Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సీఎం విజయ్ జననాయగన్ కు తప్పని తిప్పలు.. మళ్లీ సెన్సార్ షాక్!

సీఎం విజయ్ జననాయగన్ కు తప్పని తిప్పలు.. మళ్లీ సెన్సార్ షాక్!

Big TV Live 2 weeks ago

Jana nayagan: ప్రముఖ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ హెచ్.వినోద్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్ గా, మమితా బైజు, బాబీ డియోల్ తదితరులు కీలకపాత్రలు పోషించిన చిత్రం 'జన నాయగన్'.

ఈ చిత్రాన్ని తెలుగులో ‘జన నాయకుడు’, హిందీలో ‘జననేత’ అంటూ రిలీజ్ చేయాలనుకున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్లో నిర్మితమైన ఈ చిత్రాన్ని ఈ ఏడాది సంక్రాంతి బరిలో నిలపాల్సి ఉండగా.. సెన్సార్ కారణాలవల్ల ఈ సినిమా వాయిదా పడింది. అలాగే కోర్టు చుట్టూ తిరిగింది. అలా ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఏడు నెలలు పూర్తి చేసుకుంది.ఇక ఇప్పుడు తమిళనాడుకి విజయ్ ముఖ్యమంత్రిగా అవతరించారు. ఇక ఈ సినిమాకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు, సాఫీగా సినిమా విడుదలవుతుంది అనుకునే లోపే మళ్లీ సెన్సార్ షాక్ ఇచ్చింది. మరి అసలేమైందో ఇప్పుడు చూద్దాం.

విజయ్ జన నాయగన్ మూవీకి సెన్సార్ షాక్..

విజయ్ దళపతి పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ జననాయగన్ రిలీజ్ చుట్టూ ఇండస్ట్రీలో ఇప్పుడు మరో సరికొత్త చర్చ నడుస్తోంది. గత ఏడు నెలలుగా సెన్సార్ వివాదాలు, కోర్టు కేసుల కారణంగా వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమాకి సెన్సార్ బోర్డు మరో షాకింగ్ న్యూస్ చెప్పింది. సెన్సార్ సభ్యుల మార్పుల మేరకు.. కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం మార్పులు చేర్పులు చేసిన తర్వాత సెన్సార్ కి వెళ్లిన ఈ చిత్రానికి సినిమా చూసిన సెన్సార్ బోర్డు ఏ (అడల్ట్)సర్టిఫికెట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. వచ్చే వారం రోజుల్లోగా ఈ తుది సర్టిఫికేషన్ ప్రక్రియ పూర్తికానందుని.. వెంటనే హిందీ, తెలుగు వెర్షన్ల సెన్సార్ ఫార్మాలిటీస్ ని కూడా పూర్తి చేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

కలెక్షన్ల పై దెబ్బ పడనుందా?

మరోవైపు ఈ చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ లభించనున్న నేపథ్యంలో మేకర్స్ ఈ సినిమాను జూలై 16 లేదా 23వ తేదీన థియేటర్లోకి తీసుకురావాలని భావిస్తున్నారట. ఇప్పటికే ఈ స్లాట్ లో పలు క్రేజీ చిత్రాలు తమ విడుదల తేదీలను ప్రకటించాయి. జూలై 17వ తేదీన అన్బే డయానా, జూలై 23న మకుటం, ఇమ్మోర్టల్, జూలై 31న డీసీ, సిగ్మా వంటి చిత్రాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి. ఒకవేళ విజయ్ దళపతి ఈ చిత్రాల మధ్యలో సినిమాను విడుదల చేయడానికి రంగంలోకి దిగితే మాత్రం ఇప్పటికే ప్రమోషన్లు మొదలు పెట్టిన ఆయా చిత్రాల కలెక్షన్ల పై తీవ్ర ప్రభావం పడే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇకపోతే సెన్సార్ ఏ సర్టిఫికెట్ ఇవ్వడం వల్ల చిన్న పిల్లలు ఈ సినిమా చూసేందుకు అనుమతించరు. తమ హీరో సినిమాను కావాలని ఇబ్బందులు పెడుతున్నారని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సీఎం గారు ప్రమోషన్స్ కి వస్తారా?

అయితే విజయ్ దళపతి చివరి చిత్రం కావడంతో ఈ సినిమా ఎప్పుడు వచ్చినా సరే థియేటర్ల వద్ద మాస్ జాతర ఖాయం అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదిలా ఉండగా మరొకవైపు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్ ఈ సినిమా ప్రమోషన్స్ కి పాల్గొంటారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి చూద్దాం ఈ సినిమా విడుదల తర్వాత ఎలాంటి రికార్డులు అందుకుంటుందో..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live