Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన 2 క్రేజీ కే-డ్రామాలు

సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన 2 క్రేజీ కే-డ్రామాలు

Big TV Live 3 weeks ago

K-Dramas on JioHotstar : ఇండియాలో… ముఖ్యంగా యూత్ లో కొరియన్ డ్రామాల (K-Dramas) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు జియోహాట్‌స్టార్ ఈ క్రేజీ కొరియన్ ఫ్యాన్స్ కోసం సైలెంట్ గా ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చింది.

ఎలాంటి హడావిడి, ప్రమోషన్స్ లేకుండా సైలెంట్‌గా రెండు కొత్త కొరియన్ సిరీస్‌లను జూన్ 1 నుంచి స్ట్రీమింగ్ చేస్తోంది. మరి ఆ సిరీస్ లు ఏంటో తెలుసుకుందాం పదండి.

వుడ్ యూ మ్యారీ మీ ? (Would You Marry Me?)

ఒక ఫన్నీ అండ్ స్వీట్ రొమాంటిక్ కామెడీ సిరీస్ ‘వుడ్ యూ మ్యారీ మీ ?’. ఇందులో చోయ్ వూ షిక్, జంగ్ సో మిన్ లీడ్ రోల్స్‌లో నటించారు. ఒక రిచ్ బేకరీ వారసుడు మన హీరో. అలాగే ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్న ఒక అమ్మాయి హీరోయిన్.. లగ్జరీ ఇల్లు సొంతం చేసుకోవడం కోసం వీరిద్దరూ ఫేక్ మ్యారేజ్ చేసుకుంటారు. కానీ ఆ తర్వాత నిజంగానే ప్రేమలో పడతారు. 2025 అక్టోబర్‌ లో గ్లోబల్‌ గా విడుదలైన ఈ సిరీస్ ఇప్పుడు ఇండియాలోని ఫ్యాన్స్‌కు అందుబాటులోకి వచ్చేసింది.

రెండో సిరీస్ 'పర్‌ఫెక్ట్ క్రౌన్' (Perfect Crown)

హిస్టారికల్ రొమాంటిక్ సిరీస్ ఇది. కొరియా సూపర్ స్టార్ ఐయూ (IU), బైయోన్ వూ సియోక్ మెయిన్ లీడ్స్ గా నటించిన ఈ సిరీస్ మోడ్రన్ కొరియా రాజ కుటుంబ నేపథ్యంలో సాగే కాంట్రాక్ట్ మ్యారేజ్ స్టోరీ. ఈ సిరీస్ హులు, డిస్నీ ప్లస్‌లలో 43 మిలియన్ల వ్యూయింగ్ అవర్స్ సాధించి సెన్సేషన్ సృష్టించింది. ఇప్పుడు జియోహాట్‌స్టార్ లిస్ట్‌లోకి వచ్చేసింది.

డిస్నీ-జియో మెర్జర్ వల్ల గందరగోళం ?

2024 చివర్లో డిస్నీ-జియో విలీనం జరిగాక నుంచి ఈ కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. అంతకుముందు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ కొరియన్ కంటెంట్‌కు ప్రధాన హబ్‌గా ఉండేది. కానీ మెర్జర్ తర్వాత పాత అగ్రిమెంట్స్ మళ్లీ రివ్యూ చేయాల్సి వచ్చింది. స్థానిక భాషల సబ్‌టైటిల్స్, డబ్బింగ్ అనుమతుల వల్ల ఆలస్యం జరుగుతోంది.'నైన్ పజిల్స్', 'అవర్ మూవీ' వంటి సిరీస్‌ల కోసం ఫ్యాన్స్ ఇంకా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు జియోహాట్‌స్టార్ సైలెంట్ రిలీజ్‌లతో కొంత ఊరట ఇచ్చింది. కానీ, ఇంకా చాలా సిరీస్‌ లు ఆలస్యం అవుతున్నాయి.

Also Read : 2 గంటల 41 నిమిషాల సస్పెన్స్ థ్రిల్లర్… ఫహద్ ఫాజిల్ ను ఇలాంటి పాత్రలో ఎప్పుడూ చూసి ఉండరు

ఏం జరుగుతోంది ?

డిస్నీ-జియో మెర్జర్ తర్వాత లోకల్ స్పోర్ట్స్, ఇండియన్ కంటెంట్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. దీంతో ఇంటర్నేషనల్ కంటెంట్ కాస్త వెనక్కి పడిపోయింది. నెట్‌ఫ్లిక్స్ మాత్రం తన కే-డ్రామా లైబ్రరీని వేగంగా పెంచుకుంటూ ఆడియన్స్‌ని తనవైపుకు లాక్కుంటోంది. జియోహాట్‌స్టార్ కేవలం సైలెంట్ రిలీజ్‌లతో సరిపెట్టకుండా, లైసెన్సింగ్ ప్రాసెస్‌ ని వేగవంతం చేస్తే మాత్రమే కే-డ్రామా ఫ్యాన్స్ బేస్‌ ను నిలుపుకోగలుగుతుంది. ఏదైతేనేం ఇప్పుడు రెండు కొత్త సిరీస్‌లు వచ్చాయి కాబట్టి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live