Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రైతు డిస్కం ఏర్పాటుపై ఉత్కంఠ.. సీఎం రేవంత్ వ్యూహం నెగ్గేనా..!

రైతు డిస్కం ఏర్పాటుపై ఉత్కంఠ.. సీఎం రేవంత్ వ్యూహం నెగ్గేనా..!

Big TV Live 2 weeks ago

Rythu DISCOM:స్వేచ్చ బ్యూరో: రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి ప్రత్యేకంగా రైతు విద్యుత్ పంపిణీ సంస్థ(రైతు డిస్కం)ను ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయించింది.

జూన్ 2 నుంచి డిస్కం కార్యకలాపాలు సాగించాలని భావించింది. అయితే రైతు డిస్కం ఏర్పాటు అంశం ఇప్పుడు తీవ్ర ఉత్కంఠగా మారింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండటంతో ఏం జరుగుతుందోననే ఉత్కంఠ మొదలైంది. కొత్త డిస్కం ఏర్పాటును ప్రతిపక్షాలు ముక్త కంఠంతో వ్యతిరేకించడంతో తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి ఎలాంటి నిర్ణయం తీసుకుంటోందనన్న ఆందోళన మొదలైంది. విద్యుత్ నియంత్రణ మండలిలో రైతు డిస్కం ఏర్పాటుకు సంబంధించిన అంశం ఉండటంతో తుది నిర్ణయం వచ్చే వరకు ఉత్కంఠ వీడేలా కనిపించడంలేదు.

వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు: సీఎం రేవంత్ రెడ్డి

రైతులకు మరింత నాణ్యమైన, నమ్మకమైన ఉచిత విద్యుత్ అందించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కొత్త డిస్కం ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, రైతు సంక్షేమం దృష్ట్యా ఈ నిర్ణయంపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని రేవంత్ సర్కార్ స్పష్టం చేస్తోంది. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. ఇప్పటికే ఉన్న దక్షిణ(ఎస్పీడీసీఎల్), ఉత్తర(ఎన్పీడీసీఎల్) పంపిణీ సంస్థలు వేల కోట్ల రూపాయల నష్టాల్లో కూరుకుపోయాయని విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. సంక్షోభంలో ఉన్న పాత డిస్కంలను గట్టెక్కించడం మానేసి, కొత్త సంస్థను ఏర్పాటు చేయడం వల్ల అదనపు భారం పడుతుందని విమర్శిస్తున్నాయి.

రేవంత్ సర్కార్ వ్యూహం..

కొత్తగా రైతు డిస్కం ఏర్పాటు చేస్తే, ప్రస్తుతం ఉన్న రెండు డిస్కంలతో సమన్వయం చేసుకోవడం చాలా కష్టతరంగా మారుతుందని విద్యుత్ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మౌలిక వసతులు, సిబ్బంది విభజన, విద్యుత్ లైన్ల నిర్వహణ వంటి సాంకేతిక అంశాల్లో తీవ్ర గందరగోళం ఏర్పడే ప్రమాదం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ వ్యవహారమంతా ప్రస్తుతం తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి ముందుకు వచ్చింది. ప్రతిపక్షాల అభ్యంతరాలు, నిపుణుల కమిటీ నివేదికలు, ప్రభుత్వ వాదనలను పరిశీలించిన తర్వాతే ఈ కొత్త డిస్కంకు అనుమతి లభించనుంది. దీంతో బంతి ఇప్పుడు నియంత్రణ మండలి కోర్టులోనే ఉంది. రేవంత్ సర్కార్ వ్యూహం ఫలించి రైతు డిస్కం రూపుదిద్దుకుంటుందా, లేదా అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.

Also read: ఢిల్లీ పెద్దల ప్లాన్‌ను బయటపెట్టిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్..!

