Indian Railway: ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు వెళ్లే భక్తుల సంఖ్య పెరగడంతో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది.
డిసెంబర్ నుంచి జనవరి వరకు శబరిమల యాత్రికుల కోసం చర్లపల్లి- కొల్లం జంక్షన్ల మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. అయ్యప్ప భక్తులు ఇబ్బంది లేకుండా ప్రయాణం చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.
అందుబాటులోకి 4 ప్రత్యేక రైళ్లు
ప్రస్తుతం ఉన్న భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని నాలుగు ప్రత్యేక రైలు సర్వీసులను ప్రటిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ రైళ్లు హైదరాబాద్ నుంచి శబరిమలకు వెళ్లి వచ్చే యాత్రికులకు ఎంతగానో ఉపయోగపడుతాయని చెప్పింది. చర్లపల్లి-కొల్లాం జంక్షన్ల మధ్య ఈ సర్వీసుల నడవనున్నట్లు వివరించింది.
ప్రత్యేక సర్వీసులు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయంటే?
తాజాగా సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించిన, ప్రత్యేక రైళ్లకు సంబంధించిన వివరాలను వెల్లడించింది.
⦿ డిసెంబర్ 17, 31 తేదీల్లో రైలు నంబర్ 07119 చర్లపల్లి నుంచి కొల్లాం వెళ్లనుంది. ఇదే రైలు తిరుగు ప్రయాణంలో డిసెంబర్ 20న (రైలు నంబర్ 07121) కొల్లాం నుంచి చర్లపల్లికి బయల్దేరనుంది.
⦿ డిసెంబర్ 15న రైలు నంబర్ 07118 కొల్లాం నుంచి చర్లపల్లికి వెళ్తుంది.
Read Also: సంక్రాంతి స్పెషల్ రైళ్లపై నో అనౌన్స్ మెంట్, ప్రయాణీకుల ఆగ్రహం!
⦿డిసెంబర్ 19, జనవరి 2న రైలు నంబర్ 07120 కొల్లాం నుంచి చర్లపల్లి బయల్దేరుతుంది.
⦿ డిసెంబర్ 22న రైలు నంబర్ 07122 చర్లపల్లి నుంచి కొల్లాంకు వెళ్తుంది. డిసెంబర్ 26న రైలు నంబర్ 07124 కొల్లాం నుంచి చర్లపల్లికి బయల్దేరుతుంది.
పండుగ సీజన్ లో యాత్రికులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు ప్రత్యేక సర్వీసులు ఉపయోగపడుతాయని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. అయ్యప్ప భక్తులు, శబరిమల యాత్రికులు ఈ సర్వీసులను ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ రైళ్లకు ఎక్కువ డిమాండ్ ఉన్న నేపథ్యంలో ముందస్తుగానే టికెట్లు బుక్ చేసుకోవడం మంచిదన్నారు.
Read Also: ప్రయాణీకులకు గుడ్ న్యూస్, తిరుపతికి అదనపు రైళ్లు!

