Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రూ.599కే వన్‌ప్లస్ హెడ్‌ఫోన్స్.. ఫోన్లపై ఊహించని డిస్కౌంట్లు, Independence Day Sale ఆఫర్లు ఇవే!

రూ.599కే వన్‌ప్లస్ హెడ్‌ఫోన్స్.. ఫోన్లపై ఊహించని డిస్కౌంట్లు, Independence Day Sale ఆఫర్లు ఇవే!

Big TV Live 1 week ago

OnePlus Independence Day Sale: భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ భారీ డిస్కౌంట్లను ప్రకటించింది.

ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, ఇయర్‌బడ్స్, టాబ్లెట్‌లపై అద్భుతమైన ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఆగస్టు 7 నుండి ఈ ఆఫర్లు అమల్లోకి రానున్నాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం రండి..

అద్భుతమైన స్మార్ట్‌ఫోన్ ఆఫర్లు..

వన్‌ప్లస్ లవర్స్ కొత్త ఫోన్ కొనడానికి ఇది సరైన సమయం. ఈ సేల్‌లో OnePlus 15 ఫోన్ రూ.81,999కి, OnePlus 15R రూ.56,999కి దక్కనున్నాయి. అలాగే ఫ్లాగ్‌షిప్ అనుభవాన్ని కోరుకునే వారికి OnePlus 13S కేవలం రూ.49,999కే లభిస్తుండటం విశేషం. దీంతోపాటు బడ్జెట్ యూజర్ల కోసం Nord సిరీస్ ఫోన్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

బడ్జెట్ ధరకు Nord సిరీస్..

OnePlus Nord 6 ఫోన్ రూ.41,999కి, Nord CE6 రూ.31,999కి అందుబాటులో ఉన్నాయి. ఇంకా తక్కువ బడ్జెట్‌లో చూసేవారికి Nord CE6 Lite రూ.23,749కి, N6 ఫోన్ రూ.20,999కి లభిస్తాయి. అన్నింటికన్నా తక్కువ ధరకు N6x మోడల్‌ను రూ.17,499కే మీ సొంతం చేసుకోవచ్చు.

ఇయర్‌బడ్స్‌పై క్రేజీ ఆఫర్లు..

మ్యూజిక్ లవర్స్ కోసం ఆడియో డివైజస్‌పై మంచి తగ్గింపు ఉంది. OnePlus Buds Pro 3 రూ.9,999కి, Buds 4 మోడల్ రూ.5,599కి అందుబాటులో ఉన్నాయి. ఇక Nord Buds 4 Pro మరియు బుల్లెట్స్ Wireless Z3 కేవలం రూ.1,499కే సొంతం చేసుకోవచ్చు. టైప్-సి వైర్డ్ హెడ్‌ఫోన్స్ రూ.599కే అందుబాటులో ఉన్నాయి.

టాబ్లెట్‌లతో ఉచిత గిఫ్ట్‌లు..

టాబ్లెట్ ప్రియులకు కూడా మంచి ఆఫర్లు ఉన్నాయి. OnePlus Pad 4 రూ.29,999కి లభిస్తోంది. Pad Go 2 కూడా అదే ధరకు అందుబాటులో ఉంది. అయితే వీటితో పాటు ఉచితంగా స్టైలస్ పెన్‌లను అందిస్తున్నారు. Pad Lite రూ.19,999కి ఉచిత కేస్‌తో లభిస్తుంది.

ఈ ఆఫర్లు ఎక్కడ లభిస్తాయి?

ఈ పరిమితకాల ఆఫర్లు అమెజాన్, వనప్లస్ అధికారిక వెబ్‌సైట్, వన్‌ప్లస్ స్టోర్ యాప్, ప్రముఖ స్టోర్లలో లభిస్తాయి. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్స్ ద్వారా ఈ డిస్కౌంట్లు పొందవచ్చు. Flipkart, Blinkit, Myntra లలో కూడా కొన్ని ప్రొడక్ట్స్ అందుబాటులో ఉంటాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live