Satya Reddy: దేశ రాజధానిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ భవన్ వేదికగా నేషనల్ డ్యాన్స్ ఫెస్టివల్ అవార్డ్స్ ఫంక్షన్ అత్యంత వైభవంగా జరిగింది.ఇక ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్, 'శ్రీ జనం' పత్రిక అధినేత సత్యారెడ్డి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.
టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర
1980ల నుండే ‘హెచ్చరిక’, ‘రౌడీ బాబాయ్’, ‘భగవాన్’ వంటి సుమారు 20కి పైగా సినిమాలతో సీనియర్ దర్శకుడిగా, నిర్మాతగా టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న సత్యారెడ్డి, రాజకీయాల్లోనూ తెలుగు సేన పార్టీ మాజీ జాతీయ అధ్యక్షుడిగా క్రియాశీలక పాత్ర పోషించారు. తాజాగా విశాఖ ఉక్కు పోరాటంపై ఆయన తీసిన ‘ఉక్కు సత్యాగ్రహం’ చిత్రం సంచలనం సృష్టించగా, ఇప్పుడు ఏకంగా 100 భాషల్లో ‘కింగ్ బుద్ధ: ఐ వాంట్ వరల్డ్ పీస్’ అనే భారీ హాలీవుడ్ చిత్రాన్ని రూపొందిస్తూ గ్లోబల్ స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు రెడీ అయ్యారు.
also read:రాహుల్ గాంధీతో పెళ్లా? కంగనా రియాక్షన్ చూస్తే షాకవ్వాల్సిందే!
100 భాషల్లో ‘కింగ్ బుద్ధ సినిమా
ఈ వేడుకల్లో భాగంగా సత్యారెడ్డి గారు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించడమే కాకుండా, దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి తరలివచ్చిన ప్రతిభావంతులైన నృత్య కళాకారులకు తన స్వహస్తాలతో అవార్డులను అందజేశారు. ఒకే వేదికపై కూచిపూడి క్లాసికల్ డ్యాన్స్‌తో పాటు వెస్ట్రన్ డ్యాన్స్ పోటీపడటం ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా శాంతి సందేశాన్ని చాటిచెప్పే లక్ష్యంతో 100 భాషల్లో ‘కింగ్ బుద్ధ’ చిత్రాన్ని నిర్మిస్తున్న సత్యారెడ్డి కృషినిఅభినందిస్తూ వివిధ రాష్ట్రాల నాట్య గురువులు మరియు బుద్ధ భగవానుని అభిమానులు ఆయనను ఈ వేదికపై ఘనంగా సత్కరించడం విశేషం.
‘కింగ్ బుద్ధ’లో నటించే గోల్డెన్ ఛాన్స్
సన్మానం అనంతరం సత్యారెడ్డి గారు చేసిన ఒక ప్రకటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డాన్స్ లో అసాధారణ ప్రతిభ కనబరిచిన కళాకారులకు తన ప్రతిష్టాత్మక హాలీవుడ్ చిత్రం ‘కింగ్ బుద్ధ’లో నటించే గోల్డెన్ ఛాన్స్ ఇస్తానని తెలిపారు.”దేశ రాజధానిలోని ఏపీ భవన్‌లో ఇంతమంది కళాకారుల మధ్య ఉండటం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను, కళాకారులను ప్రోత్సహించడంలో నేను ఎప్పుడూ ముందుంటాను” అంటూ ఆయన చేసిన కామెంట్స్ కళాకారుల్లో మంచి ఉత్సాహాన్ని ఇచ్చాయి.
2026 ప్రథమార్ధంలో విడుదల
అమెరికా, చైనా, టిబెట్, థాయిలాండ్ వంటి దేశాల్లో షూటింగ్ జరుపుకోనున్న ఈ చిత్రం 2026 ప్రథమార్ధంలో విడుదల కానుంది. కేవలం కమర్షియల్ అంశాలే కాకుండా సామాజిక సందేశానికి పెద్దపీట వేసే సత్యారెడ్డి, తన శ్రీ జనం మూవీస్ బ్యానర్‌పై కొత్త టాలెంట్ తో మరిన్ని ప్రాజెక్టులను పట్టాలెక్కించేలా ప్లాన్ చేయడం విశేషం.మొత్తానికి ఈ అవార్డుల వేడుక ద్వారా మరింతమంది టాలెంటెడ్ డ్యాన్సర్స్ హాలీవుడ్ బాట పట్టనున్నారన్న మాట.

