Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
శ్రీకృష్ణదేవరాయలుగా కిచ్చా సుదీప్.. ఆకట్టుకుంటున్న 'దేవరాయ' టైటిల్ గ్లింప్స్ అండ్ ఫస్ట్ లుక్!

శ్రీకృష్ణదేవరాయలుగా కిచ్చా సుదీప్.. ఆకట్టుకుంటున్న 'దేవరాయ' టైటిల్ గ్లింప్స్ అండ్ ఫస్ట్ లుక్!

Big TV Live 1 week ago

Kiccha Sudeep: రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో నాని (Nani), సమంత (Samantha) కాంబినేషన్లో వచ్చిన 'ఈగ' సినిమాతో తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు కిచ్చా సుదీప్ (Kiccha Sudeep).

ఈ చిత్రంలో విలన్ పాత్ర పోషించి ఊహించని ఇమేజ్ దక్కించుకున్నారుm ఈ సినిమా అందించిన విజయంతో మరిన్ని తెలుగు ప్రాజెక్టులు చేసిన ఈయన.. ఇప్పుడు వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. అలాంటి ఈయన తాజాగా హిస్టారికల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ మేరకు నేడు ఆయన పుట్టిన రోజు కావడంతో ఆయన నటిస్తున్న ఆ సినిమా టైటిల్, అలాగే ఫస్ట్ లుక్ ను రివీల్ చేస్తూ మేకర్స్ విడుదల చేసిన ఈ గ్లింప్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కిచ్చా సుదీప్ బర్త్ డే స్పెషల్.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్..

సుదీప్ ప్రధాన పాత్రలో రాబోతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి ‘దేవరాయ ‘ అంటూ టైటిల్ ఫిక్స్ చేస్తూ మేకర్స్ ఒక కీలకమైన అప్డేట్ ను విడుదల చేశారు. ఈ సినిమాలో సుదీప్ శ్రీకృష్ణదేవరాయలుగా కనిపించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. “చరిత్రను మార్చిన సామ్రాజ్యం ఒక శకాన్ని నిర్వచించిన మహారాజు.. కాలాన్ని దాటి నిలిచిపోయే ఓ దిగ్గజం”అంటూ దేవరాయను మేకర్స్ పరిచయం చేశారు. ఈ గ్లింప్స్ చివరిలో అభినయ చక్రవర్తి కిచ్చా సుదీప్ ను శ్రీకృష్ణదేవరాయల పాత్రలో చూపించబోతున్నట్లు వెల్లడించడంతో ప్రస్తుతం ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

శ్రీకృష్ణదేవరాయలుగా కిచ్చా సుదీప్..

విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన శ్రీకృష్ణదేవరాయలు భారత చరిత్రలో అత్యంత గొప్ప రాజులలో ఒకరిగా పేరు సంపాదించుకున్నారు. అలాంటి హిస్టారికల్ పాత్రలో సుదీప్ కనిపించబోతుండడంతో ఈ ప్రాజెక్టు పై ఆసక్తి నెలకొంది. ఈ మేరకు తాజాగా విడుదల చేసిన గ్లింప్స్ లో కిచ్చా సుదీప్ లుక్, రాజుగారి పాత్రలో ఉట్టిపడుతున్న రాజసం, గంభీరత ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఒకప్పుడు విలన్ పాత్రలతో ప్రేక్షకులను భయపెట్టిన కిచ్చా సుదీప్.. ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయలుగా రాజుగారి పాత్రలో కనిపించబోయేసరికి అంచనాలు పీక్స్ కి చేరుకున్నాయి.ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, సుప్రియాన్వి పిక్చర్స్ స్టూడియో బ్యానర్లపై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి గౌరహరి సంగీతం అందిస్తుండగా.. 2027 డిసెంబర్లో ఈ చిత్రాన్ని థియేటర్లోకి తీసుకురాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

కిచ్చా సుదీప్ BRB మూవీ నుండి ఆకట్టుకుంటున్న పోస్టర్..

కిచ్చా సుదీప్ నటిస్తున్న మరో చిత్రం బిల్లా రంగా బాషా: ఫస్ట్ బ్లడ్ నుంచి కూడా మేకర్స్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. మంచుతో కప్పబడిన ప్రాంతం ..చుట్టూ విధ్వంసం.. ఆకాశంలో విమానాలు.. యుద్ధ యంత్రాల మధ్యలో బైకుపై సుదీప్ కనిపించిన తీరు సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది . మొత్తానికైతే కిచ్చా సుదీప్ బర్త్ డే సందర్భంగా ఆయన నటిస్తున్న సినిమాల నుండి విడుదల చేసిన ఈ ట్రీట్ మరింత స్పెషల్ గా మారింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live