Communal Posts: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో మత పరమైన ఉద్రిక్తతలు రెచ్చగొట్టేలా వార్తలు, సోషల్ మీడియాలో వచ్చిన పోస్టుల పై తెలంగాణ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.
అందుకు గాను ఇటీ వల కొన్ని ప్రముఖ మీడియా సంస్థలు వారి వినియోగదారులకు ఎక్స్, ఇన్ట్సా లో పోస్టులు పెట్టారు. సమాజంలో మనుషుల మద్య మత పరమైన అంశాలపై మాట్లాడుతూ సమాజంలో విద్వేషాలు రెచ్చ గొట్టే విధంగా ఈ పోస్టులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. అందుకు గాను కొందన్న మీడియా సంస్ధలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు.
చట్టం ప్రకారం..
సమాచార సాంకేతిక సవరణ చట్టం – 2008 ప్రకారం సెక్షన్ 69(A), 79(3)తో పాటు భారత్ నాగరిక్ సురక్షా సంహిత(BNSS) లొని సెక్షన్ 179 కింద పోలీసులు లీగల్ నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులు మొత్తం 17 అకౌంట్లకి ఇచ్చినట్టుగా నోటీసులో పేర్కొన్నారు. వీటిలో AIMIM, అధికార హ్యండిల్, ది సియాసత్ డైలీ, బీఆర్ఎస్ భారత్, హిందుత్వ డాన్, ఆఫ్రష్ హేస్పేన్, వంటి కొంతమందికి ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు ఉన్నారు.
బండి బగీరథ్ కేసులో బిగ్ ట్విస్ట్.. బాధితురాలి తల్లి లేఖ వెనుక సంచలనాలు.. ఇరుకుంటున్న పెద్దలు
సోషల్ మీడియాలో కొన్ని లింకులు..
వీటిలో ఈ ఖాతాల ద్వారా షేర్ అవుతున్న వివాదాస్పద హష్ ట్యాగులు, కంటెంట్ ప్రజల్లో అశాంతినిరేకెత్తించే విధంగా ఉందని పోలీసులు పేర్కోన్నారు. నోటీసులు జారీ అనంతరం కొంత మంది ఇది మీడియా గొంతు నొక్కడమేనని, మీడియా స్వేచ్ఛను అణచివేయాలని చూస్తున్నారంటూ కొతం మంది జర్నలిస్టుటు మండిపడుతున్నారు. తక్షనమే దీనిపై అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.