తీవ్ర ఆర్థిక సమస్యల్లో తెలంగాణ డిస్కంలు

తెలంగాణ డిస్కంలు ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నాయి. స్థాపన నుంచి వీటి ఆర్థిక స్థితి బలహీనంగా ఉండటంతో పాటు, నిర్వహణ సామర్థ్యం కూడా తక్కువ స్థాయిలో ఉంది. 2025 నాటికి తెలంగాణ డిస్కంల సమీకృత నష్టాలు సుమారు రూ.69,741 కోట్లుగా ఉంది. ప్రభుత్వ విభాగాల నుంచి రావాల్సిన బకాయిలు రూ.54,090 కోట్లు ఉన్నాయి. 2025 ఆర్థిక సంవత్సరంలో అగ్రిగేట్ టెక్నికల్ అండ్ కమర్షియల్(ఏటీసీ) నష్టాలు సుమారు 19.8 శాతంగా నమోదయ్యాయి. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ సమగ్ర ర్యాంకింగ్స్‌లో తెలంగాణ డిస్కంలకు 'సీ-' రేటింగ్ లభించడం గమనార్హం. ఇతర రాష్​ట్రాలతో పోలిస్తే.. సమీకృత నష్టాల పరంగా తమిళనాడు తరువాత తెలంగాణ రెండో స్థానంలో ఉంది. ఏటీసీ నష్టాలు జాతీయ సగటు 15.04 శాతం కంటే ఎక్కువగా ఉన్నాయి. అత్యంత దీన స్థితిలో తెలంగాణ డిస్కంలు ఉన్నట్లుగా ఈ నివేదికలు చెబుతున్నాయి. కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక వంటి పొరుగు రాష్ట్రాల కంటే తెలంగాణ పనితీరు బలహీనంగా ఉండటం గమనార్హం. ఇకపోతే ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. 14వ సమగ్ర ర్యాంకింగ్స్‌లో ఎస్పీడీసీఎల్ 52వ స్థానంలో ఉండగా, ఎన్పీడీసీఎల్ 54వ స్థానంలో ఉంది. దేశంలో చివరి స్థానంలో ఎన్పీడీసీఎల్ ఉంది. ఇది దేశంలోని ఆయా రాష్ట్రాల డిస్కంలతో పోలిస్తే.. తెలంగాణ డిస్కంల పనితీరు తక్కువగా ఉందని సూచిస్తోంది.

నాణ్యమైన కరెంట్ అందించడమే లక్ష్యం : రైతు డిస్కం సీఎండీ ముషారఫ్ ఫరూఖీ

రైతు డిస్కం ఏర్పాటుపై తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి కార్యాలయంలో శుక్రవారం బహిరంగ విచారణ జరిగింది. ఈఆర్సీ చైర్మన్ జస్టిస్ నాగార్జున అధ్యక్షతన మెంబర్ టెక్నికల్ రఘు, మెంబర్ ఫైనాన్స్ శ్రీనివాసరావు సమక్షంలో ఈ విచారణ జరిగింది. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8:35 వరకు సుదీర్ఘంగా ఈ విచారణ సాగింది. ఈ సందర్భంగా రైతు డిస్కం సీఎండీ ముషారఫ్ ఫరూఖీ మాట్లాడుతూ.. రైతులకు నాణ్యమైన కరెంట్ అందించడమే రైతు డిస్కం లక్ష్యమని పేర్కొన్నారు. రైతుల పేరిట ఇతరులు కరెంట్ ను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. అలా జరగకుండా చూసేందుకు రైతు డిస్కం ఏర్పాటును ప్రపోజ్ చేస్తున్నట్లు తెలిపారు. పాత రెండు డిస్కంలతో పాటు కొత్తగా ఏర్పడే డిస్కం కూడా హెల్తీగా ఉండాలన్నారు. దీనికోసం అధికారులు, సిబ్బంది కమిట్ మెంట్ తో పనిచేయాలని కోరారు. రైతులను డిస్టర్బ్ చేయబోమని స్పష్టంచేశారు.

కొత్తగా మీటర్ల ఏర్పాటు..

