Dailyhunt
రూ.20 ప్రభుత్వ పథకంతో రూ.2 లక్షలు ప్రయోజనం.. ఎలా అప్లై చేయాలంటే?

రూ.20 ప్రభుత్వ పథకంతో రూ.2 లక్షలు ప్రయోజనం.. ఎలా అప్లై చేయాలంటే?

Big TV Live 5 days ago

PMSBY Scheme: ఈ రూ.20 గవర్నమెంట్ స్కీమ్ తో 2 లక్షల ప్రయోజనం పొందవచ్చు. కేవలం రూ.20 లకే యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ను అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం.

ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన స్కీమ్ ద్వారా ఈ ప్రయోజనం పొందవచ్చు. 18 నుంచి 70 సంవత్సరాల మధ్య వయస్సు గల వారు ఈ స్కీమ్ కు అర్హులు. ఏదైనా ప్రమాదంలో పాలసీ హోల్డర్ మరణిస్తే నామినీకి రూ.2 లక్షలు ఇస్తారు. లేదా శాశ్వత వైకల్యం పొందితే రూ.2 లక్షల వరకు ఆర్థిక సహాయం చేస్తారు.

ఏడాదికి రూ.20

ప్రమాదంలో పాక్షికంగా వైకల్యం పొందితే లక్ష రూపాయల వరకు బీమా లభిస్తుంది. ఈ పాలసీ తీసుకోవడం చాలా సులభం. మీకు అకౌంట్ ఉన్న బ్యాంకులో సంప్రదిస్తే ఈ పాలసీ చేస్తారు. బ్యాంకు అకౌంట్ నుంచి రూ.20 కట్ చేసుకుని పాలసీని యాక్టివేట్ చేస్తారు. సంవత్సరానికి ఒకసారి రూ.20 చెల్లించి పాలసీని రెన్యువల్ చేసుకోవచ్చు. అలాగే ఆటో రెన్యువల్ ఆప్షన్ కూడా ఉంది. మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ లో కూడా ఈ పాలసీ తీసుకోవచ్చు. ప్రతి సంవత్సరం జూన్ 1 నుంచి మే 31 వరకు ఈ పాలసీ చెల్లుబాటు అవుతుంది.

ఇప్పటి వరకూ ఎలాంటి ఇన్సూరెన్స్ పాలసీ లేకపోతే.. కనీసం రూ.20 పీఎంఎస్బీవై పాలసీ అయినా తీసుకోవాలని ఎక్స్ ఫర్ట్స్ సూచిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న మరో స్కీమ్.. పీఎం జీవన్ జ్యోతి యోజనలో ఏడాదికి 436 రూపాయలు చెల్లిస్తే.. ఏ కారణంగా మరణించిన రూ.2 లక్షల బీమా పొందవచ్చు.

మహిళల కోసం టాప్ 5 ప్రభుత్వ పథకాలు.. పూర్తి వివరాలు ఇలా!

క్లెయిమ్ ఎలా?

ప్రమాదం జరిగిన తేదీ నుంచి 30 రోజులలోపు, బ్యాంకును సంప్రదించాలి. ప్రమాదానికి సంబంధించిన ధృవీకరణ పత్రాలు అంటే FIR, డెత్ సర్టిఫికేట్ సమర్పించి క్లెయిమ్ చేసుకోవాలి. ఆత్మహత్య వంటి ఇతర కారణాల వల్ల జరిగే మరణాలు ఈ పాలసీ పరిధిలోకి రావు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live