Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పుష్ప 2 రూట్ మ్యాప్‌లో 'పెద్ది'.. రికార్డుల వేట మొదలుకానుందా?

పుష్ప 2 రూట్ మ్యాప్‌లో 'పెద్ది'.. రికార్డుల వేట మొదలుకానుందా?

Big TV Live 1 week ago

Peddi Promotions :కొన్నేళ్లుగా సరైన సినిమా లేని లోటుని తీర్చేందుకు పెద్ది రూపంలో సునామీ స్ప్రుష్టించడానికి రెడీ అయ్యాడు చరణ్.ఇక ఇప్పటికే సినిమా జూన్ 4న వస్తుందని మేకర్స్ అనౌన్స్ చేశారు కూడా.

అయితే, ఒకవైపు భారీ అంచనాలు, మరోవైపు ఎగ్జిబిటర్ల అల్టిమేటం ..వెరసి సినిమా రెండు పడవల మీద జర్నీ చేస్తున్నట్టే ఉంది.అయితే ఇవేవీ మా సినిమాని ఆపలేవంటూ ప్రమోషన్స్ లో మరింత జోరు చూపించేందుకు రెడీ అవుతుంది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ మరియు వృద్ధి సినిమాస్ కలిసి నిర్మించిన ఈ సినిమా కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా పాన్ ఇండియా రేంజ్‌లో రికార్డులు కొల్లగొట్టాలని పక్కా ప్లాన్ తో వస్తుంది.

'పుష్ప 2' సృష్టించినప్రభంజనం

ఇక ఈ సినిమా ప్రమోషన్ల స్ట్రాటజీ గతంలో 'పుష్ప 2' సృష్టించినప్రభంజనం గుర్తుకు వస్తోంది. అల్లు అర్జున్ ఏలా అయితే దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ చేసి సినిమాపై హైప్ క్రియేట్ చేశాడో , ఇప్పుడు చరణ్ కూడా అదే రూట్ మ్యాప్‌ను ఫాలో అవుతున్నారు. ఈ నెల 18 నుంచి జూన్ 2 వరకు సాగే సుదీర్ఘ ప్రచార షెడ్యూల్‌ను అనౌన్స్ చేసింది మూవీ టీమ్ .

also read :హీరోగా ఓకే.. మరి నిర్మాతగా? రెంటల్ సిస్టమ్ వివాదంలో కిరణ్ అబ్బవరం షాకింగ్ ఆన్సర్
విశాఖపట్నం, విజయనగరం వంటి మాస్ సెంటర్ల నుంచి మొదలుపెట్టి.. ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, భోపాల్ వంటి మెట్రో నగరాల వరకు 'పెద్ది' టీమ్ ప్రమోషన్స్ ని హోరెత్తించనుంది. ముఖ్యంగా రామ్ చరణ్‌తో పాటు జాన్వీ కపూర్ ఈ ఈవెంట్లలో పాల్గొనడం బాలీవుడ్ బెల్ట్‌లో సినిమాకు మైలేజ్ పెంచుతుందని భావిస్తున్నారట మేకర్స్ .ఇక భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం వర్కవుట్ అవ్వాలంటే కేవలం తెలుగునే నమ్ముకోకుండా కచ్చితంగా హిందీ మార్కెట్‌లోనూ సత్తా చాటాల్సిందే అంటూ సాలిడ్ ప్లానింగ్‌తో వెళ్తున్నారు.

'పెద్ది' సినిమాను ప్రదర్శించబోము

అయితే, ఇంతటి భారీ ప్రచారం జరుగుతున్న సమయంలో తెలంగాణ ఎగ్జిబిటర్లు బాంబు పేల్చారు. తెలంగాణలోని సింగిల్ స్క్రీన్ థియేటర్లలో 'పెద్ది' సినిమాను ప్రదర్శించబోమని వారు ప్రకటించడం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయ్యింది. వివాదానికి కారణం పాతకాలపు 'ఫిక్స్‌డ్ రెంటల్' విధానం. కోవిడ్ తర్వాత థియేటర్లు నడపడం కష్టమవుతోందని, మల్టీప్లెక్స్‌లలాగే తమకు కూడా రెవెన్యూ షేరింగ్ ఇవ్వాలని ఎగ్జిబిటర్లు పట్టుబడుతున్నారు. 23 థియేటర్లతో మొదలైన ఈ 'బాయ్‌కాట్' సెగ ఇపుడు స్టేట్ వైడ్ గా తాకడంతో సినిమా అసలు నైజాంలో రిలీజ్ అవుతుందా లేదా అన్న డైలమాలో పడిపోయారు మూవీ లవర్స్.ఒకవేళ నైజాం సింగిల్ థియేటర్స్ లో మాత్రం సినిమా పడకపోతే అది కలెక్షన్స్ కి పెద్ద దెబ్బే.

also read :వీడు దొంగ కాదు.. టాలెంటెడ్! సెకన్లలో కుళాయి మాయం.. వీడియో వైరల్

ఇక ప్రస్తుతం టాలీవుడ్ పెద్దలు ఈ సమస్యను పరిష్కరించేందుకు రంగంలోకి దిగినట్టు తెలుస్తుంది.'పెద్ది' సినిమాకు వస్తున్న పాజిటివ్ బజ్ చూస్తుంటే,ఇలాంటి చిన్న చిన్న ఇష్యూలని సాల్వ్ చేసుకొని ముందుకెళితే అందరికి మంచిదన్న భావన ఇండస్ట్రీలో ప్రతీ ఒక్కరిలో కనిపిస్తుంది.చూడాలి మరి ఒక వైపు పెద్ది ప్రమోషన్ల జోరు ,మరో వైపు ఇంటి పోరు ..వీటిని తట్టుకొని చరణ్ ఎలా నిలబడతాడో చూడాలి !

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live