Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సినిమా నచ్చకపోతే గుండు కొట్టించుకుంటా.. హీరోయిన్ ఓపెన్ ఛాలెంజ్!

సినిమా నచ్చకపోతే గుండు కొట్టించుకుంటా.. హీరోయిన్ ఓపెన్ ఛాలెంజ్!

Big TV Live 3 weeks ago

Saaha Life of Sanju:తాము చేసిన సినిమాపై ఎవరికైనా కాన్ఫిడెన్స్ ఉండడం సహజం కానీ ఆ కాన్ఫిడెన్స్ పిక్స్ కి చేరితే ఇదిగో ఇలాగే ఉంటుంది .విషయంలోకి వెళ్తే 'సాహా: లైఫ్ ఆఫ్ సంజు' అనే సినిమా అని సినిమా సెప్టెంబర్ 4న రిలీజ్ కాబోతోంది .

ఈ క్రమంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన ఒక ఈవెంట్లో సినిమాలో నటించిన హీరోయిన్ శ్వేతా లక్ష్మణ్ వైరల్ కామెంట్స్ చేసి మీడియాలో హైలైట్ అవుతుంది. ఇంతకీ అదేంటంటారా గుండు కొట్టించుకుంటానని.

అమీర్ పేట సెంటర్ లో గుండు కొట్టించుకుంటా

అవును ఈ సినిమా కనుక బాగోలేదని ఏ ఒక్క ప్రేక్షకుడు చెప్పినా అమీర్ పేట సెంటర్ లో గుండు కొట్టించుకుంటానని శబధం చేసింది. మామూలుగా ఎవరైనా సినిమా బాగుంటుంది చూడండి .మీకు బాగా నచ్చుతుంది ,నచ్చకపోతే మీ డబ్బులు మీకు వాపస్ ఇస్తాము అంటూ సినిమాపై బజ్ పెంచే ప్రయత్నం చేస్తారు.

కానీ ఊహించని విధంగా శ్వేతా లక్ష్మణ్ గుండు కొట్టించుకుంటానంటూ శబధం చేసి ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది .ఇక మూవీ టీం సినిమాపై తమ కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తూ అన్ని సినిమాలలా ఇది ఒక రొటీన్ లవ్ స్టోరీ కాదని నాలుగు పాటలు మూడు ఫైట్లు రెండు కామెడీ సీన్లతో సాగదని, ఇదొక ఇంటెన్స్ లవ్ స్టోరీ అని అసలైన బాధ , త్యాగం వంటి వాటి చుట్టూ ఈ సినిమా కథ సాగుతుందని చెప్పుకొచ్చింది.

60 నుంచి 70 మంది కొత్త నటీనటులు,కొత్త టెక్నీషియన్స్

ఇక ఈ సినిమాలో దాదాపు 60 నుంచి 70 మంది కొత్త నటీనటులు,కొత్త టెక్నీషియన్స్ అందరూ ఇందులో భాగం అయ్యారని, వారందరి కష్టానికి ఫలితం ఈ సినిమా హిట్ అయితేనే వస్తుందని చెప్పుకు వచ్చారు.

ఇక ఇండస్ట్రీలో నిర్మాతలుగా ప్రముఖ స్థానంలో ఉన్న బన్నీ వాసు వంశీ నందిపాటిలు ఈ సినిమాకి బ్యాక్ ఎండ్ లో సపోర్ట్ ఇవ్వడంతో సినిమా హిట్ అవుతుంది అన్న కాన్ఫిడెన్స్ తమ అందరికీ వచ్చేసిందని తెలిపింది శ్వేతా లక్ష్మణ్ .

ఆడియన్స్ కి గుడ్ న్యూస్

ఇక ఇబ్బడి ముబ్బడిగా టికెట్లు పెంచడం మాకు ఇష్టం లేదని ఫ్యామిలీస్ అందరూ కలిసి వచ్చి మా సినిమాని ఆశీర్వదించాలని,అందుకే సినిమాని తక్కువ రేట్లకే థియేటర్లలో అందిస్తున్నామని ఆడియన్స్ కి గుడ్ న్యూస్ చెప్పింది మూవీ టీం.

సెప్టెంబర్ 4న

ఇక సినిమా విషయానికి వస్తే తేజేశ్వర్ వేల్పుచర్ల నిర్మాతగా సుమైరా స్టూడియోస్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమాకి నిశాంత్ దోటి దర్శకత్వం వహించారు. ఇందులో శ్వేత లక్ష్మణ్, శివకుమార్ కాసారం జంటగా నటించగా, మెలోడీ మాస్టర్ శేఖర్ చంద్ర మ్యూజిక్ అందించడం విశేషం .

Also read :వ్రతాల పేరుతో ఈ దరిద్రపు రచ్చ ఏందిరా బాబు.. సునైనా ఘాటు వ్యాఖ్యలు!

అయితే ఎప్పటిలాగే సెప్టెంబర్ 4న కూడా బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీయే ఉంది. మరి ఈ సాహా: లైఫ్ ఆఫ్ సంజు బాక్సాఫీస్ వద్ద తన సత్తా ఎలా చూపిస్తుందో ఆ రోజునే తేలిపోనుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live