Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రామ్ చరణ్ 'పెద్ది'పై నెగిటివిటీ తీసుకొస్తే ఇక అంతే!.. మూవీ టీం అంతా పక్కాగా ప్లాన్ చేసుకున్నారు..

రామ్ చరణ్ 'పెద్ది'పై నెగిటివిటీ తీసుకొస్తే ఇక అంతే!.. మూవీ టీం అంతా పక్కాగా ప్లాన్ చేసుకున్నారు..

Big TV Live 1 month ago

Peddi Movie Trolls: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' (Peddi).

జూన్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతున్న ఈ సినిమాపై అటు అభిమానుల్లో, ఇటు ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, సినిమా రిలీజ్ దగ్గరపడుతున్న తరుణంలో సోషల్ మీడియా వేదికగా సినిమాపై ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న ‘కోఆర్డినేటెడ్ హేట్ క్యాంపెయిన్’పై చిత్ర బృందం కఠినమైన చట్టపరమైన చర్యలకు శ్రీకారం చుట్టింది. సినిమా ప్రతిష్టను దెబ్బతీసేలా, కావాలనే నెగిటివిటీని వ్యాప్తి చేస్తున్న కొందరు వ్యక్తులపై టీమ్ Peddi లీగల్ యాక్షన్ తీసుకుంది అని చెప్పుకొచ్చారు.

Read also-Janvikapoor : మిర్రర్ ముందు సెల్ఫీలతో మతిపోగొడుతున్న జాన్వీ.. వైట్ డ్రెస్ లో లుక్ అదిరింది..

హైదరాబాద్, గుంటూరులలో FIRలు నమోదు

సోషల్ మీడియాలో రకరకాల హ్యాండిల్స్ మరియు మల్టిపుల్ అకౌంట్స్‌ను ఉపయోగించి ‘పెద్ది’ చిత్రంపై, చిత్ర యూనిట్‌పై టార్గెటెడ్ నెగిటివిటీని వ్యాప్తి చేస్తున్నారనే ఆరోపణలపై చిత్ర బృందం సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు వినోద్ నిమ్మగడ్డ, వినోద్ యాదవ్ అనే వ్యక్తులపై గుంటూరు, హైదరాబాద్ నగరాల్లోని పోలీస్ స్టేషన్లలో అధికారికంగా ఎఫ్‌ఐఆర్‌లు (FIRs) నమోదయ్యాయి.

పెయిడ్ ట్రోలింగ్ పై ఉక్కుపాదం

సినిమా ప్రమోషన్స్, సాంగ్స్, ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుండి ఒక వర్గం కావాలనే నెగిటివ్ హ్యాష్‌ట్యాగ్‌లను ట్రెండ్ చేయడం, డీగ్రేడ్ చేసేలా కామెంట్లు పెట్టడం వంటివి గమనించిన డిజిటల్ టీమ్, ఇదంతా ఒక పద్ధతి ప్రకారం జరుగుతోందని గుర్తించింది. ఇందుకు సంబంధించిన డిజిటల్ ఐపీ (IP) అడ్రస్‌లు, అకౌంట్ల వివరాల వంటి పక్కా ఆధారాలను సేకరించి పోలీసులకు అందజేసింది.

సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం

ఆన్‌లైన్ వేధింపులు, హేట్ స్పీచ్ మరియు ఉద్దేశపూర్వకంగా డిజిటల్ మాధ్యమాల్లో ఒకరిని టార్గెట్ చేయడం వంటి అంశాలపై సుప్రీంకోర్టు (Supreme Court) ఇచ్చిన గత మార్గదర్శకాలను బేస్ చేసుకుని ఈ చట్టపరమైన చర్యలను వేగవంతం చేశారు. భావప్రకటన స్వేచ్ఛ పేరుతో హద్దులు దాటి పరువు నష్టం కలిగించేలా ప్రవర్తిస్తే కఠినమైన సైబర్ చట్టాల కింద జైలు శిక్ష తప్పదని లీగల్ టీమ్ హెచ్చరించింది.

Read also-బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్‌కు ఏమైంది.. అసలు ఆ పనులు ఏంటి.. దానికోసమేనా?

నిఘాలో మరికొన్ని అకౌంట్లు

కేవలం ఈ ఇద్దరి పైనే కాకుండా, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ (X/Twitter, Instagram, YouTube) లో యాక్టివ్‌గా ఉంటూ సినిమా కలెక్షన్లపై, కంటెంట్‌పై అసత్య ప్రచారాలు చేయడానికి సిద్ధమవుతున్న మరికొన్ని గ్రూపులు, అకౌంట్లపై కూడా సైబర్ టీమ్ ప్రత్యేక నిఘా పెట్టింది. భవిష్యత్తులోనూ ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా నేరుగా చట్టపరమైన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.

ఒకవైపు ఆన్‌లైన్ ట్రోలింగ్‌పై ఫైట్ చేస్తూనే, మరోవైపు సినిమా లీకేజీలను అడ్డుకునేందుకు కూడా టీమ్ గట్టి చర్యలు తీసుకుంది. మద్రాస్ హైకోర్టు నుండి ప్రత్యేకమైన ‘అశోక్ కుమార్ ఆర్డర్’ (జాన్ డో ఆర్డర్) ను కూడా పొందింది. దీని ప్రకారం సినిమాను అక్రమంగా లీక్ చేసే దాదాపు వేలాది పైరసీ వెబ్‌సైట్లను, టెలిగ్రామ్ లింకులను టెలికాం ఆపరేటర్లు తక్షణమే బ్లాక్ చేసేలా ఆదేశాలు జారీ అయ్యాయి.

టాలీవుడ్‌లో ఇటీవల కాలంలో పెద్ద సినిమాలను టార్గెట్ చేస్తూ పెయిడ్ ట్రోలింగ్ చేయడం ఒక పెద్ద సమస్యగా మారింది. ఈ ‘నెగిటివ్ కల్చర్’కు అడ్డుకట్ట వేసేలా ‘టీమ్ పెద్ది’ తీసుకున్న ఈ సంచలన నిర్ణయం ఇప్పుడు పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. చట్టపరమైన చర్యలతోనైనా ఈ సోషల్ మీడియా విష సంస్కృతికి బ్రేక్ పడుతుందో లేదో చూడాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live