Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రూ.908కే అద్భుతమైన సౌండ్..బడ్జెట్ ధరలో సూపర్ బేస్

రూ.908కే అద్భుతమైన సౌండ్..బడ్జెట్ ధరలో సూపర్ బేస్

Big TV Live 12 hrs ago

YOROTO wireless soundbar: ఇంటిని ఒక మ్యూజిక్ హాల్ లా లేదా మినీ థియేటర్ లా మార్చుకోవాలని ఎవరికి ఉండదు చెప్పండి? కానీ పెద్ద పెద్ద హోమ్ థియేటర్లు లేదా బ్రాండెడ్ సౌండ్‌ బార్‌లు కొనాలంటే..

ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. అందుకే చాలా మంది బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్స్ కోసం వెతుకుతుంటారు. అలాంటి వారి కోసం మార్కెట్లో ఒక అద్భుతమైన గాడ్జెట్ అందుబాటులో ఉంది. అదే ఈ సౌండ్ బార్. కేవలం రూ.908 ధరకే లభిస్తున్న ఈ సౌండ్‌ బార్ గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

పూర్తి ఫీచర్లు:

ఆకట్టుకునే డిజైన్, ప్రీమియమ్ లుక్:

ఈ సౌండ్‌బార్ చూడటానికి చాలా సింపుల్‌గా, మోడర్న్‌గా , ఆకర్షణీయంగా ఉంటుంది. ముఖ్యంగా దీని బీజ్ కలర్ దీనికి ఒక ప్రత్యేకమైన క్లాసీ లుక్‌ని ఇస్తుంది. లివింగ్ రూమ్ టేబుల్ మీద, స్టడీ టేబుల్ పై లేదా టీవీ కింద దీన్ని ఉంచితే.. ఇంటి ఇంటీరియర్ లుక్కే మారి పోతుంది. కాంపాక్ట్ సైజులో ఉండటం.. వల్ల ఇది ఎక్కువ స్థలాన్ని ఆక్రమించదు. ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లడానికి కూడా ఇది చాలా అనుకూలంగా ఉంటుంది.

20W పవర్, ఇయర్-షేకింగ్ సౌండ్:

ఇంత చిన్న సైజులో ఉన్న ఈ సౌండ్‌ బార్ పర్ఫామెన్స్ చూస్తే నిజంగా షాక్ అవ్వాల్సిందే! ఇందులో ఇచ్చిన 20W పవర్ అవుట్‌ పుట్ రూం నిండా స్పష్టమైన సౌండ్‌తో నింపేస్తుంది. మీరు సినిమాలు చూస్తున్నప్పుడు యాక్షన్ సీన్స్, బాంబ్ పేలుళ్లు, కార్ ఛేజింగ్‌ల వంటి సౌండ్ ఎఫెక్ట్స్ చాలా క్లియర్‌గా వినిపిస్తాయి. మ్యూజిక్ లవర్స్ కోసం ఇందులో ప్రత్యేకంగా అల్ట్రా రిచ్ బేస్ దీనికి అందించారు.ఇది బీట్స్ ఏమాత్రం డిస్టర్బ్ కాకుండా..ప్రతీ పాటకు మంచి డెప్త్‌ని ఇస్తుంది. స్టీరియో ఛానల్ సపోర్ట్ ఉండటం వల్ల ఆడియో విజువల్ ఎక్స్‌పీరియన్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది.

వైర్‌లెస్ కనెక్టివిటీ :

ఈ డివైజ్ పూర్తిగా బ్లూటూత్ టెక్నాలజీతో పని చేస్తుంది. కాబట్టి.. గజిబిజిగా ఉండే వైర్ల గోడవంతా తప్పుతుంది. మీ స్మార్ట్‌ ఫోన్, ల్యాప్‌ టాప్, లేదా ట్యాబ్లెట్‌ని దీనికి క్షణాల్లో కనెక్ట్ చేసుకోవచ్చు. బ్లూటూత్‌తో పాటు ఇతర కనెక్టివిటీ ఆప్షన్స్ కూడా అందుబాటులో ఉండటం వల్ల దీన్ని ఆపరేట్ చేయడం కూడా చాలా ఈజీ అని చెప్పొచ్చు. ఫోన్ కాల్స్ మాట్లాడుకుంటూ, లేదా ఆన్‌లైన్ గేమింగ్ ఆడుకుంటూ దీని ద్వారా అద్భుతమైన ఆడియో ఫీల్ పొందొచ్చు.

బ్యాటరీ బ్యాకప్, ఆన్‌గోయింగ్ ఎంటర్‌టైన్‌మెంట్:

ఇంట్లో ఎక్కడైనా, ఎప్పుడైనా నాన్‌స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకునే వారికి ఇది పర్‌ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. తక్కువ బరువు ఉండటం వల్ల దీన్ని బెడ్‌రూమ్ నుంచి బాల్కనీకి, లేదా బయట చిన్నపాటి గ్యాదరింగ్స్ ,పార్టీలకు కూడా ఈజీగా క్యారీ చేయెచ్చు.

ధర:

ఇన్ని అడ్వాన్స్‌డ్ ఫీచర్లు, పవర్ ఫుల్ బేస్, స్టైలిష్ లుక్ కలిగిన ఈ సౌండ్‌ బార్ అసలు ధర ఎంత అనుకుంటున్నారు? కేవలం రూ.908 మాత్రమే! ఈ బడ్జెట్‌లో ఇంత మంచి సౌండ్ క్వాలిటీ , ఫీచర్లు ఇవ్వడం నిజంగా విశేషం. కాలేజ్ స్టూడెంట్స్ కి, బ్యాచిలర్స్‌కి, లేదా తక్కువ బడ్జెట్‌లో మంచి ఆడియో డివైజ్ కోరుకునే వారికి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్.

అతి తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ ఫీచర్లు ఆశించే వారికి ఈ మోడల్ ఒక అద్భుతమైన ఆప్షన్ అని చెప్పొచ్చు. మీ ఎంటర్ టైన్మెంట్ పూర్తిగా మార్చేయడానికి ఈ చిన్న గాడ్జెట్ చాలు. మరి ఇంకెందుకు ఆలస్యం.. మీ బడ్జెట్‌లో పర్‌ఫెక్ట్ సౌండ్ ఫీల్ పొందడానికి ఈ ట్రెండింగ్ సౌండ్‌ బార్‌ని ఇప్పుడే ఇంటికి తెచ్చుకోండి!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live