Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సంగారెడ్డి జిల్లా.. ట్రాన్స్‌ఫార్మర్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం

సంగారెడ్డి జిల్లా.. ట్రాన్స్‌ఫార్మర్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం

Big TV Live 5 days ago

Factory Fire: సంగారెడ్డి జిల్లా రుద్రారంలోని కేపీఎల్ ట్రాన్స్‌ఫార్మర్ కంపెనీలో దారుణం జరిగింది. కంపెనీలోని వ్యర్థాలను తగలబెట్టే క్రమంలో అగ్ని ప్రమాదం జరిగింది.

దీంతో ఓక్క సారిగా మంటలు చెలరేగి పక్కకు వ్యాపించాయి. ఫ్యాక్టరీలో ఓక్కసారిగా మంటలు చెలరేగడంతో దట్టమైన పోగలు కమ్ముకున్నాయి. దీంతో అక్కడి కార్మికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

జనాభా లెక్కలకు టైం పెంచాలంటున్న స్టాఫ్.. ఎందుకో తెలుసా..?

భయంతో పరుగులు..

దట్టమైన పొగ, చూట్టూ మంటలు వ్యాపిచే సరికి తీవ్ర భయాదోళనకు గురైన కార్మికులు కంపెనీలోనుండి ఓక్కసారిగా అందరూ బైటికి పరుగులు తీశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే స్పందించిన పోలీసులు ఫైర్ సిబ్బందితో సహయంతో మంటలు అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగక పోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటన ఎలా జరిగింది, ఎవరైనా కావాలని చేశారా లేక వ్యర్ధాలను కాల్చే సమయంలో జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తూ కేసు నమొదు చేసుకున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live