Dailyhunt
సమ్మర్ లో కారు కొనాలనుకుంటున్నారా? ఈ కలర్ తీసుకోవడం బెస్ట్!

సమ్మర్ లో కారు కొనాలనుకుంటున్నారా? ఈ కలర్ తీసుకోవడం బెస్ట్!

Big TV Live 1 week ago

Best Car Colors for Summer:దేశ వ్యాప్తంగా కార్ల కొనుగోళ్లు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సమ్మర్ లో కార్లు కొనాలని భావించే వారికి ఆటో నిపుణులు కీలక సూచనలు చేస్తున్నారు.

వేసవిలో కారు తీసుకునే వాళ్లు కలర్ విషయంలో ఆచితూచి అడుగులు వేయాలంటున్నారు. కారు కలర్ ను చాలా మంది స్టైల్ గా భావించినా, నిజానికి కారు ఎంత వేడెక్కుతుంది? ఎంత త్వరగా మురికిగా కనిపిస్తుంది? ఒకవేళ రీసేట్ చేస్తే ఎంత వ్యాల్యూ ఉంటుంది? అనే విషయాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అందుకే, మన దేశంలో వేడి వాతావరణం ఉన్న నేపథ్యంలో సరైన రంగు ఎంచుకోవడం మంచిదంటున్నారు నిపుణులు.

⦿ తెలుపు రంగు

మన దేశంలో ఎక్కువగా కనిపించే కారు రంగు ఇదే. దీనికి ప్రధాన కారణం ఎండను తట్టుకునే గుణం ఉండడం. అంటే ఎండలో నిలిపినా, కారు అంతగా వేడెక్కదు. తెలుపు రంగు కారు, ముదురు రంగు కారుతో పోలిస్తే లోపల తక్కువ వేడి ఉంటుంది. కొన్నిసార్లు 10 నుంచి 20 డిగ్రీల వరకు తేడా కనిపిస్తుంది. AC పై ఒత్తిడి తగ్గుతుంది. కారులోకి ఎక్కినప్పుడు కూడా కొంచెం సౌకర్యంగా అనిపిస్తుంది. అదే సమయంలో తెలుపు రంగులో దుమ్ము అంతగా కనిపించదు. రీసేల్ వ్యాల్యూ కూడా ఎక్కువగానే ఉంటుంది.

⦿ సిల్వర్, గ్రే కలర్స్

వేసవిలో కారు కొనాలనుకునే వాళ్లు ఈ రెండు కలర్స్ ను కూడా ఎంచుకోవచ్చు. ఇవి కూడా వేడిని కొంత వరకు తట్టుకుంటాయి. తెలుపు రంగు లాంటి చల్లదనం ఇవ్వకపోయినా, రోజువారీ వినియోగానికి చాలా అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా దుమ్ము, చిన్న గీతలు, మరకలను కనిపించకుండా కాపాడుతాయి. తరచుగా కారు కడగకపోయినా శుభ్రంగా కనిపిస్తుంది. నగరాల్లో ఎక్కువగా డ్రైవ్ చేసే వారికి ఇవి మంచి ఆప్షన్‌గా చెప్పవచ్చు.

⦿ లైట్ కలర్స్

ఇక లైట్ కలర్స్ లో నీలం, బేజ్, మెటాలిక్ షేడ్స్ కూడా ఉన్నాయి. ఇవి కాస్త స్టైలిష్ లుక్ ఇస్తాయి. వేడిని కూడా కొంతవరకు తగ్గిస్తాయి. అయితే ఇవి సిల్వర్ కలర్ లా మురికిని పూర్తిగా దాచలేవు. అయినప్పటికీ, ముదురు రంగులతో పోలిస్తే ఇవి వేసవికి బాగా సరిపోతాయి.

⦿ డార్క్ కలర్స్

నలుపు, డార్క్ బ్లూ, డార్క్ గ్రే లాంటి రంగులు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. కానీ, వేసవిలో ఇవి అంతగా అనుకూలంగా ఉండవు. వేడిని ఎక్కువగా తీసుకుంటాయి. కారు లోపల చాలా వేడి పెరుగుతుంది. మీరు ఎండలో పార్క్ చేసి తిరిగి వచ్చేసరికి కారులో కూర్చోవడం కూడా కష్టంగా అనిపిస్తుంది. AC ఎక్కువగా పని చేయాల్సి వస్తుంది. దీని వల్ల ఫ్యూయెల్ వినియోగం కూడా పెరుగుతుంది. దుమ్ము, స్క్రాచులు కూడా ఈజీగా కనిపిస్తాయి.

Read Also: హాట్ వెదర్‌కు కూల్ SUVలు, రూ. 12 లక్షల్లోపు వెంటిలేటెడ్ సీట్లు ఉన్న టాప్ మోడల్స్ ఇవే!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live