Best Data Plans: నేటి ఆధునిక యుగంలో ఇంటర్నెట్ లేకపోతే ఏ పనీ జరగదు. అయితే ప్రతిసారీ నెలకు సరిపడా పెద్ద ప్లాన్లు వేసుకోవాలంటే అందరికీ కుదరకపోవచ్చు.
కొన్నిసార్లు మనం వాడుతున్న డైలీ డేటా కోటా మధ్యలోనే అయిపోవచ్చు. లేదా కేవలం ఒక్క రోజు కోసం అదనంగా కొంచెం డేటా అవసరం పడొచ్చు. ముఖ్యంగా వీడియో కాల్స్ మాట్లాడుకోవాలన్నా, ఏదైనా సినిమా చూడాలన్నా సడెన్‌గా డేటా అయిపోతే చాలా చిరాకు వేస్తుంది. అలాంటప్పుడు ఎక్కువ డబ్బులు పెట్టి రీఛార్జ్ చేసుకోకుండా జస్ట్.. రూ.100లోపే దొరికే ప్లాన్లను సద్వినియోగం చేసుకోవచ్చు. మరి జియో, ఎయిర్‌టెల్ వంటి కంపెనీలు అందిస్తున్న ఆ చౌకైన ప్లాన్లు ఏంటో ఒకసారి చూసేద్దామా!
Jio కొత్త ఫోన్ తీసుకున్నారా?
మీ వద్ద గనుక కొత్తగా జియో 4జీ ఫీచర్ ఫోన్ ఉన్నట్టయితే.. రూ.21 ప్లాన్ భలే వర్కౌట్ అవుతుంది. కేవలం రూ. 21కే నాలుగు రోజుల పాటు ప్రతిరోజూ అర GB డేటా వస్తుంది. దీనికి తోడు అన్‌లిమిటెడ్ కాల్స్, SMS సౌకర్యం కూడా ఉంది. కొత్తగా ఫోన్ వాడటం మొదలుపెట్టిన వారికి లేదంటే తక్కువలో పని ముగించాలనుకునే వారికి ఇదొక మంచి స్టార్టర్ ప్యాక్ అని చెప్పవచ్చు.
Airtel డేటా కావాలా?
ఎయిర్‌టెల్ వాడుతున్న వారికి రూ.49 ప్లాన్ సరిపోతుంది. సడెన్‌గా ఏదైనా పెద్ద ఫైల్ డౌన్‌లోడ్ చేయాలన్నా, ఫోన్‌లోని యాప్స్ అన్నీ అప్‌డేట్ చేయాలన్నా ఈ ప్లాన్‌ను వేసుకోవచ్చు. ఇది కేవలం ఒక రోజు మాత్రమే పనిచేస్తుంది కానీ, అన్‌లిమిటెడ్ డేటాను వాడుకునే ఛాన్స్ ఇస్తుంది. అర్జెంట్‌గా డేటా కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.
ఇంత తక్కువ ధరకే ఫ్లాగ్‌షిప్ ఫోనా? Motorola Edge 30 Proపై దిమ్మతిరిగే ధర తగ్గింపు!
తక్కువ ధరలో Vi స్మార్ట్ బూస్టర్..
వోడాఫోన్ ఐడియా (Vi) వినియోగదారుల కోసం రూ.22కే ఒక చిన్న డేటా బూస్టర్ అందుబాటులో ఉంది. మన రోజువారీ డేటా అయిపోయినప్పుడు.. కొంచెం బ్రౌజింగ్ చేయడానికి లేదంటే వాట్సప్ మెసేజ్‌లు పంపుకోవడానికి ఇది బాగా పనికొస్తుంది. ఒక్క రోజు వ్యాలిడిటీతో వచ్చే ఈ ప్లాన్‌లో 1GB డేటా లభిస్తుంది. చాలా తక్కువ ధరలో చిన్న అవసరాలకు ఇది సరిపోతుంది.
BSNL యూజర్లకు పండగే..
బీఎస్ఎన్ఎల్ అంటేనే తక్కువ ధర కదా. కేవలం రూ.59కే ఏకంగా వారం రోజుల వ్యాలిడిటీతో ఒక ప్లాన్ అందుబాటులో ఉంది. దీనిలో ప్రతిరోజూ 1GB డేటాతో పాటు అన్‌లిమిటెడ్ కాల్స్ కూడా మాట్లాడుకోవచ్చు. అంటే.. కేవలం ఒకరోజు డేటా కాకుండా.. వారం రోజుల పాటు కాల్స్, ఇంటర్నెట్ రెండూ కావాలనుకునే వారికి ఇది అదిరిపోయే ఛాయిస్.
వారం మొత్తానికి సరిపడే ప్లాన్ ఇదీ..
ఒక్కరోజు డేటా సరిపోదు అనుకునే Vi యూజర్లు రూ.69 ప్లాన్‌ను సద్వినియోగం చేసుకోవచ్చు. దీనిలో వారం రోజుల వ్యాలిడిటీతో పాటు మొత్తం 6GB డేటా వస్తుంది. దీనిని ఏడు రోజుల పాటు మన అవసరాన్ని బట్టి కొంచెం కొంచెంగా వాడుకోవచ్చు. యూట్యూబ్ చూడటానికి లేదంటే సోషల్ మీడియాలో స్క్రోలింగ్ చేయడానికి ఇది మంచి ప్లాన్.
యాపిల్ నుంచి క్రేజీ అప్డేట్.. అత్యాధునిక ఫీచర్లు, క్రేజీ కలర్స్‌లో రాబోతున్న iPhone 18 Pro!