రాష్ట్రంలోని రైతులకు కరెంట్ సమస్యలు తీర్చేందుకు ప్రత్యేక డిస్కం అవసరమని ఆయన వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర, హర్యానాలో కూడా రైతు డిస్కం ఏర్పాటుకు అక్కడి ప్రభుత్వాలు ముందుకు వచ్చాయని వెల్లడించారు. తెలంగాణలో రైతు డిస్కం ఏర్పాటు నిర్ణయం తర్వాతే వాళ్ళు కూడా అనౌన్స్ చేశారని గుర్తుచేశారు. మోటార్లకు మీటర్లు పెడుతామని అంటున్నారని, అలాంటిదేమీ ఉండబోదని ముషారఫ్ స్పష్టంచేశారు. కొత్తగా మీటర్లను ఏర్పాటు చేసే ఆలోచనే లేదన్నారు. ప్రస్తుతం రెండు డిస్కంల నుంచి 2000 మందిని మ్యాన్ పవర్ ను తీసుకుంటామని, అందులో ఇంజినీర్లు 660 మంది కాగా.., ఆపరేషన్స్ అండ్ మెయింటనెన్స్, ఆర్టీజన్లు 1000 మంది ఉంటారన్నారు. అడ్మినిస్ట్రేషన్ లో 340 మంది అవసరమని పేర్కొన్నారు. రైతు డిస్కం నిర్ణయం ఆదరాబాదరాగా తీసుకున్నది కాదని, రైతు డిస్కం ఏర్పాటు ప్రక్రియ గతేడాది జూలై 2025లోనే ప్రారంభమైందని వెల్లడించారు.

Also read: Faria Abdullah : ఎర్రని చీరలో రెచ్చగొడుతున్న చిట్టి.. బ్యాక్ అందాలకు మెంటలెక్కాల్సిందే..

మాకు ఎలాంటి ఆబ్జెక్షన్స లేవు: ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ సీఎండీలు

ఇదిలా ఉండగా ఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వీ పాటిల్ మాట్లాడుతూ.. రైతు డిస్కం ఏర్పాటును స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ఈ కొత్త రీ ఫార్మ్స్ ను ముందుకు తీసుకెళ్లడంలో పూర్తిగా సహకరిస్తామన్నారు. అనంతరం ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి మాట్లాడుతూ.. తమ వైపు నుంచి రైతు డిస్కం ఏర్పాటుకు ఎలాంటి ఆబ్జెక్షన్ లేదన్నారు. వినియోగదారులకు మంచి, మెరుగైన సేవలు అందించడమే లక్ష్యమని పేర్కొన్నారు. అందుకు అన్ని విధాలుగా సహకారం అందిస్తామని స్పష్టంచేశారు.

టీజీఈఆర్సీ చైర్మన్ నాగార్జున మాట్లాడుతూ..

రైతు డిస్కం ఏర్పాటుపై 33 మంది నుంచి ఆబ్జెక్షన్స్ వచ్చాయని వెల్లడించారు. వారితో పాటు సమయం ముగిశాక కూడా ఇంకా కొందరు ఆబ్జెక్షన్ తెలిపారని, వారికి కూడా మాట్లాడే అవకాశాన్ని ఆయన కల్పించారు. రైతు డిస్కమ్ కు లైసెన్స్ ఇస్తామో లేదో తెలియదని, లైసెన్స్ ఇచ్చిన తర్వాత వ్యాపార ప్రణాళిక పై స్పష్టత వస్తుందని ఆయన వెల్లడించారు.

రైతు డిస్కంతో వ్యవసాయానికి ఎండ్రీన్ పోసినట్టే: కల్వకుంట్ల కవిత

రైతు డిస్కం ఏర్పాటు జరిగితే వ్యవసాయ రంగానికి ఎండ్రీన్ పోసినట్టే అవుతుందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత విమర్శించారు. రైతు డిస్కం ఏర్పాటును ఏసీ రూములో కూర్చుని డిసైడ్ చేయడం దురదృష్టకరమన్నారు. 33 జిల్లాల్లో ఇలాగే బహిరంగ విచారణ చేపట్టాలని ఆమె కోరారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు రైతులు, ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు. తెలంగాణలో రైతులు ఎంతో కష్టపడి 29 లక్షల బోర్లు వేసుకున్నారన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత కేసీఆర్ సీఎం అయ్యాక రూ.లక్ష కోట్లతో కరెంట్ ను అందించారని గుర్తుచేశారు. ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ నిర్ణయంతో రైతుల బతుకులు డోలాయమానంలో పడతాయని ఆవేదన వ్యక్తంచేశారు. రైతులకు అన్యాయం చేస్తూ 1999 నాటి కాల్పుల ఘటనను ప్రభుత్వం కొని తెచ్చుకోవద్దని సూచించారు. నిజంగా రైతులకు మంచి చేసే నిర్ణయమే అయితే ఎందుకు సీక్రెట్ గా ఉంచారని ఆమె ప్రశ్నించారు.

