Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రూ.7890కే 7 కేజీ వాషింగ్ మెషీన్..డోంట్ మిస్

రూ.7890కే 7 కేజీ వాషింగ్ మెషీన్..డోంట్ మిస్

Big TV Live 2 weeks ago

Motorola 7kg semi automatic washing machine: ఇంట్లో బట్టలు ఉతకడం అంటే పెద్ద ప్రయాసతో కూడుకున్న పనే. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలకు తక్కువ బడ్జెట్‌లో బ్రాండెడ్ వాషింగ్ మెషీన్ దొరకడం గగనంగా మారుతుంటుంది.

అలాంటి వారి కోసం ప్రముఖ టెక్ బ్రాండ్ మోటోరోల ‘మిడ్‌నైట్ సిరీస్’ నుంచి అద్భుతమైన వాషింగ్ మెషీన్‌ను మార్కెట్లోకి తెచ్చింది. డీప్ బ్లాక్ కలర్ ఫినిషింగ్‌తో వస్తున్న ఈ మెషీన్ లుక్ పరంగానూ చాలా మోడర్న్‌గా ఉంటుంది. కేవలం రూ.7,890 పాకెట్ ఫ్రెండ్లీ ధరకే లభిస్తున్న ఈ మోటోరోలా 7 కేజీ సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్ ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్తి ఫీచర్లు:

7 కేజీ కెపాసిటీ, 5 స్టార్ రేటింగ్:

ఈ వాషింగ్ మెషీన్ అతిపెద్ద ప్లస్ పాయింట్ దీని కెపాసిటీ, పవర్ ఎఫీషియెన్సీ. 7 కేజీ కెపాసిటీ ఉండటం వల్ల చిన్న , మిడిల్ క్లాస్ కుటుంబాలకు (3 నుంచి 4 సభ్యులు ఉండే ఇళ్లకు) ఇది పర్ఫెక్ట్‌గా సరి పోతుంది. ఒకే సారి ఎక్కువ బట్టలను ఈజీగా ఉతుక్కోవచ్చు. అలాగే.. దీనికి 5 స్టార్ ఎనర్జీ రేటింగ్ ఉంది. అంటే ఇది కరెంట్ బిల్లును చాలా వరకు ఆదా చేస్తుంది. కరెంట్ ఖర్చు గురించి ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు.

మిడ్‌నైట్ బ్లాక్ డిజైన్, డ్యూరబిలిటీ:

హోం అప్లయన్సెస్ లో మోటోరోలా ఎప్పుడూ ముందుంటుంది. ఈ మిడ్‌నైట్ సిరీస్ వాషింగ్ మెషీన్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా, ప్రీమియం లుక్‌లో ఉంటుంది. దీని బాడీ నాణ్యమైన ప్లాస్టిక్ మెటీరియల్‌తో తయారవడంతో తుప్పు పట్టే సమస్యే ఉండదు. బాత్రూమ్ లేదా బాల్కనీలో ఎక్కడ పెట్టుకున్నా ఇది చాలా రోజుల పాటు పాడవకుండా ఉంటుంది. కింద క్యాస్టర్ వీల్స్ కూడా దీనిలో ఉండటం వల్ల దీన్ని ఒక చోటి నుంచి మరో చోటకి ఈజీగా.. జరుపుకోవచ్చు.

వాషింగ్ పెర్ఫార్మెన్స్, సేఫ్టీ:

ఈ సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్‌లో బట్టలను ఉతకడం చాలా ఈజీ. పవర్ ఫుల్ మోటార్, పల్సేటర్ సిస్టమ్ కారణంగా బట్టలపై ఉన్న మొండి మరకలు కూడా ఈజీగా తొలగిపోతాయి. వాష్ , స్పిన్ డ్రైయర్స్ వేర్వేరుగా ఉండటం వల్ల బట్టలు త్వరగా ఉతకడంతో పాటు త్వరగా ఆరిపోయేలా పిండుకోవచ్చు. సేఫ్టీ విషయంలోనూ కంపెనీ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంది.

ధర:

ఇన్ని అడ్వాన్స్డ్ ఫీచర్లు, 5 స్టార్ రేటింగ్, బ్రాండెడ్ నమ్మకంతో వస్తున్న ఈ మోటోరోలా 7 కేజీ సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్ ధర కేవలం రూ. 7,890 మాత్రమే. తక్కువ బడ్జెట్‌లో నమ్మకమైన, ఎక్కువ కాలం పనిచేసే మంచి వాషింగ్ మెషీన్ కొనాలనుకునే ప్రతి ఒక్కరికీ ఇది ఒక సూపర్ ఛాయిస్ అని చెప్పవచ్చు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live