Dailyhunt
సల్మాన్ ఖాన్ విలన్ గా పుష్ప నటుడు.. వేట మొదలు పెట్టిన వంశీ పైడిపల్లి!

సల్మాన్ ఖాన్ విలన్ గా పుష్ప నటుడు.. వేట మొదలు పెట్టిన వంశీ పైడిపల్లి!

Big TV Live 1 week ago

Salman Khan Vamsi Paidipalli: టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడుగా మంచి గుర్తింపు సంపాదించుకున్న వంశీ పైడిపల్లి ఇటీవల కాలంలో ఇతర భాష హీరోలతో సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే.

ఇక ఈయన ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సినిమా పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ పనులను జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.వంశీ పైడిపల్లి(Vamsi Paidipalli) డైరెక్షన్ లో సల్మాన్ ఖాన్ (Salman Khan) హీరోగా శ్రీ వెంకటేశ్వర సినీ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సల్మాన్ ఖాన్ ను ఢీ కొట్టబోతున్న పుష్ప నటుడు..

ఇటీవల పూజా కార్యక్రమాలను ఎంతో ఘనంగా జరుపుకున్న చిత్ర బృందం రెగ్యులర్ షూటింగ్ పనులలో బిజీ అయ్యారు.ఇక ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ జోడిగా నయనతార(Nayanthara) నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక వారితో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాలో నటీనటుల కోసం వంశీ పైడిపల్లి వేట మొదలు పెట్టారని తెలుస్తోంది. ముఖ్యంగా సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టడం కోసం పవర్ ఫుల్ విలన్ పాత్రను సిద్ధం చేశారని తెలుస్తుంది. అయితే ఈ పాత్రలో నటించడం కోసం ఈయన పుష్ప నటుడు ఫహద్ ఫాజిల్ (Fahad Fassil) ను సంప్రదించినట్టు సమాచారం.

విలన్ పాత్రలో ఫహద్ ఫాజిల్..

సల్మాన్ ఖాన్ ఇమేజ్ కు ఏమాత్రం తగ్గకుండా ఉండడం కోసం వంశీ పైడిపల్లి విలన్ పాత్రను తయారు చేశారట ఈ పాత్రలో ఫహద్ ఫాజిల్ ను తీసుకోవాలని డైరెక్టర్ ఆలోచనలో ఉన్నారు. ఒకవేళ ఈయన చేయటం కుదరకపోతే ఈ స్థానంలో బాలీవుడ్ సీనియర్ నటుడు అక్షయ్ ఖన్నాను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. అతి త్వరలోనే ఈ విషయానికి సంబంధించి అధికారక ప్రకటనను వెల్లడించనున్నారు. ఈ సినిమాలో మరొక తమిళ నటుడు అరవిందస్వామి కూడా కీలకపాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే.

సల్మాన్ ఖాన్ జోడిగా నయనతార..

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు ముంబైలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఒక సెట్ లో శరవేగంగా జరుగుతుంది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఇక నయనతార ఇప్పటికే షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన జవాన్ సినిమా ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈమె బాలీవుడ్ సినిమాలతో పాటు పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అవుతూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈ చిత్రం 2027 ఈద్ సందర్భంగా విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం అధికారకంగా తెలియజేశారు. అయితే కేవలం నాలుగు రోజుల రోజుల్లోనే ఈ సినిమాతో పాటు ప్రభాస్ సందీప్ రెడ్డి కాంబినేషన్లో రాబోతున్న స్పిరిట్ సినిమా కూడా విడుదల కానుంది. ఇలా బాక్స్ ఆఫీస్ వద్ద సల్మాన్ ఖాన్, ప్రభాస్ సినిమాలు పోటీ పడబోతున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live