Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సంపాదన కంటే ఎక్కువ ఖర్చు చేస్తారు.. ఈ తేదీల్లో పుట్టినవారిలో ఈ అలవాటు

సంపాదన కంటే ఎక్కువ ఖర్చు చేస్తారు.. ఈ తేదీల్లో పుట్టినవారిలో ఈ అలవాటు

Big TV Live 4 months ago

న్యూమరాలజీ (సంఖ్యా శాస్త్రం) ప్రకారం పుట్టిన తేదీ వ్యక్తి స్వభావాన్ని ప్రభావితం చేస్తుంది. డబ్బు సంపాదించడం మాత్రమే కాదు, ఖర్చు చేసే తీరు కూడా దీనిపై ఆధారపడుతుందని చెబుతారు.

కొంతమంది ఎంత సంపాదించినా పొదుపు చేయలేరు. లగ్జరీ జీవితం, సరదాల కోసం ఎక్కువగా ఖర్చు చేస్తుంటారు. పుట్టిన తేదీ ఆధారంగా కొంతమందికి డబ్బు పొదుపు చేయడం కష్టమవుతుంది. ఇప్పుడు అలాంటి వ్యక్తుల గురించి తెలుసుకుందాం.

పుట్టిన తేదీ సంఖ్య ఎలా తెలుసుకోవాలి?

పుట్టిన తేదీ సంఖ్య తెలుసుకోవడం చాలా సులభం. మీ పుట్టిన తేదీలోని అంకెలను కలపాలి.
ఉదాహరణకు 15వ తేదీన పుట్టినవారి సంఖ్య
1 + 5 = 6.
అంటే వారి బర్త్ నంబర్ 6 అవుతుంది.

అలాగే 24వ తేదీన పుట్టినవారికి కూడా:
2 + 4 = 6 అవుతుంది.

బర్త్ నంబర్ 5 వస్తే ఆలోచించకుండా ఖర్చు చేసే వారు

5, 14 లేదా 23 తేదీల్లో పుట్టినవారి బర్త్ నంబర్ 5 అవుతుంది. ఇలాంటి వారు చాలా చురుకుగా ఉంటారు. కొత్త విషయాలు, ప్రయాణాలు వీరికి చాలా ఇష్టం. షాపింగ్ చేయడం కూడా ఎక్కువగా ఇష్టపడతారు. డబ్బు సంపాదించే సామర్థ్యం వీరిలో బాగా ఉంటుంది. కానీ సంపాదించిన దానికంటే వేగంగా ఖర్చు చేస్తారు. స్నేహితులు, సరదాల కోసం ఎక్కువ డబ్బు ఖర్చవుతుంది. పొదుపు చేయడం వీరికి పెద్దగా రాదు. ప్రస్తుతం సంతోషంగా జీవించడం వీరి లక్ష్యం.

బర్త్ నంబర్ 3.. ఇతరుల కోసం ఖర్చు చేసే వారు

3, 12, 21 లేదా 30 తేదీల్లో పుట్టినవారి బర్త్ నంబర్ 3 అవుతుంది. ఇలాంటి వారికి చాలా మంచి మనసు ఉంటుంది. ఇతరులకు సహాయం చేయడం ఇష్టపడతారు. కుటుంబం, స్నేహితుల కోసం ఖర్చు చేయడంలో వెనకడుగు వేయరు. అందరినీ సంతోషంగా చూడాలని కోరుకుంటారు. ఈ కారణంగా తమ కోసం డబ్బు పొదపు చేయలేరు.
సౌకర్యవంతమైన జీవితం వీరిని ఎక్కువగా ఆకర్షిస్తుంది. చాలాసార్లు అవసరం లేకపోయినా ఖర్చు చేస్తారు.

బర్త్ నంబర్ 6.. విలాసాలను ఇష్టపడేవారు

6, 15 లేదా 24 తేదీల్లో పుట్టినవారి బర్త్ నంబర్ 6 అవుతుంది. ఇలాంటి వారికి అందమైన వస్తువులు చాలా ఇష్టం.
బ్రాండెడ్ వస్తువులు కొనడం ఇష్టపడతారు. మంచి ఆహారం, సౌకర్యవంతమైన జీవితం వీరికి ఆనందాన్ని ఇస్తుంది.
ఏదైనా వస్తువు నచ్చితే వెంటనే కొనేస్తారు. అవసరం, కోరిక మధ్య తేడా గుర్తించలేరు. దీంతో డబ్బు చాలా త్వరగా ఖర్చవుతుంది. అయితే వీరు చాలా కష్టపడి పనిచేస్తారు. ఎక్కువ సంపాదించే శక్తి కూడా వీరిలో ఉంటుంది.

మీ జీవితం ఇతరుల చేతిలో కీలుబొమ్మలా అయిపోయిందా? అందుకు ఈ బలహీనతలే కారణం

ఈ బర్త్ నంబర్ ఉండే వ్యక్తులు జీవితాన్ని ఆనందంగా గడపాలని భావిస్తారు. డబ్బు సంపాదించడంలో వీరు బాగా కష్టపడతారు. కానీ పొదుపు చేయడం మాత్రం వీరికి కష్టమవుతుంది.

విలాసాలు, సంతోషం కోసం ఖర్చు చేయడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. జీవితాన్ని ఒక రాజులా అనుభవించాలని కోరుకుంటారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live