Sakshi Dhoni: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో (Indian Premier League 2026 Tournament) భాగంగా నిన్న చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ (Chennai Super Kings vs Sunrisers Hyderabad) మధ్య మ్యాచ్ జరిగింది.
తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోగా… సన్ రైజర్స్ హైదరాబాద్ మాత్రం ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ప్లే ఆఫ్స్ లోకి దూసుకు వెళ్ళింది హైదరాబాద్ జట్టు. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా మహేంద్రసింగ్ ధోని భార్య సాక్షి (Sakshi Dhoni) అంపైర్లకు వార్నింగ్ ఇచ్చినట్లు ఓ వీడియో వైరల్ గా మారింది. చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు శివమ్ దూబే బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో ఓ హెవీ బౌన్సర్ సంధించాడు హైదరాబాద్ బౌలర్ మలింగా. అయితే దాన్ని వైడ్ ఇవ్వలేదన్న కోపంతో సాక్షి ధోని రెచ్చిపోయారు. అది వైడ్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే అంపైర్లకు సాక్షి ధోని వార్నింగ్ ఇచ్చినట్టు కొంతమంది ప్రచారం చేస్తున్నారు.
అంపైర్లకు సాక్షి ధోని వార్నింగ్…చేతులతో సైగలు చేస్తూ
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో భాగంగా నిన్న సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 180 పరుగులు సాధించింది. అయితే ఈ లక్ష్యాన్ని 19 ఓవర్లలోనే చేదించి.. అద్భుతమైన విజయాన్ని నమోదు చేసుకుంది సన్రైజర్స్ హైదరాబాద్. అయితే ఈ క్రమంలో శివమ్ దూబే బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మలింగా అద్భుతమైన బౌన్సర్ వేశాడు. అది వైడ్ గా పరిగణిస్తారని భావించిన శివమ్ దూబే, దాన్ని వదిలేస్తాడు. అటు అంపైర్ వైడ్ మాత్రం ప్రకటించకుండా… బంతిని కౌంట్ చేస్తారు. ఈ క్రమంలో అది బౌన్సర్ అంటూ ప్రేక్షకుల మధ్యలో ఉన్న సాక్షి ధోని అరిచారు. అరే భయ్యా.. అది వైడ్ కదా ? ఎందుకు ఇవ్వలేదంటూ చేతులతో సైగలు చేసిన సాక్షి ధోని వీడియో వైరల్ గా మారింది. దీంతో అంపైర్ ను ధోని భార్య సాక్షి బెదిరించినట్లు పోస్టులు పెడుతున్నారు క్రికెట్ అభిమానులు.
చివరి మ్యాచ్ ఆడకుండానే ధోని రిటైర్మెంట్ ?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో భాగంగా లీగ్ దశలో తమ హోమ్ గ్రౌండ్ ఎం ఎ చిదంబరం లో చెన్నై సూపర్ కింగ్స్ చివరి మ్యాచ్ ఆడింది. ఈ క్రమంలో చివరి మ్యాచ్ అయిపోయిన తర్వాత మహేంద్ర సింగ్ ధోని సందడి చేశారు. గ్రౌండ్ మొత్తం తిరిగి అభిమానులకు బిగ్ ట్రీట్ ఇచ్చారు. ఆ తర్వాత ప్లేయర్ లందరితో ఫోటోలు కూడా దిగారు. ఈ క్రమంలో మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్ ఇచ్చినట్లేదని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
Mushfiqur Rahim: కాలితో గట్టిగా తన్నిన ముష్ఫిఖర్ రహీం..10 మీటర్ల దూరంలో పడ్డ హెల్మెట్

