Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రియుడి ముందే అమ్మాయిని దారుణంగా. నెత్తురుడికించే  శ్రీలంక సినిమా

ప్రియుడి ముందే అమ్మాయిని దారుణంగా. నెత్తురుడికించే శ్రీలంక సినిమా

Big TV Live 1 month ago

Crime Thriller Movie OTT : శ్రీలంక నుంచి వచ్చిన ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీని ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ప్రదర్శనలు ఇచ్చింది.

అంతే కాదు మన దేశంలో జరిగిన కోల్‌కతా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (2022) లో ఈ సినిమా గురించి చాలా గొప్పగా మాట్లాడుకున్నారు కూడా. అయితే ఈ సినిమా శ్రీలంకలో రిలీజ్ కావడానికి చాలా టైమ్ పట్టింది. ఇందులో అడల్ట్ కంటెంట్, సమాజం మీద ఘాటుగా ఉండే డైలాగుల వల్ల సెన్సార్ బోర్డుతో చాలా ఇబ్బందులు వచ్చాయి. ఇది కచ్చితంగా చిన్న పిల్లలు చూసే సినిమా కాదు, కేవలం పెద్దలకు మాత్రమే. ఒక గ్రామీణ ప్రాంతానికి చెందిన ఇద్దరు ప్రేమికులు, తమ ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడటానికి చిన్నపాటి మోసాలు చేస్తారు. ఆ ప్రయత్నంలో వారు ఎదుర్కొన్న ప్రమాదకరమైన పరిస్థితులే ఈ సినిమా. పిచ్చెక్కించే సీన్లు ఇందులో చాలానే ఉన్నాయి. దీని పేరు ఏమిటి ? ఎక్కడ చూడచ్చు ? అనే వివరాల్లోకి వెళ్తే

ఎక్కడ చూడచ్చు అంటే

ఈ శ్రీలంకన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ‘దూస్ర’ (Doosra). దీనికి చన్న దేశప్రియ దర్శకత్వం వహించారు. ఇందులో తిలక్షిణి రత్నాయక, సజిత అనుత్తర ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు ప్రధాన బలం దాని మేకింగ్ స్టైల్. దర్శకుడు చన్న దేశప్రియ గొప్ప సినిమాటోగ్రాఫర్ కావడంతో, సినిమాలో ప్రతి ఫ్రేమ్ చాలా రియలిస్టిక్ గా, ఆ ఊరి వాతావరణం మన కళ్ళ ముందు ఉన్నట్టుగా ఉంటుంది. ప్రకృతిని ఎంత అందంగా చూపించారో, పేదరికాన్ని అంత పచ్చిగా చూపించారు. ఇందులో హీరోయిన్ తిలక్షిణి రత్నాయక, హీరో సజిత అనుత్తర తమ నటనతో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారు. ఈ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో కోల్‌కతా ఫిల్మ్ ఫెస్టివల్ వంటి వేదికలపై మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈ సినిమా అందరికీ సెట్ అయ్యే రకం కాదు. ఇందులో ఉన్న బోల్డ్ సీన్స్, బూతు మాటల కారణంగా శ్రీలంకలో సెన్సార్ పరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. అందుకే ఇది కేవలం పెద్దలకు మాత్రమే పరిమితమైన చిత్రం. ఈ సినిమా శ్రీలంకలో 2024లో రిలీజ్ అయింది. అయితే ఇది ఓటీటీలోకి ఇంకా రాలేదు. శ్రీలంకన్ ఓటీటీ ప్లాట్ ఫామ్ అయిన Roopa Halaలో ఇది త్వరలో స్ట్రీమింగ్ కి వచ్చే అవకాశం ఉంది.

స్టోరీ ఏమిటంటే

ఈ సినిమా కథ అంతా రతీ, అనిల్ అనే ఇద్దరు ప్రేమికుల చుట్టూ తిరుగుతుంది. వీళ్లు ఉండేది ఒక మారుమూల పల్లెటూరు. అక్కడ బతకడం చాలా కష్టమైపోతుంది. చేతిలో చిల్లిగవ్వ ఉండదు, పైగా ఆ ఊర్లో డెవలప్‌మెంట్ పేరుతో పేదోళ్లని ఖాళీ చేయిస్తుంటారు. ఇక రతీ, అనిల్ ఇద్దరికీ ఒకరిపై ఒకరికి పిచ్చి ప్రేమ ఉంటుంది. కానీ ప్రేమిస్తే కడుపు నిండదు కదా? తిండికి, బతకడానికి డబ్బులు లేక చాలా ఇబ్బంది పడుతుంటారు. ఎలాగైనా డబ్బు సంపాదించాలని ఒక చిల్లర ప్లాన్ వేస్తారు. పట్నం నుండి వచ్చే అమాయకులను, టూరిస్టులను బురిడీ కొట్టించి చిన్న చిన్న దొంగతనాలు, మోసాలు చేయడం మొదలుపెడతారు.

వీళ్లు ఏదో టైంపాస్ కోసం, ఆకలి తీర్చుకోవడానికి మొదలుపెట్టిన ఈ చోరీ వ్యవహారాలు కాస్త మెల్లిగా పెద్ద మాఫియా కళ్లలో పడతాయి. దాంతో వీళ్లు ఆ లోకంలో చిక్కుకుపోతారు. ఒక దశలో అనిల్ అండర్ వరల్డ్ పనుల్లో ఇరుక్కుపోతాడు. రతీని కూడా వాళ్ళు బంధించి చాలా దారుణాలకు పాలపడతారు. చివరికి వాళ్ళు ఈ మాఫియా గ్యాంగ్ నుంచి బయట పడ్డారా ? మాఫియా గ్యాంగ్ ఎందుకు వీళ్ళ వెంట పడ్డారు ? ఈ క్లైమాక్స్ ఏమిటి ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాను చూడాల్సిందే.

Read Also : తండ్రి వికృత చేష్టలు… నాలుగు గోడల మధ్య నలిగిపోయే కూతుర్లు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live