Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రూ.18 వేలకే.. స్టాండింగ్ డిష్‌వాషర్, వెంటనే కొనేయండి

రూ.18 వేలకే.. స్టాండింగ్ డిష్‌వాషర్, వెంటనే కొనేయండి

Big TV Live 3 weeks ago

Midea 8 Place Settings Dishwasher: ఇంట్లో రోజూ గిన్నెలు శుభ్రం చేయడం అనేది మహిళలకు శ్రమతో కూడుకున్న పని. ఈ కష్టానికి చెక్ పెట్టడానికి ఇప్పుడు ప్రతి ఒక్కరూ..

డిష్‌ వాషర్లను కొనడానికి ఆసక్తి చూపుతున్నారు. చిన్న కుటుంబాలు లేదా అపార్ట్‌మెంట్లలో ఉండే వారి కోసం మార్కెట్లో బెస్ట్ ఆప్షన్‌గా నిలిచింది ఈ మోడల్. అద్భుతమైన ఫీచర్లతో వస్తున్న ఈ డిష్‌వాషర్ ధర కూడా చాలా తక్కువ. తక్కువ ధరలో బెస్ట్ మోడల్ డిష్ వాషర్ కొనాలనుకునే వారికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.దీని ఫీచర్లు, ధరకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్తి వివరాలు:

ప్రత్యేకమైన వాషింగ్ ప్రోగ్రామ్‌లు:

ఈ డిష్‌ వాషర్ కేవలం పాత్రలను కడగడమే కాకుండా వాటిని అత్యంత శుభ్రంగా, హైజెనిక్‌గా ఉంచుతుంది.ఇందులో వివిధ రకాల వాషింగ్ ప్రోగ్రామ్‌లు అందుబాటులో ఉన్నాయి. జిడ్డు పట్టిన కడాయిలు, గిన్నెలపై ఉన్న మొండి మరకలను కూడా ఇది ఈజీగా తొలగిస్తుంది. హాట్ వాటర్ వాషింగ్ ఫీచర్ ఉండటం వల్ల గిన్నెలు కేవలం క్లీన్ అవ్వడమే.. కాకుండా క్రిములు లేకుండా పూర్తిగా శానిటైజ్ అవుతాయి. ప్లాస్టిక్, స్టీల్ లేదా సిరామిక్ పాత్రలు ఏవైనా సరే ఎలాంటి డ్యామేజ్ కాకుండా శుభ్రం చేస్తుంది.

ఫ్రీ స్టాండింగ్ డిజైన్,స్పేస్ సేవింగ్ లుక్:

ఈ డిష్‌వాషర్ మెయిన్ హైలైట్ దీని కాంపాక్ట్ , స్టైలిష్ డిజైన్. ఇది ఫ్రీ స్టాండింగ్ మోడల్ కావడంతో కిచెన్ లో కౌంటర్‌ టాప్‌పై లేదా తగిన స్థలంలో దీన్ని ఈజీగా అమర్చుకోవచ్చు. ఎక్కువ స్థలాన్ని ఆక్రమించకుండా మోడ్రన్ కిచెన్‌కు సరిగ్గా సరి పోయే లుక్‌ను ఇది అందిస్తుంది. డిజైన్ పరంగా చాలా ఆకర్షణీయంగా ఉండటంతో పాటు ఆపరేట్ చేయడం కూడా చాలా సింపుల్. డిజిటల్ డిస్‌ప్లే , టచ్ కంట్రోల్స్ ద్వారా వాషింగ్ సైకిల్స్ ఏవి కావాలో ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు.

రూ.60వేల రోబోటిక్ క్లీనర్ ఇప్పుడు రూ.23,999కే..సూపర్ డీల్!

నీరు ఆదా చేసే టెక్నాలజీ:

ఎలక్ట్రానిక్ పరికరాలు వాడితే.. కరెంట్ బిల్లు , వాటర్ బిల్లు ఎక్కువ వస్తుందనే టెన్షన్ చాలా మందికి ఉంటుంది. కానీ ఈ మీడియా డిష్‌ వాషర్ పవర్-సేవింగ్ , వాటర్-ఎఫిషియంట్ టెక్నాలజీతో తయారు చేసారు. చేతులతో గిన్నెలు కడిగేటప్పుడు ఖర్చయ్యే నీటితో పోలిస్తే.. ఈ డిష్‌వాషర్ చాలా తక్కువ నీటిని వాడి అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. అలాగే కరెంట్ ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుంది. దీనిలో లేటెస్ట్ టెక్నాలజీ వాడారు కాబట్టి ఇది ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటుంది.

ఆకర్షణీయమైన ధర :

ఈ ప్రీమియం ఫీచర్లు కలిగిన మోడల్ మార్కెట్లో బెస్ట్ బడ్జెట్ ధరలో లభిస్తోంది.ప్రస్తుత ఈ-కామర్స్ ఆఫర్లు , మార్కెట్ ధరల ప్రకారం ఇది కేవలం రూ.18,490 ధరకే అందుబాటులో ఉంది.

తక్కువ పెట్టుబడితో.. కిచెన్ లో పని భారాన్ని పూర్తిగా తగ్గించుకోవాలనుకునే.. వారికి ఇది నిజంగా సూపర్ ఛాయిస్. తక్కువ ధరలోనే డిష్ వాషర్ బెస్ట్ ఫీచర్లతో వస్తోంది కాబట్టి వెంటనే ఆర్డర్ చేసేయండి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live