మూడు గంటల కరెంటుపై బీఆరెస్ దుష్ప్రచారం..! దేన్నీ వదలడం లేదుగా..! దీన్ని తిప్పికొట్టే నాథుడు లేడు కాంగ్రెస్‌లో..!

బోర్ల ద్వారా నీళ్లు..

ఈఆర్సీ కారణంగా ఈ అంశం బయటకు వచ్చిందే తప్ప ప్రభుత్వం బయటపెట్టలేదన్నారు. డిస్కంలకు రూ.వేల కోట్ల బకాయిలు పెట్టి ద్రోహం చేసింది ప్రభుత్వమేనని మండిపడ్డారు. తెలంగాణ రైతాంగం భవిష్యత్ ను ఆగం చేసే ఈ ప్రపోజల్ ను ఈఆర్సీ రిజెక్ట్ చేయాలని కోరారు. మేజర్ ప్రాజెక్ట్ లు అయిన కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి నుంచి ఒక్క ఎకరానికి నీళ్లు రాకపోయినా సరే బోర్ల ద్వారా నీళ్లు వచ్చాయని ఆమె వ్యాఖ్యానించారు. రైతు డిస్కం ఏర్పాటుపై అసెంబ్లీలో ఎందుకు చర్చ పెట్టలేదని కవిత ప్రశ్నించారు. ఇప్పటికే డిస్కంల పరిస్థితి బాగాలేదని ప్రభుత్వమే చెబుతోందని, మళ్లీ రైతు డిస్కం ద్వారా రైతులకు, లిఫ్ట్ ఇరిగేషన్ కు, ఫ్రీ కరెంట్ స్కీమ్ ఇచ్చే కరెంట్ కు ప్రభుత్వమే డబ్బులు ఇవ్వాల్సి వస్తుందన్నారు. ఇప్పటికే రూ.25 వేల కోట్ల నష్టంలో డిస్కంను కంపెనీ పేరుతో రిజిస్టర్ చేస్తామంటున్నారని మండిపడ్డారు. కొత్త డిస్కంకు 42 శాతం లోడ్ ను ట్రాన్స్ ఫర్ చేస్తామని చెబుతున్నారని వ్యాఖ్యానించారు. డిస్కమ్ లకు సంబంధించి 45 వేల మంది ఉద్యోగులు ఉంటే 2 వేల మందిని మాత్రమే ట్రాన్స్ ఫర్ చేస్తామంటున్నారని చురకలంటించారు. వారిలో కూడా వెయ్యి మంది ఆఫీస్ లలో లెక్కలు రాసే వారే ఉంటారన్నారు. ట్రాన్స్ ఫార్మర్లు రిపేర్ వస్తే వెయ్యి మంది మాత్రమే రిపేర్ చేసే వాళ్లు ఉంటారని, అంటే మండలానికి ఒక్కరు కూడా లేని పరిస్థితి ఉందన్నారు.

కవిత ఫైర్..

