Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రఘు మాస్టర్ ఎంపిక చెల్లదు. సుమలత సంచలన వ్యాఖ్యలు!

రఘు మాస్టర్ ఎంపిక చెల్లదు. సుమలత సంచలన వ్యాఖ్యలు!

Big TV Live 1 week ago

Sumalatha: టాలీవుడ్ డాన్సర్స్ అసోసియేషన్ లో గత కొద్ది రోజులుగా వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ వివాదం తారా స్థాయికి చేరడమే కాకుండా రోజుకు ఒక మలుపు తిరుగుతుంది.

ఆగస్టు 30వ తేదీ డాన్సర్స్ అసోసియేషన్ సభ్యులు సమావేశం అయ్యి డాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రఘు మాస్టర్(Raghu Master) ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఇలా రఘు మాస్టర్ టెంపరరీ ప్రెసిడెంట్ గా ఎంపిక అవ్వడం పట్ల డాన్సర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షురాలు సుమలత (Sumalatha)మీడియా సమావేశంలో పాల్గొన్నారు..

కావాలనే నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు..

ఈ సమావేశంలో భాగంగా సుమలత మాట్లాడుతూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. డాన్సర్స్ అసోసియేషన్ ను కొంతమంది రెండు ముక్కలుగా విడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. మా యూనియన్ లో కొంతమంది కావాలనే నెగెటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారని అసోసియేషన్ సభ్యులను తప్పుదారి పట్టిస్తున్నారని తెలిపారు. నిన్న జరిగిన సమావేశంలో ఆడ హాక్ కమిటీ వేశారు. ఈ కమిటీలో ఉన్న సగం మంది సభ్యులు అవినీతిపరులే అంటూ ఈమె ఆరోపణలు చేశారు. ఫెడరేషన్ నాన్ కోపరేషన్ చేస్తున్నట్టు మాకు కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదని సుమలత ఫైర్ అయ్యారు.

అన్యాయాన్ని ప్రశ్నించినందుకే ఇబ్బందులు..

ఇలా ఫెడరేషన్ నాన్ కోపరేషన్ చేస్తున్నట్టు నోటీసులు ఇవ్వకపోయినప్పటికీ మిగతా 23 క్రాఫ్ట్స్ నాన్ కో ఆపరేషన్ చేస్తున్నట్టు లెటర్ పంపించారని ఈమె తెలియజేశారు. తప్పు చేసిన వాళ్లకు ఫెడరేషన్ అధ్యక్షుడిగా ఎలా సపోర్ట్ చేస్తారని ప్రశ్నించారు. మా అసోసియేషన్ కి ఇలా జరుగుతుంటే మిగతా 23 క్రాఫ్ట్స్ కూడా ఒకసారి ఆలోచించుకోవాలని ఈరోజు మాకు జరిగింది రేపు మీకు జరగదని గ్యారెంటీ ఏంటి అంటూ ప్రశ్నించారు. మా క్రాఫ్ట్ లో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించినందుకే మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఈమె తెలిపారు. డాన్సర్స్ ఇబ్బందుల గురించి ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ కి తెలియజేశాము కమిటీ వేస్తాము అని చెప్పారు కానీ ఇప్పటివరకు జరగలేదని, ఫెడరేషన్ లో సమస్య ఎక్కడుందో అనిల్ గుర్తించాలి అంటూ ఈమె తెలిపారు .

నడిరోడ్డు మీద బట్టలిప్పి కొడతా..

కొంతమంది యూనియన్ ను రెండు ముక్కలుగా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు వారికి నేను ఒకటే చెబుతున్నాను అలాంటి వాళ్ళను నడిరోడ్డు మీద బట్టలిప్పి కొడతాను అంటూ ఫైర్ అయ్యారు. చిరంజీవి గారు పిలిచి మాట్లాడారు. ఆయనే మా ఈ సమస్యను పరిష్కరించాలని, బాలకృష్ణ గారు మాతో మాట్లాడారనే విషయం గురించి నాకు తెలియదు అలాగే బాలకృష్ణ గారితో ఎలాంటి చర్చలు జరగలేదని సుమలత తెలిపారు. ఇలా మీడియా సమావేశంలో భాగంగా డాన్సర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడి గురించి అసోసియేషన్ లో ఉన్న సమస్యల గురించి సుమలత చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live