Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సీత పాత్రతో జాక్‌పాట్ కొట్టిందా?.. సాయి పల్లవి రెమ్యూనరేషన్‌పై కొత్త టాక్!

సీత పాత్రతో జాక్‌పాట్ కొట్టిందా?.. సాయి పల్లవి రెమ్యూనరేషన్‌పై కొత్త టాక్!

Big TV Live 2 weeks ago

Sai Pallavi Remuneration Buzz:సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల రెమ్యూనరేషన్ గురించి ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. కానీ ఇప్పుడు అదే స్థాయిలో ఓ హీరోయిన్ పారితోషికం కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

ఆ హీరోయిన్ ఎవరో కాదు.. సాయి పల్లవి. డ్యాన్సర్‌గా కెరీర్ మొదలుపెట్టి హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి.. ఇప్పుడు పారితోషికం విషయంలో కూడా ఇండస్ట్రీలో టాప్ రేంజ్ లోకి వెళ్ళిందన్న టాక్ ఇపుడు గట్టిగానే వినిపిస్తుంది.

సాయి పల్లవి లెక్క వేరే

సాధారణంగా స్టార్ హీరోయిన్లు ఏడాదికి ఐదు, ఆరు సినిమాలు చేస్తుంటారు.అది కామన్ కూడా.కానీ సాయి పల్లవి లెక్క వేరే .ఎందుకంటారా …ఏడాదికి ఒకటి లేదా రెండు సినిమాలే చేసినా వాటి ఇంపాక్ట్ మాత్రం సాలిడ్ గా ఉండేలా చూసుకుంటుంది. అందుకే నిర్మాతలు కూడా ఆమె డేట్స్ కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తారని ఇండస్ట్రీలో టాక్.

ఆమె ఓ సినిమా ఒప్పుకోవాలంటే అంత ఆషామాషీ కాదు.కథలో కంటెంట్ ఉండాలి, తన పాత్రకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. లేదంటే ఎంత పెద్ద బ్యానర్ అయినా, ఎంత పెద్ద హీరో అయినా తిరస్కరించిన సందర్భాలు బోలెడు మరి.

ఈ బ్యూటీ ఒక్కో సినిమాకు

ఇక ఈ మలయాళీ ముద్దుగుమ్మ పారితోషికం విషయానికి వస్తే ఒకప్పుడు ఈ బ్యూటీ ఒక్కో సినిమాకు రెండు నుంచి మూడు కోట్ల రూపాయల వరకు పారితోషికం తీసుకుంటుందని వార్తలు వచ్చేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని ఇండస్ట్రీ లో వినిపిస్తున్న టాక్. ఇక ఈ మధ్య ప్యాన్ ఇండియా సినిమాలు ఖాతాలో చేరుతుండటంతో ఆమె రెమ్యూనరేషన్ కూడా గట్టిగానే డిమాండ్ చేస్తుందన్న వార్తలు వినిపిస్తున్నాయి.ముఖ్యంగా భారీ ప్రాజెక్టులకు ఐదు కోట్లకు పైగా డిమాండ్ చేస్తోందనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. అయితే దీనిపై పల్లూ నే జవాబివ్వాలి.

ఇక అందరి దృష్టి ఇపుడు ‘రామాయణం’ పైనే ఉంది. ఈ చిత్రంలో సీత పాత్రను సాయి పల్లవి పోషిస్తుండటం వల్ల ఆమె పాత్రపై అంచనాలు ఒకసారిగా పెరిగిపోయాయి.సినిమా రెండు భాగాలుగా వస్తున్న నేపథ్యంలో, ఈ ప్రాజెక్ట్ కోసం ఆమెకు భారీ పారితోషికం అందుతున్నట్లు నేషనల్ వైడ్ గా వినిపిస్తున్న వార్త.రెండు భాగాలకు కలిపి ఏకంగా 12 కోట్లు అందుకుంటుందని సోషల్ మీడియా టాక్.

ఆమెకి ఇంత డిమాండ్ పెరగడానికి కారణం

సాయి పల్లవి గురించి మరో క్రేజీ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటో తెలుసా …చాలా మంది తారలు బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, కమర్షియల్ షూట్లతో భారీగా సంపాదిస్తుంటే, ఆమె మాత్రం తనకు నచ్చితేనే ఒకే చెబుతుంది. అందుకే అభిమానులు కూడా ఆమెను “స్టార్ హీరోయిన్” కంటే ఒక టాలెంటెడ్ యాక్ట్రెస్ గా చూస్తారు.ఇదే ఆమెకి ఇంత డిమాండ్ పెరగడానికి కారణం కాబోలు.

ఇక తెలుగులో ‘ఫిదా’, ‘లవ్ స్టోరీ’, ‘శ్యామ్ సింగ రాయ్’, ‘విరాట పర్వం’ వంటి చిత్రాలతో నటిగా తన స్థాయిని నిరూపించుకున్న సాయి పల్లవి, తమిళం, మలయాళంలో కూడా వరుస విజయాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక రామాయణం గనుక సాలిడ్ హిట్ అయితే మాత్రం సాయి పల్లవి మార్కెట్ మరింత రేంజ్ కి వెళ్ళడం పక్కా.

దీనికి తోడు పాన్ ఇండియా మార్కెట్‌లో లేడీ ఓరియంటెడ్ సినిమాలకి వస్తున్న అప్లాజ్ పల్లూ కి మరింత కలిసి వచ్చేదే !

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live