గతంలో ట్రాన్స్ ఫార్మర్ రిపేర్ సెంటర్లు నియోజకవర్గం కేంద్రంలో ఉండేవని, ఇప్పుడు తాలుకాకు మార్చుతున్నామని చెబుతున్నారన్నారు. అంటే ట్రాన్స్ ఫార్మర్ రిపేర్ వస్తే రెండు నెలల సమయం పడుతుందన్నారు. వేరే డిస్కంలకు సంబంధించిన వారిని వాడుకుంటామని చెబుతున్నారని, కానీ గవర్నమెంట్ విభాగాల మధ్య కో ఆర్డినేషన్ ఉండదని ఆమె వెల్లడించారు. అందులో విల్లింగ్ చార్జీల పేరుతో రూ.6 వేల కోట్లు ఇస్తామంటున్నారని పేర్కొన్నారు. దీన్నిబట్టి సబ్సిడీ, డొమెస్టిక్ ఫ్రీ కరెంట్ కు ఇవ్వాల్సిన మొత్తంతో పాటు.. ప్రభుత్వం పెట్టిన బకాయిలు రూ.35 వేల కోట్లు ఉన్నాయని తెలిపారు. అలాంటప్పుడు ఈ కంపెనీ లాభాల్లో ఎలా ఉంటుందని కవిత ప్రశ్నించారు. అంతగా కావాలంటే ముందు తెలంగాణలో పైలట్ ప్రాజెక్ట్ చేయాలని, ఆ తర్వాత పరిస్థితుల ఆధారంగా రైతు డిస్కం ఏర్పాటు చేయాలని గుర్తుచేశారు. తెలంగాణ డిస్కంలలో ఆంధ్రుల పెత్తనం ఉండకూడదన్నారు. డిస్కంలు రూ.69 వేల కోట్లు నష్టాల్లో ఉంటే రూ.54 వేల కోట్లు ప్రభుత్వం నుంచే రావాల్సి ఉందన్నారు. రైతుల మోటార్లకు మీటర్లు పెట్టే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తోందని కవిత మండిపడ్డారు.

Also read: తండ్రి దాచిన రహస్యం.. ముక్కలైన కుటుంబం: ఓటీటీలోకి మైండ్ బ్లాక్ చేసే ఫ్యామిలీ డ్రామా

3 గంటల కరెంట్ చాలా?: మాజీ మంత్రి హరీశ్ రావు

కాంగ్రెస్ నేత, రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతులకు 24 గంటల పాటు కరెంట్ అవసరం లేదని, 3 గంటల కరెంట్ చాలని కోదండరెడ్డి చెప్పడంపై హరీశ్ రావు ధ్వజమెత్తారు. ఈఆర్సీ ఎదుట కోదండ రెడ్డి చెప్పింది ఆయన వ్యక్తిగత అభిప్రాయం కాదని, రేవంత్ మనసులో మాట బయట పెట్టారని చురకలంటించారు. రైతు డిస్కం పేరిట చేస్తున్న నాటకాలు 24 గంటల కరెంట్ కు కోత పెట్టేందుకేనా అంటూ ఫైరయ్యారు. రైతు కష్టం తెలియని వాళ్లే 3 గంటల కరెంట్ చాలని మాట్లాడగలరంటూ ఎద్దేవాచేశారు. కాంగ్రెస్ రైతును మళ్లీ చీకట్లలోకి నెట్టే ప్రయత్నం చేస్తోందని విరుచుకుపడ్డారు. కరెంట్ కోతలతో, రైతులకు వాతలు పెట్టాలని చూస్తున్న రేవంత్ కుట్రలను యావత్ తెలంగాణ రైతాంగం గమనిస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పే రోజు దగ్గరలోనే ఉందని హరీశ్ రావు ఒక ప్రకటనలో తెలిపారు.

విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ పరం చేసే కుట్ర: బీఆర్ఎస్

ఉచిత విద్యుత్ ను రద్దు చేసేందుకు రైతు డిస్కం ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా తీసుకొచ్చిందని మాజీ మంత్రులు జగదీశ్ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఈఆర్సీ ఎదుట వాదనలు వినిపించారు. రైతు డిస్కం ఆలోచనలను కాంగ్రెస్ వెంటనే వెనక్కి తీసుకోవాలని భారత రాష్ట్ర సమితి తరుపున వారు డిమాండ్ చేశారు. రైతు డిస్కం నిజానికి రైతుల ప్రయోజనాల కోసం కాదని వారు పేర్కొన్నారు. రైతులకు అందుతున్న ఉచిత విద్యుత్‌ను క్రమంగా ఎత్తివేయడంతో పాటు విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించేందుకు రూపొందించిన కుట్రలో భాగమని ఆరోపించారు. రైతు డిస్కామ్ పేరుతో ఏర్పాటు చేస్తున్న సంస్థ రైతులను చీకట్లలోకి నెట్టే ఉరి డిస్కంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

లాయర్ మొయినోద్దీన్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. అలామ్ ఖాన్ అతని కొడుకు అరెస్ఠ్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live