Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రూ.4,500కే సూపర్ హెల్మెట్.. రాయల్ ఎన్‌ఫీల్డ్ లైట్‌ వింగ్ భలే ఉంది భయ్యా!

రూ.4,500కే సూపర్ హెల్మెట్.. రాయల్ ఎన్‌ఫీల్డ్ లైట్‌ వింగ్ భలే ఉంది భయ్యా!

Big TV Live 2 weeks ago

Royal Enfield Lightning Modular Helmet Review:రాయల్ ఎన్‌ ఫీల్డ్ నుంచి మరో క్రేజీ హెల్మెట్ అందుబాటులోకి వచ్చింది. తక్కువ ధరలో లైట్‌ వింగ్ మల్టీ రేస్ మాడ్యులర్ హెల్మెట్ ను తీసుకొచ్చింది.

కామన్ హాఫ్ ఫేస్ హెల్మెట్ వాడే వారికి ఈ హెల్మెట్ మొదట్లో కొంచెం బరువుగా అనిపిస్తుంది. కానీ, భద్రత విషయంలో పర్ఫెక్ట్ గా ఉంటుంది. దీని బరువు సుమారు 1,475 గ్రాములు ఉంటుంది. కానీ, కొద్ది రోజుల పాటు ఉపయోగించిన తర్వాత బరువుకు అలవాటు పడిపోతారు.

భద్రతతో పాటు ప్రీమియం ఫీలింగ్

ఈ హెల్మెట్ బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. బయట భాగం స్ట్రాంగ్ గా ఉంటుంది. ప్రీమియం ఫీలింగ్ ఇస్తుంది. మ్యాట్ బ్లాక్, ఎల్లో కలర్ కాంబినేషన్ ఆకట్టుకుంటుంది. ఎండలో ఎక్కువసేపు ఉపయోగించినా రంగు వెలిసిపోవడం, ఫినిషింగ్ దెబ్బతినడం లాంటి సమస్యలు ఉండవు. దీని మన్నిక చాలా బాగుంటుంది. హెల్మెట్‌ లో డబుల్ డి రింగ్‌ కు బదులుగా రాట్చెట్ స్ట్రాప్ ఇచ్చారు. కొంతమంది రైడర్లు డబుల్ డి రింగ్‌ ను ఎక్కువగా ఇష్టపడినా, సిటీలో రోజువారీ ప్రయాణాలకు ఈ రాట్చెట్ స్ట్రాప్ కూడా అనుకూలంగానే ఉంటుంది. ఈ హెల్మెట్ పెట్టుకోవడం, తీయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది.

ఈ హెల్మెట్‌ లో ఉన్న బిల్ట్ ఇన్ సన్ వైజర్ మరో క్రేజీ ఫీచర్. ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో వేరే సన్ గ్లాస్ అవసరం లేకుండా ఇది కళ్లకు మంచి రక్షణ ఇస్తుంది. కళ్లద్దాలు ధరించే వారికి కూడా సౌకర్యంగా సరిపోతుంది. ప్రతిరోజూ సిటీలో ప్రయాణించే వారికి అనుకూలంగా ఉంటుంది. మాడ్యులర్ డిజైన్ ఉండటంతో అవసరాన్ని బట్టి ఓపెన్ ఫేస్, ఫుల్ ఫేస్‌ గా ఉపయోగించుకోవచ్చు. అయితే, వేసవిలో ట్రాఫిక్ ఎక్కువగా ఉండే సమయంలో ఫుల్-ఫేస్ మోడ్‌ లో కొంచెం వేడిగా అనిపించే అవకాశం ఉంది. వెంటిలేషన్ కోసం వెంట్లు ఉన్నప్పటికీ, హాఫ్ ఫేస్ హెల్మెట్‌ తో పోలిస్తే గాలి ప్రవాహం కాస్త తక్కువగానే ఉంటుంది.

మంచి సౌకర్యం..

సౌకర్యం విషయంలో ఈ హెల్మెట్ చాలా బాగుంటుంది. లోపల ఉన్న ప్యాడింగ్ స్మూత్ గా ఉండటంతో ఎక్కువసేపు పెట్టుకున్నా ఇబ్బంది కలగదు. అంతేకాకుండా లోపలి ప్యాడింగ్‌ ను ఈజీగా తీసి క్లీన్ చేసే అవకాశం ఉంటుంది. చెమట, దుమ్ము ఎక్కువగా ఉండే రోజువారీ వాడకానికి ఇది చాలా ఉపయోగపడుతుంది.

మైనస్ లు ఏంటంటే..

అయితే ఈ హెల్మెట్ లో కొన్ని చిన్న లోపాలు కూడా ఉన్నాయి. హెల్మెట్‌ను పూర్తిగా మూసే సమయంలో లాకింగ్ మెకానిజం కొంచెం అసౌకర్యంగా ఉంటుంది. సరిగ్గా లాక్ చేయడానికి అన్‌ లాక్ బటన్‌ ను నొక్కి ఉంచాలి. అలాగే, వైజర్‌ ను తీసేయడం సులభమే అయినా, తిరిగి పెట్టడం కాస్త టైమ్ తీసుకుంటుంది.

ధర గురించి..

రూ.4,500 ధరలో లభిస్తున్న ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ లైట్‌వింగ్ మల్టీ రేస్ మాడ్యులర్ హెల్మెట్ మంచి బిల్డ్ క్వాలిటీ, సన్ వైజర్, మాడ్యులర్ డిజైన్, సౌకర్యవంతమైన ప్యాడింగ్ లాంటి ఫీచర్లతో ఆకట్టుకుంటుంది.

Read Also{ పెట్రోల్ అవసరం లేదు.. నీటితో నడిచే స్కూటర్ వచ్చేసింది!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live