PSL 2026: పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Pakistan Super League 2026 Tournament) చివరి దశకు వచ్చేసింది. మరో రెండు మ్యాచ్ లు జరిగితే టోర్నమెంట్ కూడా ముగుస్తుంది.
ప్రస్తుతం నాకౌట్ మ్యాచ్ లు జరుగుతున్నాయి. ఎలిమినేటర్ వన్ నిన్న ఫినిష్ కాగా.. రేపు ఎలిమినేటర్ 2 అలాగే మార్చి మూడవ తేదీన ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. అయితే నాకౌట్ స్టేజ్ లో ప్రేక్షకులను అనుమతించింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (Pakistan Cricket Board). ఇలాంటి నేపథ్యంలో జనాలు ఎగబడి స్టేడియానికి వచ్చారు. ఈ సందర్భంగా స్టేడియాన్ని చెత్త కుప్పలాగా తయారు చేశారు పాకిస్తాన్ అభిమానులు. అయితే ఆ చెత్తను స్టేడియాలలో క్లీన్ చేయించడానికి డబ్బులు లేకపోవడంతో.. కొంత మంది హౌస్ వైఫ్ లను తీసుకువచ్చారు. వాళ్లను బతిలాడి మరి స్టేడియాన్ని క్లీన్ చేయిస్తోంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. ఈ నేపథ్యంలో ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.
ఆంటీలతో స్టేడియాలను క్లీన్ చేయిస్తున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో భాగంగా ముల్తాన్ సుల్తాన్ వర్సెస్ హైదరాబాద్ కింగ్స్ మెన్ (Multan Sultans vs Hyderabad Kingsmen, Eliminator 1) జట్ల మధ్య ఎలిమినేటర్ వన్ మ్యాచ్ నిన్న జరిగిన సంగతి తెలిసిందే. లాహోర్ లోని గడాఫీ స్టేడియం ( Gaddafi Stadium, Lahore) వేదికగా ఈ మ్యాచ్ నిర్వహించారు. ఈ క్రమంలో అభిమానులు విపరీతంగా వచ్చారు. అంతే కాదు కాగితాలు విసిరివేయడం, వాటర్ బాటిల్స్ పడేయడం లాంటివి స్టేడియంలోనే చేశారు. అయితే వాటిని క్లీన్ చేయించేందుకు డబ్బులు లేవని అదిరిపోయే ప్లాన్ చేసింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. స్టేడియం చుట్టుపక్కల ఉన్న కొంతమంది గృహిణులను బతిలాడి మరి శుభ్రం చేయించారు. స్టేడియం
చుట్టుపక్కల ఉన్న ఇండ్లలో ఉండే గృహిణులకు ఉచితంగా క్రికెట్ మ్యాచ్ లకు ప్రవేశం ఇస్తామని ఆశ చూపించి, ఫ్రీగానే స్టేడియాలను క్లీన్ చేయించుకుందట పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. ఈ మేరకు స్టేడియాలను ఆంటీలు క్లీన్ చేస్తున్న ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. ఈ సంఘటన వైరల్ అయిన నేపథ్యంలో దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. కార్మికులకు డబ్బులు ఇవ్వలేని స్థితిలో పాకిస్తాన్ ఉందని… అలాంటి వాళ్లు టీమిండియా పై విషయం కక్కుతారని మండిపడ్డారు. ఇలాంటి పాకిస్తాన్ దుర్మార్గులను క్షమించకూడదని ఇండియన్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.
స్టేడియాలలోకి దొంగల దూరేస్తున్నారు
ముల్తాన్ సుల్తాన్స్ వర్సెస్ హైదరాబాద్ కింగ్స్ మెన్ మధ్య ఎలిమినేటర్ వన్ మ్యాచ్ లాహోర్ లోని గడాఫీ స్టేడియం వేదికగా జరిగింది. ఈ నేపథ్యంలో చాలా మంది అభిమానులు గేటు సందుల్లో నుంచి దొంగల్లాగా దూరారు. టికెట్లు తీసుకోకుండా ఇనుప రాడ్ల మధ్యలో నుంచి చొచ్చుకు వచ్చారు. ఈ సంఘటన కూడా ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

