Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సిక్సర్లు కొట్టాలంటూ పాక్ ప్లేయర్లపై PCB ఒత్తిడి..అమెరికాలో స్పెషల్ ట్రైనింగ్

సిక్సర్లు కొట్టాలంటూ పాక్ ప్లేయర్లపై PCB ఒత్తిడి..అమెరికాలో స్పెషల్ ట్రైనింగ్

Big TV Live 2 months ago

PCB Set To Send Pakistan Players To USA: పాకిస్తాన్ క్రికెట్ ( Pakistan Cricket) పరిస్థితి ఇప్పుడు అత్యంత దారుణంగా తయారైన సంగతి తెలిసిందే. వరుసగా కీలక టోర్నమెంట్స్ లలో పాకిస్తాన్ పురుషుల జట్టు ( Pakistan Cricket Team) దారుణంగా ఓడిపోతోంది.

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటులో ( 2026 T20 World Cup tournament )
పాకిస్తాన్ పురుషులతో పాటు మహిళలు కూడా హ్యాండ్ ఇచ్చారు. మొన్న బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయిన పాకిస్తాన్.. అంతకు ముందు టీమిండియా చేతిలో చిత్తు అయింది. ఆస్ట్రేలియాపై సొంత గడ్డలో విజయం తప్ప పాకిస్తాన్ సాధించింది ఏమీ లేదు. ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ జట్టును మరింత పటిష్టంగా చేసేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ( Pakistan Cricket Board) సంచలన నిర్ణయం తీసుకుంది. తమ క్రికెటర్లను అమెరికాకు ( America) పంపించేందుకు సిద్ధమైంది. పాకిస్తాన్ క్రికెటర్ల పవర్ హిటింగ్ అలాగే స్ట్రెంత్.. ఫిట్నెస్ ప్రమాణాలను మెరుగుపరిచేందుకుగాను అమెరికా పంపించేందుకు నిర్ణయం తీసుకుని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. జులై మొదటి వారంలో తమ ప్లేయర్లను అమెరికా పంపించబోతున్నారట. ఈ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది.

Jemimah Rodrigues ICC Women’s T20 World Cup 2026: వరల్డ్ కప్ లో 33 యాడ్స్.. కానీ చేసింది 32 పరుగులే, జెమిమాను తీసేయండి అంటూ ట్రోల్స్‌

సిక్సర్లు కొట్టాలంటూ ప్లేయర్లపై PCB ఒత్తిడి..అమెరికాలో స్పెషల్ ట్రైనింగ్

పాకిస్తాన్ క్రికెట్ జట్టులో భారీ మార్పుల కోసం శ్రీకారం చుట్టింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. మూడు ఫార్మాట్లకు మూడు టీమ్స్ ఫైనల్ చేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఇక లేటెస్ట్ గా పాకిస్తాన్ క్రికెటర్ల పవర్ ఫిట్టింగ్ మెరుగుపరిచేందుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టులో ఉన్న కొంతమంది సెలెక్టెడ్ ప్లేయర్లను అమెరికాకు పంపించనుంది. అక్కడ మెడికల్, ఫిట్నెస్ టెస్టులు ఉండనున్నాయి. అలాగే ప్లేయర్లలో పవర్ హిట్టింగ్ లోపాలు ఉంటే సరిదిద్దేలా అమెరికాలో ట్రైనింగ్ ఇవ్వనున్నారు. బౌలింగ్ లో కూడా మెరుగుపడేలా చర్యలు తీసుకోబోతున్నారట. బాబర్ ఆజం ( Babar Azam), ఫర్హాన్ ( Farhan), ఫకర్ జమాన్, అలీ రాజా (Ali Raza) లాంటి క్రికెటర్లు అందరినీ అమెరికా పంపించబోతున్నారట.

అమెరికాకు పాకిస్తాన్ క్రికెటర్లను పంపించడం పై కోచ్ మైక్ హెసన్ ( Mike Hesson) కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. తమ జట్టులో ఉన్న కొంతమంది ప్లేయర్లను అమెరికాకు ట్రైనింగ్ కోసం పంపిస్తున్నామని వివరించారు. పవర్ హిట్టింగ్ ( Power Hitting) లోపాలను సరిదిద్దుకునేందుకు.. ఈ ట్రైనింగ్ స్పెషల్ గా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఫిట్నెస్ కోసం కాకుండా విభిన్న వాతావరణంలో ఆడగల నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు గాను అక్కడ ట్రైనింగ్ ఇస్తారని చెప్పుకొచ్చారు.

Daryll Cullinan has ra ised public concern over Vaibhav Sooryavanshi: ఈ లేత వయస్సులో వేగంగా బ్యాటింగ్ చేసి, ప్రాణాలపైకి తెచ్చుకోవద్దు ? వైభవ్ కు డారిల్ హెచ్చరికలు PCB Set To Send Pakistan Players To USA

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live