Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రూపాయి ఖర్చు లేకుండా చూడొచ్చు. ఓటీటీ ఫ్రీ క్యాటగిరీలో దుమ్మురేపుతున్న 7 వెబ్ సిరీస్‌లు

రూపాయి ఖర్చు లేకుండా చూడొచ్చు. ఓటీటీ ఫ్రీ క్యాటగిరీలో దుమ్మురేపుతున్న 7 వెబ్ సిరీస్‌లు

Big TV Live 1 week ago

Free Web Series: ఓటీటీ అంటే చాలామందికి వెంటనే సబ్‌స్క్రిప్షన్ గుర్తుకు వస్తుంది. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జియోహాట్‌స్టార్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో మంచి కంటెంట్ చూడాలంటే డబ్బు ఖర్చు చేయాల్సిందేనని అనుకుంటారు.

కానీ అందరికీ తెలియని విషయం ఏమిటంటే.. అమెజాన్‌లోని Amazon MX Player (గతంలో miniTV) ద్వారా రూపాయి కూడా ఖర్చు లేకుండా ఎన్నో వెబ్ సిరీస్‌లు చూడొచ్చు. యాడ్స్ అయితే ఉంటాయి. కానీ ఎలాంటి సబ్‌స్క్రిప్షన్ అవసరం ఉండదు. బయోపిక్‌లు, కాలేజ్ రొమాన్స్, కామెడీ, సస్పెన్స్, పొలిటికల్ డ్రామా, యాక్షన్ థ్రిల్లర్.. ఇలా అన్ని జానర్లలో ఆసక్తికరమైన కంటెంట్ ఇక్కడ అందుబాటులో ఉంది. వీకెండ్‌లో అలా ఫ్రీగా చూడాలనుకునే వారికి ఈ 7 సిరీస్‌లు బెస్ట్ ఆప్షన్.

1. Made in India: A Titan Story

భారతదేశపు ప్రముఖ వాచ్ బ్రాండ్ Titan ఎలా పుట్టింది ? విదేశీ బ్రాండ్లు మార్కెట్‌ను శాసిస్తున్న సమయంలో భారతీయ కంపెనీని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేందుకు జె.ఆర్.డి టాటా, జెర్సెస్ దేశాయ్ చేసిన పోరాటం ఈ బయోపిక్‌లో ప్రధానాంశం. బోర్డ్‌రూమ్ డ్రామా, వ్యాపార నిర్ణయాలు, విజయాల వెనుక ఉన్న కష్టాలను చాలా ఆసక్తికరంగా చూపించారు. జిమ్ సర్బ్, నసీరుద్దీన్ షా నటన ఈ సిరీస్‌కు ప్రధాన బలం.

2. Queens

విభిన్న నేపథ్యాల నుంచి వచ్చిన నలుగురు మహిళలు కార్పొరేట్ ప్రపంచంలో తమ గుర్తింపు కోసం చేసే పోరాటమే ఈ సిరీస్. కెరీర్, కుటుంబం, స్నేహం, వ్యక్తిగత జీవితాల మధ్య సమతుల్యత ఎలా సాధించారనేది హార్ట్ టచింగ్ గా చూపించారు.

3. Constable Girpade

సీరియస్ పోలీస్ కథలకు భిన్నంగా, పూర్తిగా కామెడీతో తెరకెక్కిన సిరీస్ ఇది. కొత్త కానిస్టేబుల్ గిర్పడే తన విచిత్రమైన పద్ధతులతో క్రైమ్ కేసులు ఛేదించే ప్రయత్నాలు నవ్వులు పూయిస్తాయి. ప్రతి ఎపిసోడ్‌లో కొత్త కేసు, కొత్త గందరగోళం ఉంటుంది.

4. Arafta: Bound by Fate

రొమాన్స్, ఫాంటసీ, సస్పెన్స్ కలయికలో రూపొందిన ఈ సిరీస్‌లో ఇద్దరు వ్యక్తుల జీవితాలు విధి కారణంగా ఎలా కలుస్తాయనే అంశాన్ని చూపించారు. గత జన్మ రహస్యాలు, మిస్టరీలు కథను ఆసక్తికరంగా మారుస్తాయి.

5. Raaj

అధికారం కోసం కుటుంబ సభ్యుల మధ్య జరిగే రాజకీయ పోరాటం ఈ సిరీస్ ప్రధాన కథ. కుట్రలు, ఎత్తులు, పైఎత్తులు, మోసాలు, ఊహించని ట్విస్టులతో పొలిటికల్ థ్రిల్లర్ అభిమానులను ఆకట్టుకుంటుంది.

6. Ab Hoga Hisaab

తన కుటుంబానికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్న ఓ సాధారణ వ్యక్తి, ప్రమాదకరమైన మాఫియాతో చేసే యుద్ధమే ఈ యాక్షన్ థ్రిల్లర్ కథ. వేగవంతమైన స్క్రీన్‌ప్లే, యాక్షన్ సన్నివేశాలు, సస్పెన్స్ ఈ సిరీస్‌ను ఆసక్తికరంగా మారుస్తాయి.

7. Campus Beats Season 7

యూత్‌ను బాగా ఆకట్టుకున్న కాలేజ్ రొమాన్స్ సిరీస్ ఇది. వైట్‌హాల్ క్యాంపస్‌లో జరిగే డ్యాన్స్ పోటీలు, ప్రేమ, స్నేహం, పోటీ తత్వం చుట్టూ కథ తిరుగుతుంది. నెత్రా, ఇషాన్, సుమీర్ మధ్య లవ్ ట్రయాంగిల్ ఈ సీజన్‌లో మరింత ఆసక్తికరంగా మారుతుంది. డ్యాన్స్, మ్యూజిక్, ఎమోషన్స్ ఇష్టపడేవారికి ఇది మంచి ఆప్షన్.

ఎక్కడ చూడాలి?

ఈ వెబ్ సిరీస్‌లన్నీ అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్లో పూర్తిగా ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. మొబైల్‌లో Amazon Shopping App ద్వారా ఎంఎక్స్ ప్లేయర్ సెక్షన్‌లోకి వెళ్లినా, లేదా అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్ యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా చూసినా సరిపోతుంది. వీకెండ్‌లో ఖర్చు లేకుండా మంచి వెబ్ సిరీస్‌లు చూడాలనుకునే వారు ఇవి ట్రై చేయండి. ఇందులో కానిస్టేబుల్ గిర్పడే తప్ప, మిగతా సిరీస్ లు అన్ని 2026లో విడుదలైనవే.

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live