Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
శతృత్వంతో చావును కొనితెచ్చుకునే ముఠా. రా గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామా

శతృత్వంతో చావును కొనితెచ్చుకునే ముఠా. రా గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామా

Big TV Live 5 days ago

Action Revenge Drama : గ్యాంగ్ వార్స్ లాంటి యాక్షన్ థ్రిల్లర్లకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. మామూలుగా అయితే ఇలాంటి సినిమాలను థియేటర్లలో చూసి తెగ ఎంజాయ్ చేస్తారు.

మరి ఓటీటీలో అలాంటి రా కంటెంట్ పడితే వదులుతారా ? ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది 2026లో విడుదలైన ఓ తెలుగు యాక్షన్ అండ్ రివేంజ్ డ్రామా గురినచ్చి. ఆ మూవీనే “డబుల్ బారెల్” (Double Barrel). జూలై 3 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ మూవీ ఏ ఓటీటీలో ఉంది ? స్టోరీ ఏంటో తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

మన హీరో సూర్య (శివ శంకర్ చక్రవర్తి) పక్కా గ్రామీణ యువకుడు. చిన్నప్పటి నుంచి సమాజంలో బలవంతుడిగా ఎదగాలని, అధికారాన్ని చేజిక్కించుకోవాలని తీవ్రమైన ఆకాంక్షతో ఉంటాడు. గ్రామంలోని చిన్న చిన్న సమస్యలు, అన్యాయాలు అతన్ని నేర ప్రపంచం వైపు నడిపిస్తాయి. మొదట్లో చిన్న స్థాయి గ్యాంగ్‌లతో ముడిపడి, క్రమంగా పెద్ద నేరాల వైపు మొగ్గుచూపుతాడు. అతని ఆశయం ఒక్కటే… అధికారం, డబ్బు, భయం కలిగించే బలం సంపాదించడం.

ఈ నేపథ్యంలోనే ఒక అనుకోని సంఘటన సూర్యను ప్రమాదకరమైన గ్యాంగ్ వార్‌లోకి లాగేస్తుంది. ప్రత్యర్థి గ్యాంగ్‌లతో హింసాత్మక ఘర్షణలు మొదలవుతాయి. హత్యలు, ప్రతీకారాలు, రక్తపాతం… సూర్య చుట్టూ ఉన్న వాతావరణం క్రూరంగా మారిపోతుంది. అతని కుటుంబం, స్నేహితులు కూడా ఈ వలయంలో చిక్కుకుపోతారు. సూర్య తన శత్రువులను అణచివేయడానికి మరింత హింసకు పాల్పడతాడు. కానీ అది అతన్ని మరింత గందరగోళంలోకి నెట్టేస్తుంది.

సినిమాలో తెలంగాణ యాస హైలెట్. హింస ద్వారా సమస్యలు పరిష్కరించలేమని, అది కేవలం వినాశనానికి దారితీస్తుందని సూర్య చివరకు గ్రహిస్తాడు. కానీ ఒక్కసారి ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టాక వెనక్కి తిరిగి రావడం అంత సులభం కాదు. అతని చుట్టూ ఉన్నవారి జీవితాలు నాశనమవుతాయి, ప్రశాంతత కరువవుతుంది. మరి ఇలాంటి డేంజరస్ సిట్యుయేషన్ నుంచి హీరో ఎలా బయట పడ్డాడు ? దీనివల్ల అతనికి కలిగిన నష్టం ఏంటి ? అతని కుటుంబాన్ని ఎలా రక్షించుకున్నాడు ? అన్నది చూసి తెలుసుకోవలసిన కథ.

ఫ్రీ స్ట్రీమింగ్

ఈ మూవీ Aha ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది ఇండిపెండెంట్ సినిమా కాబట్టి సబ్‌స్క్రిప్షన్ లేకుండా ఆహాలో ఉచితంగా చూడవచ్చు. శివ శంకర్ చక్రవర్తి నటించిన ఈ ఇండీ యాక్షన్ డ్రామా తెలంగాణ సంస్కృతి, యాస, సమాజంలోని హింస వల్ల జరిగే వినాశనాన్ని కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది.

సిటీ బ్లాస్ట్ ప్లాన్ ను ఆపడానికి పాస్ట్ లోకి… మిస్టీరియస్ మనిషి ఎంట్రీతో అడ్డం తిరిగే కథ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live