Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సెకండ్ హ్యాండ్ ఏసీ కొంటున్నారా? కొంపలు అంటుకుంటాయ్.. ఇవి గుర్తుపెట్టుకోండి!

సెకండ్ హ్యాండ్ ఏసీ కొంటున్నారా? కొంపలు అంటుకుంటాయ్.. ఇవి గుర్తుపెట్టుకోండి!

Big TV Live 2 weeks ago

Used AC Tips: సమ్మర్ లో ఉష్ణోగ్రతలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అధిక టెంపరేచర్ నుంచి ఉపశమనం పొందేందుకు పెద్ద ఎత్తున ప్రజలు ఏసీలను వినియోగిస్తుంటారు.

అయితే కొత్త ఏసీ కొనేంత ఆర్థిక స్తోమత లేని వారు.. సెకండ్ హ్యాండ్ లో పాత ఏసీని కొనుగోలు చేసేందుకు యత్నిస్తుంటారు. బడ్జెట్ పరంగా ఇది సరైన నిర్ణయమే అయినప్పటికీ.. పాత ఏసీని కొనే విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.

కంప్రెసర్ కండిషన్

పాత ఏసీ కొనే ముందు కనీసం 15-20 నిమిషాల పాటు ఆన్ చేసి చూడటం బెటర్. ఇలా చేయడం ద్వారా గది ఎంత త్వరగా చల్లబడుతుందో తెలుస్తుంది. ఒకవేళ ఏసీ రన్నింగ్ లో శబ్దాలు ఏదైనా వస్తున్నట్లు గుర్తిస్తే.. కంప్రెసర్ పాడైనట్లు గుర్తించాలి. ఒకవేళ దానిని మార్చాల్సి వస్తే చాలా ఖర్చుతో కూడుకున్న పని అవుతుంది. కాబట్టి ముందే జాగ్రత్త పడటం వల్ల.. ఆ ఖర్చు నుంచి బయటపడొచ్చు.

కాయిల్స్, గ్యాస్ లీకేజీ

ఏసీ లోపల ఉండే కాపర్ కాయిల్స్ ఏ విధంగా ఉన్నాయో కొనేముందు ఒకటికి రెండుసార్లు చెక్ చేయండి. కాయిల్స్‌పై నల్లటి మచ్చలు, తుప్పు ఉంటే గ్యాస్ లీకేజీ అయ్యే ప్రమాదం ఉంటుంది. అలాగే పైపుల దగ్గర, కాయిల్స్ పైన నూనె మరకలు కనిపిస్తే అక్కడ గ్యాస్ లీక్ అవుతున్నట్లు గుర్తించండి. అలాంటి ఏసీలను కొనకపోవడమే మంచిదని నిపుణులు పేర్కొంటున్నారు.

ఏసీ మరి పాతదైతే..!

ఏసీ కొనే ముందు అది సంవత్సరానికి చెందిందో తప్పనిసరిగా తెలుసుకోవాలి. 5 ఏళ్ల కంటే పాతదైన ఏసీని కొనకపోవడమే బెస్ట్. పాత ఏసీలు ఎక్కువ కరెంటును వినియోగిస్తాయి. ఒకవేళ కొనాల్సి వస్తే వీలైనంత వరకు 3 స్టార్ లేదా 5 స్టార్ రేటింగ్ ఉన్న ఇన్వర్టర్ ఏసీలను తీసుకోండి. ఇవి కరెంటు బిల్లును చాలా వరకు ఆదా చేస్తుంది.

వాడిన గ్యాస్ రకం

ఏసీలో ఏ రకమైన గ్యాస్ వాడుతున్నారో కూడా ఒకసారి అడిగి తెలుసుకోండి. పాత మోడల్స్‌లో ఆర్-22 గ్యాస్ వాడేవారు. ప్రస్తుత మోడల్స్ లో ఆ గ్యాస్ వినియోగించట్లేదు. ప్రస్తుతం ఆర్-32, ఆర్-410A గ్యాస్ ఉన్న ఏసీలే ఎక్కువగా మార్కెట్లో ఉన్నాయి. ఇవి పర్యావరణానికి మేలు చేయడంతోపాటు రీఫిల్లింగ్ ను కూడా సులభతరం చేస్తాయి.

కొత్త ఫోన్ కావాలా? ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైనవి ఇవే.. లిస్ట్ చూస్తే షాకే!

సర్వీసింగ్ హిస్టరీ, వైరింగ్

ఏసీని ఎంత త్వరగా సర్వీసింగ్ చేయాల్సి వచ్చిందో వంటి వివరాలను ముందే యజమానిని అడిగి తెలుసుకోండి. ఇండోర్, అవుట్‌డోర్ యూనిట్ల వైరింగ్ ఎక్కడైనా కాలిపోయిందా? కత్తిరించబడిందా? అనేది చెక్ చేయండి. అలాగే ఫిల్టర్లు కూడా శుభ్రంగా ఉన్నాయో లేదో పనిలోపని చూడండి. అవి బాగా పాడై ఉంటే ఏసీ కూలింగ్ సరిగా ఇవ్వదు. వీలైతే ఒక ఏసీ టెక్నీషియన్‌ను వెంట తీసుకెళ్లి ఏసీని చెక్ చేయించడం అన్నింటి కంటే బెస్ట్ అని నిపుణులు అంటున్నారు.

Gen Zని ఫిదా చేస్తున్న.. టాప్ - 5 వైర్డ్ ఇయర్ ఫోన్స్.. మ్యూజిక్ లవర్స్‌కు పండుగే!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live