Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సింగిల్ ఛార్జ్ తో 243 కి.మీ రేంజ్.. సింపుల్ వేవ్ సూపర్ స్కూటర్ వచ్చేసింది!

సింగిల్ ఛార్జ్ తో 243 కి.మీ రేంజ్.. సింపుల్ వేవ్ సూపర్ స్కూటర్ వచ్చేసింది!

Big TV Live 1 week ago

Simple Wave Electric Scooter:భారత్‌ లో ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మరింత మంది కస్టమర్లను ఆకట్టుకునేలా బెంగళూరుకు చెందిన ఈవీ స్టార్టప్ సింపుల్ ఎనర్జీ కొత్త ఫ్యామిలీ స్కూటర్‌ను తీసుకొచ్చింది.

సింపుల్ వేవ్ పేరుతో విడుదలైన ఈ స్కూటర్ ప్రారంభ ధర రూ.1.10 లక్షలుగా నిర్ణయించింది. ముఖ్యంగా ఎక్కువ రేంజ్, భారీ స్టోరేజ్ కావాలనుకునే ఫ్యామిలీ వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని దీనిని తయారు చేసినట్లు కంపెనీ వెల్లడించింది.

నాలుగు వేరియంట్లు.. ఆరు క్లస్టర్ ఆప్షన్లు!

సింపుల్ వేవ్ నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఎంపికలను కలిపితే మొత్తం ఆరు కాన్ఫిగరేషన్లు ఉంటాయి. బ్యాటరీ సామర్థ్యాన్ని బట్టి రేంజ్‌లో కూడా తేడా ఉంటుంది. బేస్ వేవ్ Sలో 2.2kWh బ్యాటరీ ఉంటుంది. ఇది 110 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుంది. 2.7kWh బ్యాటరీ ఉన్న మరో వేరియంట్ 132 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. 3.7kWh బ్యాటరీతో వచ్చే వేవ్ మోడల్ 171 కిలోమీటర్ల వరకు వెళ్తుందని కంపెనీ వెల్లడించింది. టాప్ వేరియంట్ వేవ్+లో 5kWh బ్యాటరీ ఉండగా, ఒక్కసారి ఛార్జ్ చేస్తే 243 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది.

ఏకంగా 70 లీటర్ల స్టోరేజ్

వేవ్‌లో కుటుంబ అవసరాలను దృష్టిలో పెట్టుకుని స్టోరేజ్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. మొత్తం 70 లీటర్ల స్టోరేజ్ స్పేస్ ఉంది. ఇందులో 63 లీటర్లు సీటు కింద ఉండగా, మరో 3 లీటర్లు ఫ్రంట్ ఆప్రాన్ కబ్బీలో ఉన్నాయి. అదనంగా 4 లీటర్ల క్విక్ యాక్సెస్ పాకెట్ కూడా ఇచ్చారు. స్కూటర్‌లో 920 మిల్లీమీటర్ల పొడవైన సీటు ఉంది. దేశంలోనే అత్యంత పొడవైన సీట్లలో ఒకటిగా కంపెనీ చెబుతోంది. వెనుక భాగంలో ట్విన్ షాక్ సస్పెన్షన్‌ ను ఉపయోగించారు.

90 కిలోమీటర్ల టాప్ స్పీడ్

వేవ్ పవర్‌ట్రెయిన్‌లో కూడా కీలక మార్పులు చేశారు. ఇందులో 6.4kW మోటార్, థర్డ్ జనరేషన్ బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ఉన్నాయి. మోటార్ పరిమాణాన్ని కూడా 15 శాతం తగ్గించినట్లు కంపెనీ తెలిపింది. వేవ్ Sలో EcoX, Eco, Ride అనే మూడు రైడింగ్ మోడ్‌లు ఉంటాయి. దీని గరిష్ట వేగం 75kmph. వేవ్, వేవ్+ మోడళ్లలో Sports మోడ్ కూడా ఉంటుంది. వీటి టాప్ స్పీడ్ 90 కిలో మీటర్ల వరకు ఉంటుంది.

సెప్టెంబర్ 25 నుంచి డెలివరీలు

డిజైన్ విషయంలో కూడా సింపుల్ వన్ సిరీస్‌తో పోలిస్తే వేవ్‌కు మరింత సాఫ్ట్ లుక్ ఇచ్చారు. వేవ్‌లో 7 అంగుళాల TFT క్లస్టర్‌తో పాటు కొన్ని వేరియంట్లలో LCD క్లస్టర్ ఎంపిక కూడా ఉంది. అన్ని వేరియంట్లలో CBS బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది. అయితే వెనుక డిస్క్ స్థానంలో డ్రమ్ బ్రేక్‌ ఇచ్చారు. సింపుల్ వేవ్ డెలివరీలు 2026 సెప్టెంబర్ 25 నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే, అన్ని వేరియంట్ల ధరలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. ధర, రేంజ్‌ను చూస్తే ఈ స్కూటర్‌కు ఏథర్ కోనార్క్, బజాజ్ చేతక్, హీరో విడా, టీవీఎస్ ఐక్యూబ్ వంటి ఈవీ స్కూటర్లతో పోటీ ఉండనుంది.

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live