Dailyhunt
Sara Tendulkar: రోహిత్ శర్మ లేకపోతే, ముంబై ఒక్క మ్యాచ్ గెలవదు..రాసిపెట్టుకోండి

Sara Tendulkar: రోహిత్ శర్మ లేకపోతే, ముంబై ఒక్క మ్యాచ్ గెలవదు..రాసిపెట్టుకోండి

Big TV Live 4 days ago

Sara Tendulkar: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో ( Indian Premier League 2026 Tournament) భాగంగా మొన్న ముంబై ఇండియన్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ ( Mumbai Indians vs Luck now Supergiants) మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే.

ఇందులో అద్భుతంగా రాణించిన ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో విక్టరీ అందుతుంది. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ విజయం పై సారా టెండూల్కర్ ( Sara Tendulkar) సంచలన వ్యాఖ్యలు చేసింది. ముంబై ఇండియన్స్ లో రోహిత్ శర్మ ( Rohit Sharma) లేకపోతే ఒక్క మ్యాచ్ కూడా గెలబోరని పరువు తీసింది. రోహిత్ శర్మను దేవుడిలా భావించాలని… అలాంటి ప్లేయర్ కు మ్యాచ్ కోక గోల్డ్ చైన్ వేయాల్సిందే అంటూ వ్యాఖ్యానించింది. దీంతో సారా టెండూల్కర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Raghu Sharma Letter: 33 ఏళ్ల వయస్సులో ఐపీఎల్ లోకి ఎంట్రీ, జై శ్రీ రామ్ అంటూ లెటర్‌…ఇంతకు ఎవరీ రఘు శర్మ ?

రోహిత్ శర్మ లేకపోతే, ముంబై ఒక్క మ్యాచ్ గెలవదు..రాసిపెట్టుకోండి

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) నేపథ్యంలో ముంబై ఇండియన్స్ దాదాపు ఎలిమినేట్ అయినట్లేనని చెప్పుకోవచ్చు. పది మ్యాచ్ లు ఆడితే కేవలం మూడింటిలో మాత్రమే ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. అద్భుతం జరిగితే తప్ప ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ చేరే అవకాశం లేదు. అయినప్పటికీ మొన్న లక్నో సూపర్ జెయింట్స్ జట్టు పైన అద్భుతంగా రాణించి ముంబై ఇండియన్స్ ( Mumbai Indians) విక్టరీ అందుకుంది. ముఖ్యంగా రోహిత్ శర్మ కిరాక్ ఇన్నింగ్స్ ఆడాడు. లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 228 పరుగులు సాధించింది. అయితే ఈ భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబై ఇండియన్స్ కేవలం 18.4 ఓవర్లలో… మ్యాచ్ ఫినిష్ చేసింది. ముఖ్యంగా రోహిత్ శర్మ 84 పరుగులతో దుమ్ము లేపాడు. గాయం తర్వాత కోలుకొని తిరిగి జట్టులోకి వచ్చిన రోహిత్ శర్మ.. 190 స్ట్రైక్ రేట్ తో 7 సిక్సర్లు అలాగే ఆరు బౌండరీలు సాధించాడు.

అయితే రోహిత్ శర్మ గాయం బారిన పడిన తర్వాత ముంబై ఇండియన్స్ దారుణంగా ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఎప్పుడైతే రోహిత్ శర్మ ( Rohit Sharma) రీ-ఎంట్రీ ఇచ్చాడో… మళ్లీ లక్నో సూపర్ జెయింట్స్ పై ( LSG) విక్టరీ అందుకుంది. రోహిత్ శర్మ చివరి వరకు ఇలాగే ఆడితే, ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ చేయడం గ్యారెంటీ అంటున్నారు. ఈ క్రమంలో రోహిత్ శర్మపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సారా టెండూల్కర్ ( Sara Tendulkar). రోహిత్ శర్మ లేకపోతే ముంబై ఇండియన్స్ మ్యాచ్ లను చూసేవాడు ఉండబోడని… అతడు ఆడితేనే మ్యాచ్ గెలుస్తారని వ్యాఖ్యానించారు. అందుకే రోహిత్ శర్మకు నీతా అంబానీ ( Nita Ambani) గోల్డ్ చైన్ వేసిందని వెల్లడించారు. అందుకే ముంబై ఇండియన్స్ జట్టులో కచ్చితంగా రోహిత్ శర్మను ఆడించాల్సిందేనని తెలిపారు.

https://www.facebook.com/photo/?fbid=122178973856784311&set=a.122099109440784311

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live