Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Roja Selvamani: ఇదేందయ్యా ఇది.. జగన్‌ను కాపీ కొట్టి విజయ్ గెలిచారా? రోజా కామెంట్స్ వైరల్!

Roja Selvamani: ఇదేందయ్యా ఇది.. జగన్‌ను కాపీ కొట్టి విజయ్ గెలిచారా? రోజా కామెంట్స్ వైరల్!

Big TV Live 1 month ago

Roja Selvamani: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విజయ్ ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. దశాబ్దాల రాజకీయ చరిత్ర కలిగిన డీఎంకే (DMK), అన్నా డీఎంకే (AIADMK)లను ఓడించి..

అత్యధిక స్థానాలు గెలిచిన అతిపెద్ద పార్టీగా టీవీకే (TVK)ను నిలబెట్టారు. అన్ని అనుకున్నట్లు జరిగితే రేపో మాపో సీఎంగానూ ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే విజయ్ సాధించిన ఈ భారీ విజయాన్ని వైసీపీ తన ఖాతాలోకి వేసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. విజయ్ - జగన్ కలిసి ఉన్న ఫొటోలు.. వైసీపీ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో పెద్ద ఎత్తున కనిపిస్తుండటం ఈ ప్రచారానికి బలం చేకూరుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా వైసీపీ నేత, మాజీ మంత్రి రోజా.. జగన్ ను విజయ్ కాపీ కొట్టారంటూ అర్థం వచ్చేలా చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

అసలు రోజా ఏమన్నారంటే?

తమిళనాడులో విజయ్ సాధించిన గ్రాండ్ విక్టరీ గురించి.. మాజీ మంత్రి రోజా ఓ యూట్యూబ్ ఛానెల్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా విజయ్ సక్సెస్ ను జగన్ తో ఆమె ముడిపెట్టే ప్రయత్నం చేశారు. రోజా మాట్లాడుతూ.. మెుదటి నుంచి కూడా విజయ్ డ్రెస్సింగ్ స్టైల్ వైసీపీ అధినేత జగన్ ను పోలి ఉన్నాయని పేర్కొన్నారు. ఆయన స్పీచ్ లు (సింహం సింగిల్‌గా వస్తుంది), స్టేజ్ ల మీద ర్యాంప్స్ ఏర్పాటు చేయడం వంటివి చూస్తే జగన్ ను ఫాలో అయినట్లు స్పష్టంగా అర్థమవుతోందని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలోనూ జగన్ ఫొటోను.. తన చేతుల్లోకి తీసుకొని ప్రజలకు విజయ్ చూపించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా రోజా గుర్తుచేశారు.

విజయ్‌పై ప్రశంసలు..

అంతేకాకుండా టీవీకే అధినేత విజయ్ పై కూడా రోజా ప్రశంసల వర్షం కురిపించారు. తన గెలుపు గురించి ముందు నుంచే విజయ్ పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నారని కొనియాడారు. 'మనం గెలవబోతున్నాం.. మీరెవ్వరు భయపడాల్సిన అవసరం లేదు' అంటూ కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపారని పేర్కొన్నారు. గెలవగానే ర్యాలీలు లేకుండా పార్టీ ఆఫీసుకు వచ్చేయాలని పిలుపునివ్వడం ఆయన కాన్ఫిడెన్స్ కు అద్దం పడుతోందని రోజా అన్నారు. విజయ్ ప్రభావం పెద్దగా ఉండదని ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన ప్రిడిక్షన్ పైనా రోజా స్పందించారు. సినిమాల్లో స్టార్ డమ్ ను వదులుకొని విజయ్ వచ్చారని.. ఆయన ప్రభావం మామూల్గా ఉండదని తన మీటింగ్స్ లో చెప్పానని కూడా రోజా చెప్పుకొచ్చారు.

రోజా యూటర్న్ తీసుకున్నారా?

ఇదిలా ఉంటే రోజా తమిళనాడు ఎన్నికల్లో ఎం.కె. స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే (DMK)కు తన మద్దతు ప్రకటించారు. అంతేకాకుండా తెలుగు ప్రజల ప్రాబల్యం ఉన్న నియోజకవర్గాల్లో ఆమె ఆ పార్టీ తరపున ప్రచారం సైతం నిర్వహించారు. డీఎంకే పార్టీ అధికారంలోకి వస్తేనే తమిళనాడుకు మంచి జరుగుతుందని, సంక్షేమ పథకాలు బాగా అమలు అవుతాయని ఆమె ప్రచారంలో చెప్పుకొచ్చారు. అంతేకాకుండా డీఎంకే ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోను సైతం ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా విజయ్ సక్సెస్ ను కొనియాడటం, వైసీపీ అధినేత జగన్ తో ముడిపెడుతుండటం చూస్తే ఆమె యూటర్న్ తీసుకున్నారా? అన్న అభిప్రాయాలు రాజకీయంగా వ్యక్తమవుతున్నాయి.

Roja vs DMK: డీఎంకేను ముంచింది రోజానా? తెలిసి మరీ ఆ తప్పు చేశారా? నెట్టింట ఒకటే రోస్టింగ్!

రోజా వ్యాఖ్యలపై ట్రోల్స్..!

అయితే జగన్ ను అనుసరించడం ద్వారానే విజయ్ సక్సెస్ అయ్యారంటూ రోజా చేసిన పరోక్ష వ్యాఖ్యలను నెటిజన్లు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ముఖ్యంగా రోజా వ్యతిరేక వర్గం దీనిపై విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. జగన్ తరహాలో అవినీతి చేసి.. విజయ్ జైలుకు వెళ్లలేదని నెట్టింట పేర్కొంటున్నారు. బాబాయ్ హత్య, కోడి కత్తి, గులకరాయి డ్రామాలు విజయ్ చేయలేదంటూ సెటైర్లు వేస్తున్నారు. ఒకవేళ జగన్ తరహాలో విజయ్ కూడా వాటిని ఫాలో అయ్యుంటే ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ దాటి స్థానాలు వచ్చి ఉండేవేమో అని పోస్టులు పెడుతున్నారు. లేకుంటే మీకొచ్చిన 11 స్థానాలను విజయ్ కు ఇచ్చి.. తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించండి అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

Jagan - Vijay: జగన్ వ్యూహం.. విజయ్ విజయం, అసలు మేటర్ ఇదా!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live