Maa Inti Bangaram: సమంత ఇటీవల కాలంలో వెండితెర పై కనిపించి చాలాకాలం అవుతుంది. ఈమె విజయ్ దేవరకొండ(Vijay Devarakonda)తో కలిసి నటించిన ఖుషీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ సినిమా తర్వాత తన వ్యక్తిగత కారణాలు అనారోగ్య సమస్యల కారణంగా సమంత ఇండస్ట్రీకి కాస్త విరామం ఇచ్చిన సంగతి తెలిసిందే. విరామం తీసుకున్న సమంత తిరిగి సినిమాలను ప్రారంభించారు. ప్రస్తుతం ఈమె నిర్మాణ సంస్థను ప్రారంభించి తన నిర్మాణ సంస్థలోనే సినిమాలు చేస్తున్నారు. సమంత(Samantha) ప్రస్తుతం నందిని రెడ్డి(Nandini Reddy) దర్శకత్వంలో మా ఇంటి బంగారం(మా inti Bangaram) అనే సినిమాలో నటించారు. లేడీ ఓరియంటెడ్ సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రం మే 15వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు చిత్ర బృందం అధికారకంగా ప్రకటించారు.
జూన్ 19వ తేదీ మా ఇంటి బంగారం
మే 15వ తేదీ ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూ వచ్చారు. అయితే గత కొద్దిరోజులుగా ఈ సినిమా వాయిదా పడుతుంది అంటూ వార్తలు బయటకు వస్తున్నాయి. ఈ వార్తలకు అనుగుణంగానే ఈ సినిమా వాయిదా పడిందని తెలుస్తోంది. మే 15వ తేదీ విడుదల కావాల్సిన ఈ సినిమా జూన్ నెలలో విడుదలవుతుందని వార్తలు బయటకు వచ్చాయి కానీ సరైన తేదీ మాత్రం వెల్లడించలేదు. అయితే ఈ సినిమా జూన్ 19వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. ఇక చిత్ర బృందం త్వరలోనే ఈ విషయానికి సంబంధించి అధికారక ప్రకటన వెల్లడించనున్నారు.
ఐపిఎల్ సీజన్
మే నెలలో ఎలాంటి సినిమాలు లేవు . సమంత మా ఇంటి బంగారం సినిమా సోలోగానే ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమా విడుదలకు ఇది సరైన సమయమని అందరూ భావించారు కానీ సమంత అండ్ టీం మాత్రం ప్రస్తుతం ఐపిఎల్ సీజన్ నడుస్తున్న నేపథ్యంలో సినిమా విడుదల చేసిన అనుకున్న స్థాయిలో రీచ్ ఉండదన్న ఉద్దేశంతోనే ఈ సినిమాని వాయిదా వేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ పూర్తి అయిన అనంతరమే జూన్ 19వ తేదీ ఈ సినిమాని విడుదల చేయడానికి నిర్ణయించుకున్నట్లు సమాచారం.
ట్రాలాలా మూవింగ్ పిక్చర్ బ్యానర్
ఇక జూన్ నెలలో ఈ సినిమాతో పాటు మరిన్ని సినిమాలు కూడా విడుదలకు సిద్ధమవుతున్నాయి. జూన్ నెలలో కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన చెన్నై లవ్ స్టోరీ సినిమాని కూడా విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాలతో పాటు ఆనంద్ దేవరకొండ ఎపిక్ సినిమా కూడా జూన్ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇలా సోలో రిలీజ్ డేట్ నుంచి పక్కకు తప్పుకొని సమంత ఇతర సినిమాలతో పోటీగా బాక్సాఫీస్ బరిలో దిగడం ఎంతవరకు తనకు కలిసి వస్తుందనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాకు నందిని రెడ్డి దర్శకత్వం వహించగా సమంత తన సొంత నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్ బ్యానర్ పై ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో సమంత ప్రధాన పాత్రలో నటించగా గుల్షన్ దేవయ్య, గౌతమి, శ్రీముఖి వంటి తదితరులు కీలకపాత్రలలో కనిపించనున్నారు.

