ఒక సంప్రదాయ విశ్వాసం మాత్రమే. ఇది వ్యక్తిత్వాన్ని నిర్ధారించే శాస్త్రీయ పద్ధతిగా నిరూపించబడలేదు. ఒకే అక్షరంతో పేర్లు మొదలైన వారందరి వ్యక్తిత్వాలు ఒకేలా ఉండవు. కాబట్టి ఈ విషయాలను సాధారణ నమ్మకాలుగా మాత్రమే పరిగణించాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live