Shoaib Akhtar: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) నేపథ్యంలో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ( Vaibhav Suryavanshi) అదరగొడుతున్న సంగతి తెలిసిందే.
జస్ప్రీత్ బుమ్రా ( Bumrah) నుంచి మొదలుకొని భువనేశ్వర్ కుమార్ ( Bhuvi) వరకు స్టార్ బౌలర్లు అందరినీ చీల్చి చెండాడాడు. ఇలాంటి నేపథ్యంలో 15 ఏళ్ల వైభవ్ సూర్య వంశీ పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ ( Shoaib Akhtar). వైభవ్ సూర్యవంశీని చూసి అందరూ అనవసరంగా భయపడిపోతున్నారని మండిపడ్డారు. తన బౌలింగ్ లో వైభవ్ సూర్య వంశీ మొదటి బంతికే డకౌట్ కావడం గ్యారెంటీ అని సవాల్ విసిరారు షోయబ్ అక్తర్. దీంతో షోయబ్ అక్తర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
Tanveer Ahmed: బాబర్ ఒక్క టైటిల్ గెలిస్తే, కోహ్లీ మాత్రం కెప్టెన్సీ కోసం బిచ్చగాడిలా మారాడు Tanveer Ahmed
నా బౌలింగ్ లో వైభవ్ సూర్యవంశీని డకౌట్ చేసి చూపిస్తా
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) నేపథ్యంలో వైభవ్ సూర్య వంశీ అత్యున్నత ప్రదర్శన కనబరుస్తున్నాడు. అయితే అలాంటి వైభవ్ సూర్య వంశీని అదిరిపోయే యార్కర్ తో ఔట్ చేశాడు ఢిల్లీ ఆటగాడు జెమీసన్ ( Jemison). ఆ తర్వాత కళ్ళు పెద్దగా చేసి, నోరు పెద్దగా తెరిచి సెలబ్రేషన్స్ చేసుకున్నాడు జెమీసన్. దీంతో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ భయపడిపోయాడని సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వచ్చాయి. జెమీసన్ పై బీసీసీఐ కూడా చర్యలు తీసుకుంది. చిన్న పిల్లాడిని అలా భయపట్టిస్తావా ? అంటూ యాక్షన్ తీసుకుంది.
ఈ అంశంపై పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ ( Shoaib Akhtar) స్పందించాడు. బౌలర్ అన్నాక సెలబ్రేషన్స్ చేసుకోవడం కామన్ అని తెలిపారు. చిన్నపిల్లలు భయపడతాడు అంటూ వెధవ వేషాలు వేయకూడదని… భయపడే వాళ్ళు క్రికెట్ నుంచి తప్పుకోవాలని చురకలు అంటించారు షోయబ్ అక్తర్. తాను కూడా వికెట్ తీసిన తర్వాత అలాంటి సెలబ్రేషన్స్ చేసుకున్న సందర్భాలు బాగానే ఉన్నాయని తెలిపారు. బౌలర్ సెలబ్రేషన్స్ చేసుకుంటే తప్పు అని చెప్పే అధికారం బీసీసీఐకి ఎవరు ఇచ్చారని నిలదీశారు. 15 ఏళ్ల వైభవ్ సూర్య వంశీ తన బౌలింగ్ లో డక్ ఔట్ కావడం గ్యారెంటీ అన్నారు. సరైన యార్కర్లతో వైభవ్ సూర్యవంశీని సులభంగా ఔట్ చేయవచ్చు అని తెలిపారు.
వైభవ్ సూర్య వంశీ పెద్ద బ్యాటర్ కాదని… స్లోగర్ అంటూ పరువు తీశాడు. వైభవ్ సూర్యవంశీ వయస్సు విషయంలో కూడా అనుమానాలు వ్యక్తం చేశాడు పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్. అతడు కచ్చితంగా 25 సంవత్సరాల వరకు ఉంటాడని వ్యాఖ్యానించారు. ప్రతి మ్యాచ్ కంటే ముందు డోపింగ్ టెస్టులు కచ్చితంగా నిర్వహించాలని కోరారు. ఈ విషయంలో ఐసీసీ కచ్చితంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు లేఖలు కూడా ఐసీసీకి రాస్తానని తెలిపారు షోయబ్ అక్తర్.

