Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సత్యదేవ్ సరికొత్త యాక్షన్ రైడ్ 'సమవర్తి'.. ఆకట్టుకుంటున్న టైటిల్ పోస్టర్!

సత్యదేవ్ సరికొత్త యాక్షన్ రైడ్ 'సమవర్తి'.. ఆకట్టుకుంటున్న టైటిల్ పోస్టర్!

Big TV Live 2 days ago

Samavarthi Movie: టాలెంటెడ్ హీరో సత్యదేవ్ వరుస క్రేజీ ప్రాజెక్ట్‌లతో దూసుకుపోతున్నారు. కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలతో పాటు కమర్షియల్ ఎంటర్‌టైనర్లను ఎంచుకుంటూ తనదైన ముద్ర వేస్తున్న ఆయన, తాజాగా తన 16వ చిత్రాన్ని (SD16) ప్రకటించారు.

ఈ చిత్రానికి 'సమవర్తి' (Samavarthi) అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ను మేకర్స్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. దీంతో సత్యదేవ్ మరోసారి ప్రయోగం చేయడానకి ప్రేక్షకుల ముందుకురాబోతున్నారు. వైవిధ్య మైన కథలకు ఎంచుకునే సత్యదేవ్ ఈ సారి ఏం చేస్తాడా అని సినిమా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Read also-మెగాస్టార్ 'MEGA158' షూటింగ్ షురూ.. సిటీ కాలేజీలో చిరంజీవి, అనస్వరా రాజన్!

అడ్రినలిన్ రష్ యాక్షన్ థ్రిల్లర్

ఈ సినిమాను 'ఎకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్' జోనర్‌లో తెరకెక్కిస్తున్నారు. పర్యావరణం, ప్రకృతి నేపథ్యంలో సాగే ఒక విభిన్నమైన యాక్షన్ డ్రామాగా ఇది ఉండబోతోంది. "వన్ హెల్ ఆఫ్ ఏ వైల్డ్ రైడ్" (ONE HELL OF A WILD RIDE) అంటూ చిత్ర యూనిట్ ఇచ్చిన ట్యాగ్‌లైన్ సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. ఇప్పటివరకు కాస్త క్లాస్, ఇంటెన్స్ పాత్రల్లో ఎక్కువగా కనిపించిన సత్యదేవ్, ఈ సినిమాలో ఫుల్ లెంత్ 'అడ్రినలిన్ యాక్షన్ మోడ్'లో కనిపించనున్నారు. ఆయన కెరీర్‌లోనే అత్యంత భారీ యాక్షన్ చిత్రంగా ఇది నిలవనుందని తెలుస్తోంది.

'సమవర్తి' అంటే..

టైటిల్ విషయానికి వస్తే.. పురాణాలలో 'సమవర్తి' అంటే యమధర్మరాజు అని అర్థం. అందరికీ సమానంగా న్యాయం చేసేవాడు, తప్పు చేసిన వారిని శిక్షించేవాడు అనే అర్థం వస్తుంది. ఈ సినిమాలో ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడటం కోసం హీరో శత్రువులపై యముడిలా విరుచుకుపడే పాత్రలో కనిపిస్తాడని టైటిల్ చూస్తే అర్థమవుతోంది. ఈ చిత్రానికి అజయ్ నాగ్ వి కథ, స్క్రీన్‌ప్లే అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. రుద్ర పిక్చర్స్, పంచభూత స్టూడియోస్ బ్యానర్లపై జక్కిడి శివ, శశిధర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. వైవిధ్యమైన కథాంశంతో, హై టెక్నికల్ వాల్యూస్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

Read also-త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

ఈ సినిమాను కేవలం తెలుగులోనే కాకుండా సౌత్ ఇండియాలోని ప్రధాన భాషలన్నింటిలోనూ విడుదల చేయనున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను ప్రకటించనున్నారు. "హంటింగ్ సూన్ ఇన్ థియేటర్స్" అంటూ మేకర్స్ ప్రకటించడంతో, త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ ముగించుకుని థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతోంది. సత్యదేవ్ కెరీర్‌లో ఈ 'సమవర్తి' ఎలాంటి మైలురాయిగా నిలుస్తుందో చూడాలి మరి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live