Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
శోభాశెట్టి ప్రేమను యశ్వంత్ అంత ఈజీగా ఒప్పుకోలేదా.. ఎన్నో నిజాలు బయటపెట్టిన బ్యూటీ!

శోభాశెట్టి ప్రేమను యశ్వంత్ అంత ఈజీగా ఒప్పుకోలేదా.. ఎన్నో నిజాలు బయటపెట్టిన బ్యూటీ!

Big TV Live 2 weeks ago

Shobha Shetty: శోభా శెట్టి (Shobha Shetty). ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అందం, అభినయంతో.. అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకుంటూ ఊహించని పాపులారిటీ సొంతం చేసుకుంది.

కార్తీకదీపం సీరియల్ లో డాక్టర్ మోనితగా పవర్ఫుల్ విలన్ పాత్ర పోషించి ప్రేక్షకులను ఆకట్టుకుంది శోభా శెట్టి. అలాంటి ఈమె బిగ్ బాస్ (Bigg Boss)లో కూడా సందడి చేసింది. ముఖ్యంగా టైటిల్ విజేత అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా చివరి వరకు వచ్చి ఎలిమినేట్ అయ్యింది. ఇకపోతే కన్నడ బిగ్ బాస్ లోకి అడుగుపెట్టింది కానీ అక్కడ హౌస్ మేట్స్ తో ఉండలేక హోస్ట్ కిచ్చా సుదీప్ ను రిక్వెస్ట్ చేసి మరీ హౌస్ నుంచి బయటకు వచ్చిన విషయం తెలిసిందే.

యశ్వంత్ తో ప్రేమ, పెళ్లి..

ఇకపోతే బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా చేస్తున్నప్పుడు ఈమెపై ఏర్పడిన నెగెటివిటీ కారణంగా కార్తీకదీపం 2 సీరియల్ లో అవకాశాన్ని కోల్పోయిందనే కామెంట్లు వ్యక్తమయ్యాయి. ప్రస్తుతం వ్యాపారం మొదలుపెట్టిన ఈమె దీనిని గాడిలో పెట్టేందుకు ప్రయత్నం చేస్తోంది. మరొకవైపు కార్తీకదీపం సీరియల్ లో డాక్టర్ బాబు తమ్ముడిగా నటించిన యశ్వంత్ రెడ్డి (Yashwanth Reddy) తో ఈమె ప్రేమలో పడింది.పైగా వీరిద్దరికి నిశ్చితార్థం జరిగి రెండేళ్లయినా ఇంకా పెళ్లి చేసుకోకపోవడం పై సోషల్ మీడియాలో పలు రకాల అనుమానాలు, ట్రోల్స్ వ్యక్తం అవుతున్నాయి. ఇకపోతే ఇలాంటి సమయంలో తనపై , తన పెళ్లిపై వస్తున్న ట్రోల్స్ కి స్పందిస్తూనే.. తన ప్రేమను గెలిపించుకోవడానికి పడిన కష్టం గురించి కూడా చెప్పుకొచ్చింది.

యశ్వంత్ నా ప్రేమను అంత త్వరగా ఒప్పుకోలేదు – శోభా శెట్టి

“నేను కార్తీకదీపం సీరియల్ లో నటిస్తున్నప్పుడే యశ్వంత్ తో ప్రేమలో పడ్డాను. నాది వన్ సైడ్ లవ్. యశ్వంత్ కి నా ప్రేమ గురించి చెప్పినా.. ఆయన అంత ఈజీగా నా ప్రేమను ఒప్పుకోలేదు. చాలా సమయం తీసుకున్నారు. జీవితంలో సెటిల్ అయ్యాకే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. దీంతో చేసేదేమీ లేక వద్దులే వదిలేద్దాం అనుకున్న సమయంలో మళ్లీ యశ్వంత్ వచ్చి నా ప్రేమను అర్థం చేసుకొని ప్రపోజ్ చేశాడు” అంటూ తన ప్రేమ విషయాన్ని బయటపెట్టింది శోభిత. మొత్తానికైతే యశ్వంత్ ప్రేమను పొందడానికి చాలా సంవత్సరాలు ఎదురు చూశానని చెప్పింది ఈ ముద్దుగుమ్మ

పెళ్లి ఆలస్యం అందుకే..

నిశ్చితార్థం జరిగి రెండేళ్లు అవుతున్నా పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణాన్ని ఆమె తెలిపింది. “మా పెళ్లి జరిగి రెండేళ్లు అవుతోంది . నిజానికి గత ఏడాదే వివాహం చేసుకోవాలనుకున్నా.. కానీ మా అమ్మకు ఆరోగ్యం బాగోకపోవడంతో పెళ్లిని వాయిదా వేసుకున్నా.. నా పెళ్లిని చాలా ఘనంగా జరిపించాలనేది మా అమ్మ కల . పైగా మా ఇంట్లో నాదే చివరి పెళ్లి . ఇక అమ్మ కోలుకున్నాకే పెళ్లి గురించి ఆలోచిస్తాం ” అంటూ తన పెళ్లి ఆలస్యంపై అసలు విషయాన్నీ బయటపెట్టింది.

కాబోయే అత్త గురించి శోభా శెట్టి కామెంట్స్..

ఇకపోతే కాబోయే అత్తగారి గురించి కూడా పలు కామెంట్లు చేసింది . నేను నా మొదటి ప్రయారిటీ ఫ్యామిలీకి ఇస్తాను. హాయ్ బాయ్ చెప్పే వారే తప్ప క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరూ లేరు. నాకు నా ఫ్యామిలీలోనే అన్నయ్యలు, కజిన్స్ చాలామంది ఉన్నారు. కాబట్టి బయట ఫ్రెండ్స్ అక్కర్లేదు. మా అత్త గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మా ఇద్దరికీ భాషాపరమైన ఇబ్బందులే తప్ప మరే ఇబ్బంది లేదు. నన్ను బాగా అర్థం చేసుకుంటారు . నేను యశ్వంత్ షూటింగ్లో బిజీగా ఉంటే.. నా పప్పీని కూడా అత్తయ్య చాలా బాగా చూసుకుంటారు.” అంటూ తెలిపింది. మొత్తానికైతే తన ప్రేమ గురించి పెళ్లి ఆలస్యం గురించి శోభా శెట్టి కీలక వ్యాఖ్యలు చేసింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live