Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రూ.615 ధరకే..పోర్టబుల్ టీవీ సౌండ్‌బార్! ఇల్లు దద్దరిల్లిపోవాల్సిందే

రూ.615 ధరకే..పోర్టబుల్ టీవీ సౌండ్‌బార్! ఇల్లు దద్దరిల్లిపోవాల్సిందే

Big TV Live 3 weeks ago

MZ M423SP portable home TV soundbar: ఇంట్లో టీవీ చూస్తున్నప్పుడు లేదా మొబైల్‌లో పాటలు వింటున్నప్పుడు మంచి సౌండ్ క్లారిటీ లేకపోతే.. ఆ మజాయే వేరుగా ఉంటుంది.

అయితే.. ఎక్కువ ధర పెట్టి పెద్ద పెద్ద స్పీకర్లు కొనలేమని టెన్షన్ పడే వారికి ఒక అద్భుతమైన బడ్జెట్ ఆప్షన్ మార్కెట్లో అందుబాటులో ఉంది. అదే “MZ M423SP Portable Home TV Soundbar”. కేవలం రూ. 615 అసాధారణ ధరలో లభిస్తున్న ఈ పోర్టబుల్ బ్లూటూత్ సౌండ్‌ బార్ డైనమిక్ థండర్ సౌండ్‌తో.. అద్భుతమైన ఆడియో ఫీల్ ఇస్తుంది. ఈ చిన్న సౌండ్‌బార్ అందించే ఫీచర్లు ఏంటో ఇప్పుడు చూద్దాం.

Z M423SP Portable Home TV Soundbar ఫీచర్లు:

1.డైనమిక్ థండర్ సౌండ్ :

ఈ కాంపాక్ట్ సౌండ్‌బార్ సైజ్‌లో చిన్నదైనా, పర్ఫార్మెన్స్‌లో మాత్రం చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. ఇందులో 10W పవర్ అవుట్‌పుట్ లభిస్తుంది. దీనికి తోడు.. ‘డైనమిక్ థండర్ సౌండ్’ టెక్నాలజీ ఉండటం వల్ల పాటలు వినేటప్పుడు లేదా సినిమాలు చూస్తున్నప్పుడు బేస్ ట్రెబుల్ చాలా స్పష్టంగా వినిపిస్తాయి. స్టీరియో ఛానెల్ కాన్ఫిగరేషన్ కారణంగా గది అంతటా సౌండ్ సమానంగా వ్యాపించి, చక్కని ఆడియో ఫీల్ అందిస్తుంది.

2. 2400mAh బ్యాటరీ:

ఇది కేవలం హోమ్ టీవీ సౌండ్‌బార్‌గానే కాకుండా.. పోర్టబుల్ బ్లూటూత్ స్పీకర్‌లా కూడా పని చేస్తుంది. ఇందులో.. అంతగర్భితంగా 2400mAh రీఛార్జబుల్ బ్యాటరీ ఉంది. అందుకే దీనిని ఒక్క సారి ఫుల్ ఛార్జ్ చేస్తే బ్యాటరీ బ్యాకప్‌తో ఎక్కువ టైం సాంగ్స్ ఎంజాయ్ చేయొచ్చు. అంతే కాకుండా ఇది చాలా తక్కు బరువు. స్టైలిష్ బ్లాక్ డిజైన్ ఉండటం వల్ల దీన్ని ఎక్కడికైనా ఈజీగా మోసుకెళ్ళొచ్చు. ఇండోర్స్‌తో పాటు చిన్నపాటి అవుట్‌డోర్ పార్టీలకు కూడా ఇది చక్కగా సరి పోతుంది.

3.బ్లూటూత్ కనెక్టివిటీ ,మల్టిపుల్ ఆప్షన్స్:

లేటెస్ట్ టెక్నాలజీకి అనుగుణంగా ఇందులో.. వైర్‌లెస్ బ్లూటూత్ కనెక్టివిటీ అవకాశం ఉంది. దీని వల్ల మీ స్మార్ట్‌ ఫోన్, ట్యాబ్లెట్ లేదా ల్యాప్‌టాప్‌ను క్షణాల్లో కనెక్ట్ చేసి వైర్‌లెస్ మ్యూజిక్ స్ట్రీమింగ్ చేయవచ్చు. కేవలం బ్లూటూత్ మాత్రమే కాకుండా.. ఆక్స్ కేబుల్ సపోర్ట్, మెమొరీ కార్డ్ రీడర్ వంటి మల్టిపుల్ ఆప్షన్స్ ద్వారా కూడా మ్యూజిక్ ప్లే చేసుకోవచ్చు.

రూ.13,229 ధరకే.. 40 ఇంచుల టీవీ! ఆఫర్ మామూలుగా లేదు కదా !

4. ఆపరేటింగ్:

ఈ సౌండ్‌బార్‌ను ఆపరేట్ చేయడం చాలా ఈజీ. దీనిపై ఉండే కంట్రోల్ బటన్ల సహాయంతో.. వాల్యూమ్ పెంచడం, తగ్గించడం లేదా పాటలను మార్చడం వంటి పనులను ఇట్టే చేయవచ్చు. మోడరన్ బ్లాక్ ఫినిషింగ్ లుక్ టీవీ టేబుల్ లేదా వర్కింగ్ డెస్క్‌కి చక్కని అందాన్ని తెస్తుంది.

మొత్తంగా చెప్పాలంటే.. తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం సౌండ్ కోరుకునే వారికి MZ M423SP పోర్టబుల్ హోమ్ టీవీ సౌండ్‌బార్ ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. కేవలం రూ. 615 ధరలో 10W పవర్, 2400mAh బ్యాటరీ , బ్లూటూత్ ఫీచర్లు ఉండటం నిజంగా గొప్ప విషయమే. మీరు కూడా మీ చిన్న బడ్జెట్‌లో.. మంచి సౌండ్‌బార్ కొనాలని అనుకుంటే దీనిని వెంటనే కొనేయండి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live