Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సెక్రటేరియట్ భద్రత అధికారులకు మంత్రి మాస్ వార్నింగ్.. మళ్లీ రిపీట్ కావొద్దంటూ ఫైర్!

సెక్రటేరియట్ భద్రత అధికారులకు మంత్రి మాస్ వార్నింగ్.. మళ్లీ రిపీట్ కావొద్దంటూ ఫైర్!

Big TV Live 1 week ago

Restrictions: స్వేచ్ఛ బ్యూరో: ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత సచివాలయ తలుపులు సామాన్యులకు ఎప్పుడూ తెరిచే ఉంటాయని గొప్పగా చెప్పిన మాటలు నీటిమూటలుగానే మిగిలిపోతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ప్రజల సమస్యల పరిష్కార వేదికగా ఉండాల్సిన తెలంగాణ ప్రజా సచివాలయం ఇప్పుడు సామాన్య ప్రజలకు అడుగుపెట్టలేని ‘ఆంక్షల కోట’గా మారుతోంది. నాయకులు, వీ వీ ఐ పీ లకు రెడ్ కార్పెట్ పరిచి ఆహ్వానిస్తున్నఅధికారులు..తమ సమస్యలు చెప్పుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తున్న సామాన్యులకు మాత్రం రెడ్ సిగ్నల్ చూపిస్తూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇదే అంశం పై మంత్రులకు కూడా పిర్యాదు అందినట్టు సమాచారం.

రోజుకో నియమం.. విజిటర్ల నరకం..

మంత్రులను, అధికారులను కలసి తమ వినతిపత్రాలు అందజేసేందుకు తెలంగాణలోని మారుమూల ప్రాంతాల నుంచి ప్రతిరోజూ వందలాది మంది ప్రజలు సచివాలయానికి వస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచే సచివాలయంలోకి అనుమతిస్తారని ప్రభుత్వం గతంలో ప్రకటించినప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. అక్కడ విధులు నిర్వహిస్తున్న స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది ఉదయం వేళల్లో ప్రజలను లోపలికి అనుమతించడం లేదు. సాయంత్రం 3 గంటల తర్వాతే రావాలంటూ గేట్ల వద్దే నిలిపివేస్తున్నారు. ఉదయాన్నే వచ్చిన సామాన్యులకు కనీసం తాగడానికి మంచి నీరు లేక గంటల తరబడి సచివాలయం బయటే నిరీక్షించాల్సి వస్తోంది. ప్రతిరోజూ ఏదో ఒక కొత్త నిబంధన పేరుతో విజిటర్లను ఇబ్బంది పెట్టడం సర్వసాధారణమైపోయింది.

వీఐపీలకొక న్యాయం.. సామాన్యులకొక న్యాయమా?

ఒకవైపు సామాన్య ప్రజలను కనీసం గేటు దాటనివ్వని భద్రతా సిబ్బంది, వీఐపీలు , అధికార పార్టీ లీడర్లు రాగానే సెల్యూట్లు కొడుతూ కనీస వెరిఫికేషన్ కూడా లేకుండా లోపలికి పంపిస్తున్నారు. “ప్రజా పాలన అని చెప్పి తమకు ఈ ఆంక్షలేంటి? వీఐపీలకు ఒక న్యాయం, మా లాంటి సామాన్యులకు ఒక న్యాయమా?” అని సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల ఈ పక్షపాత వైఖరిపై సచివాలయం వద్ద నిత్యం ఘర్షణ వాతావరణం నెలకొంటోంది.

Also read: శ్రీకృష్ణదేవరాయలుగా కిచ్చా సుదీప్.. ఆకట్టుకుంటున్న 'దేవరాయ' టైటిల్ గ్లింప్స్ అండ్ ఫస్ట్ లుక్!

సర్కార్‌పై పెరుగుతున్న విమర్శల పర్వం..

ప్రజా సచివాలయంలో సామాన్యులకు చోటు లేకుండా పోవడంపై పౌర సమాజం, ప్రజా సంఘాలు ప్రతిపక్షాల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజా ప్రభుత్వం అని పేరు చెప్పుకుంటూ ప్రజలనే సెక్రటేరియట్ నుంచి దూరం పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అధికారుల సమన్వయ లోపం, ఎస్‌పిఎఫ్ సిబ్బంది అతి ఉత్సాహం వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందన్న చర్చ నడుస్తోంది.

అధికారులపై మంత్రి పొంగులేటి సీరియస్..

సచివాలయం వద్ద సామాన్య ప్రజలు పడుతున్న ఇబ్బందులు భద్రతా సిబ్బంది ప్రవర్తనపై సమాచార, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. విజిటర్లను గంటల తరబడి బయట నిలబెట్టడం, రోజుకో రకమైన ఆంక్షలు విధిస్తుండటంపై సెక్రటేరియట్ భద్రతాధికారులపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సెక్రటేరియట్ లో ఎస్పీఎఫ్ వ్యవహరిస్తున్న విధానంపై మంగళవారం మంత్రి పొంగులేటికి ఫిర్యాదులు అందాయి. వెంటనే ఐ అండ్ పీ ఆర్ సెక్రటరీ ముకుంద రెడ్డిని తన చాంబర్ కు పిలిపించుకొని ఆంక్షలు అంశంపై ఆరా తీసినట్లు సమాచారం.

తక్షణ ఆదేశాలు..

ప్రజా ప్రభుత్వంలో మీడియాకు ఎలాంటి ఆంక్షలు ఉండకూడదని మంత్రి పొంగులేటి నొప్పి చెప్పారు. ఎస్పీఎఫ్ స్టాఫ్ కు తక్షణమే ఆదేశాలు ఇవ్వాలని ఆదేశాలిచ్చారు. మరోసారి తన దృష్టికి ఆంటీ వి రిపీట్ అయితే బాగోదని ఎస్పీఎఫ్ ఉన్నతాధికారులకు వార్నింగ్ ఇవ్వాలని మంత్రి పొంగులేటి చెప్పినట్లు సమాచారం.. ఇదే సమయంలో అక్కడ రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి కూడా ఉన్నారు. ప్రజా ప్రభుత్వంలో సచివాలయానికి వచ్చే సామాన్యులను గౌరవించాలని, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికైనా అధికారులు తీరు మార్చుకుని, సామాన్య ప్రజలకు సచివాలయంలోకి సజావుగా ప్రవేశం కల్పిస్తారో లేదో వేచి చూడాలి.

ప్రత్యామ్నాయ పంటలు వేసిన రైతులకు.. తెలంగాణ సర్కార్ షాకింగ్ న్యూస్..!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live