Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సైలెంట్‌గా ఉంటే రెచ్చిపోతారా..? వల్గర్ కామెంట్‌పై కన్నడ బ్యూటీ ఫైర్

సైలెంట్‌గా ఉంటే రెచ్చిపోతారా..? వల్గర్ కామెంట్‌పై కన్నడ బ్యూటీ ఫైర్

Big TV Live 1 week ago

Chaitra Controversy : చైత్ర జే ఆచార్…సప్త సాగరదాచే ఎల్లో (సైడ్ బి), బ్లింక్ వంటి డిఫరెంట్ మూవీస్ తో పాటు ఈ మధ్యే రిలీజ్ అయిన క్రేజీ మూవీ '3బీహెచ్‌కే' (3BHK) తో కన్నడ ఇండస్ట్రీలోనే కాకుండా సౌత్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది .ఇక కేవలం నటిగానే కాకుండా సింగర్‌గా కూడా మెప్పిస్తున్న ఈ టాలెంటెడ్ బ్యూటీ, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన లేటెస్ట్ ఫోటోషూట్స్ షేర్ చేస్తూ ఉంటుంది.

ఇందులో భాగంగానే ఇటీవల ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫోటోను పోస్ట్ చేసింది. అందరూ ఆ ఫోటోని అభినందిస్తుంటే, ఒక నెటిజన్ మాత్రం కంట్రోల్ కోల్పోయాడు.

హీరోయిన్‌వా లేక సె* వర్కర్‌వా? పద్ధతిగా ప్రవర్తించడం నేర్చుకో

‘@hosamani53’ అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌తో ఉన్న ఒక అకౌంట్ నుంచి చైత్ర ఫోటోపై అత్యంత అసభ్యకరమైన కామెంట్‌ వచ్చింది. కన్నడ భాషలో రాసిన ఆ కామెంట్‌లో… “అసలు నువ్వు హీరోయిన్‌వా లేక సె వర్కర్‌వా? పద్ధతిగా ప్రవర్తించడం నేర్చుకో” అంటూ వల్గర్ కామెంట్ చేశాడు. అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే, ఆ కామెంట్‌ పెట్టిన అకౌంట్‌కు ప్రొఫైల్ పిక్చర్‌గా పోలీస్ యూనిఫామ్‌లో ఉన్న వ్యక్తి ఫోటో ఉంది. లా అండ్ ఆర్డర్‌ను కాపాడాల్సిన పోలీస్ డ్రెస్‌లో ఉండి, ఒక మహిళపై ఇలాంటి నీచమైన కామెంట్‌ చేయడాన్ని చైత్ర అస్సలు సహించలేకపోయింది.

also read :'పెద్ది' ట్రైలర్ చూసి కంట్రోల్ తప్పిన చిరంజీవి.. డైలాగ్ లీక్ చేస్తూ ఊరమాస్ రివ్యూ!

సోషల్ మీడియాలో తెగ వైరల్

మిగతా వారిలా ఆ కామెంట్‌ను చూసి వదిలేయకుండా, చైత్ర వెంటనే రియాక్ట్ అయింది. ఆ వల్గర్ కామెంట్‌ను స్క్రీన్‌షాట్ తీసి, నేరుగా బెంగళూరు సిటీ పోలీసులను ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో ఒపెన్ గానే కంప్లైంట్ చేసింది. “గౌరవనీయులైన బెంగళూరు సిటీ పోలీసులు.. ఈ అకౌంట్ మీ డిపార్ట్‌మెంట్‌కు చెందిన వ్యక్తిదే అనుకుంటా. దయచేసి ఇతనికి మీరే సమాధానం చెప్పగలరా?” అంటూ ఆమె వేసిన ప్రశ్న సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. సినీ ప్రముఖులతో పాటు నెటిజన్లు సైతం చైత్ర ధైర్యాన్ని అభినందిస్తూ ఆ వ్యక్తిపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అసభ్యకరమైన కామెంట్‌ను వెంటనే డిలీట్

ఇక నటి చైత్ర పెట్టిన పోస్ట్‌తో బెంగళూరు పోలీసులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. ఆ ప్రొఫైల్ పిక్చర్‌లో ఉన్న వ్యక్తి నిజంగానే పోలీస్ శాఖలో పనిచేస్తున్నాడా? లేక ఖాకీ యూనిఫామ్ ఫోటో పెట్టుకుని డిపార్ట్‌మెంట్‌ను తప్పుదోవ పట్టిస్తున్నాడా? అనే కోణంలో అంతర్గత విచారణను వేగవంతం చేశారు. విషయం కాస్తా బెంగళూరు పోలీస్ కమిషనరేట్ దాకా వెళ్లడంతో సదరు నెటిజన్‌కు ఫ్యూజులు ఎగిరిపోయాయి. పోలీసుల ఎంట్రీతో భయపడిపోయిన ఆ ఆకతాయి, తను పెట్టిన అసభ్యకరమైన కామెంట్‌ను వెంటనే డిలీట్ చేశాడు. అంతేకాకుండా, చైత్ర కామెంట్ సెక్షన్‌లోనే బహిరంగంగా క్షమాపణలు చెబుతూ వరుస మెసేజ్‌లు పెట్టాడు. తన తప్పును క్షమించాలని వేడుకోవడం విశేషం.

పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు చెందినవాడు కాదు

ఇక నెట్టింట తెగ వైరల్ అయిన ఈ ఇన్సిడెంట్ పై బెంగళూరుకు చెందిన ఒక సీనియర్ పోలీస్ అధికారి మీడియాకు క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియాలో మహిళలపై ఇలాంటి వల్గర్ కామెంట్లు చేయడం ఖచ్చితంగా ఐటీ చట్టం ప్రకారం తీవ్రమైన నేరమని ఆయన స్పష్టం చేశారు. అయితే ప్రాథమిక విచారణలో ఆ అకౌంట్ వాడుతున్న వ్యక్తి పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు చెందినవాడు కాదని తేలిందని, ఎవరో కావాలనే ఖాకీ డ్రెస్ ఫోటోను ప్రొఫైల్‌గా పెట్టుకున్నారని వెల్లడించారు. నటి చైత్ర నుంచి ఇప్పటివరకు ఎలాంటి రాతపూర్వక అధికారిక ఫిర్యాదు అందలేదని, అయితే సదరు వ్యక్తి భయంతో తన తప్పు తెలుసుకుని నటికి క్షమాపణలు చెప్పాడని ఆయన పేర్కొన్నారు. హీరోయిన్లు గనుక ఇలాగే గట్టిగా స్పందిస్తే సోషల్ మీడియా కీచకులకు ఖచ్చితంగా అడ్డుకట్ట వేయవచ్చని ఈ ఘటన నిరూపించింది.ఏది ఏమైనా ఏ మాత్రం బయపడకుండా చైత్ర తీసుకున్న బోల్డ్ స్టెప్ ని మెచ్చుకొని తీరాల్సిందే !

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live