Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రజనీకాంత్ జైలర్ 2 వాయిదాపై మేకర్స్ క్లారిటీ..వెనక్కి తగ్గేదేలే!

రజనీకాంత్ జైలర్ 2 వాయిదాపై మేకర్స్ క్లారిటీ..వెనక్కి తగ్గేదేలే!

Big TV Live 3 days ago

Jailer 2 Movie: కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్లో ఇదివరకు ప్రేక్షకుల ముందుకు వచ్చిన జైలర్(Jailer) సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఈ సినిమా మంచి విజయాన్ని అందుకున్న నేపథ్యంలో ఈ సినిమాకు సీక్వెల్ చిత్రాన్ని కూడా ప్రకటించారు. ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాలవల్ల వాయిదా పడుతూ వస్తుంది. అయితే ఈ సినిమా అక్టోబర్ 15వ తేదీ విడుదల కాబోతున్నట్లు చిత్ర బృందం వెల్లడించారు కానీ చివరి నిమిషంలో ఈ సినిమా వాయిదా పడింది అంటూ వార్తలు వచ్చాయి..

జైలర్ వాయిదా పై మేకర్స్ క్లారిటీ..

ఇలా ఈ సినిమా విడుదల విషయంలో సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ వార్తలను ఖండిస్తూ చిత్ర బృందం ఈ సినిమా విడుదల తేదీని అధికారకంగా ప్రకటిస్తూ మరొక పోస్టర్ విడుదల చేశారు. రజనీకాంత్ నెల్సన్ కాంబోలో తెరకెక్కిన జైలర్ 2 (Jailer 2)సినిమా అక్టోబర్ 15వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుందని ఇక పోస్ట్ పోన్ అయ్యే చాన్సే లేదంటూ చిత్ర నిర్మాతలు తెలియజేశారు. ఈ సినిమా ఇదివరకే అక్టోబర్ 15న విడుదల కాబోతుందని తెలిపారు .కానీ ఈ సినిమాలో పొలిటికల్ కి సంబంధించిన డైలాగ్ లు ఉన్న నేపథ్యంలో చివరి నిమిషంలో వాయిదా వేసుకుంటున్నారు అంటూ వార్తలు వచ్చాయి.

వెనక్కి తగ్గని జైలర్ 2..

ఈ సినిమాలో మొదట విజయ్ రాజకీయాల్లో గెలవరు అనుకోని రజనీ ప్రభుత్వం, రాజకీయ పనితీరుపై కొన్ని ఘాటు డైలాగ్స్ చెప్పాడట. ఈ డైలాగ్స్ విషయంలో వెనక్కి తగిన డైరెక్టర్ నెల్సన్ కొత్త డైలాగులతో రీ షూటింగ్ చేయబోతున్నారని అందుకే అనుకున్న సమయానికి ఈ సినిమా విడుదల కాదంటూ వార్తలు వచ్చాయి కానీ ఈ వార్తలు అన్నింటిని కొట్టి పారేస్తూ సన్ పిక్చర్ బ్యానర్స్ జైలర్ 2 సినిమా యధావిధిగా అక్టోబర్ 15వ తేదీని ప్రేక్షకుల ముందుకు రాబోతుందని క్లారిటీ ఇచ్చాడు.

ఇలా రజనీకాంత్ సినిమా అనుకున్న విధంగానే విడుదల కాబోతుందని తెలిసిన అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే అక్టోబర్ 16వ తేదీ టాలీవుడ్ ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ రష్మిక హీరో హీరోయిన్లుగా నటించిన రణబాలి సినిమా విడుదల కాబోతోంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో రజనీకాంత్ సినిమాతో విజయ్ పోటీ పడాల్సి వస్తుందని చెప్పాలి. ఇప్పటికే జైలర్ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈ సీక్వెల్ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమా పట్ల భారీగా అంచనాలను పెంచేశాయి. మరి జైలర్ సీక్వెల్ సినిమా ద్వారా రజనీకాంత్ ఎలాంటి సక్సెస్ అందుకుంటారఅనేది తెలియాల్సి ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live