Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
స్మార్ట్ హోమ్స్ కోసం.. హై-పెర్ఫార్మింగ్ వాషింగ్ మెషీన్లు

స్మార్ట్ హోమ్స్ కోసం.. హై-పెర్ఫార్మింగ్ వాషింగ్ మెషీన్లు

Big TV Live 1 week ago

Best Washing Machines Under 30000: ప్రస్తుత కాలంలో ఇళ్లు స్మార్ట్ హోమ్స్‌గా మారిపోతున్నాయి. మన రోజు వారీ పనులను సింపుల్ చేసే వస్తువుల్లో వాషింగ్ మెషీన్ ముఖ్యమైంది.

టెక్నాలజీ పెరిగిన తర్వాత వై-ఫై, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఫీచర్లతో కూడిన స్మార్ట్ వాషర్లకు డిమాండ్ పెరిగింది. కస్టమర్ రివ్యూస్ అప్‌డేట్స్ ప్రకారం.. మార్కెట్లో రూ. 30వేల లోపు బడ్జెట్‌లో బెస్ట్ ఇన్ క్లాస్ ఫీచర్లు, గరిష్ట సామర్థ్యంతో లభిస్తున్న టాప్ బ్రాండ్ల (IFB, LG, Samsung) హై-పెర్ఫార్మింగ్ వాషింగ్ మెషీన్ల వివరాలు తెలుసుకుందాం.

రూ. 30వేలలోపు లభించే టాప్ స్మార్ట్ వాషింగ్ మెషీన్లు:

స్మార్ట్ హోమ్స్ కోసం వాషింగ్ మెషీన్ కొనేటప్పుడు కేవలం బట్టలు ఉతకడమే కాకుండా.. విద్యుత్ పొదుపు , తక్కువ నీటి కర్చు, స్మార్ట్ కనెక్టివిటీ , లాంగ్ లైఫ్ వంటి అంశాలను గమనించాలి. ఈ-కామర్స్, టెక్ గైడ్‌లైన్స్ ప్రకారం.. రూ. 30,000 లోపు అత్యుత్తమ రేటింగ్స్ పొందిన కొన్ని మోడల్స్..

1. LG 7 Kg 5 Star Inverter Touch Control Fully Automatic Front Load (FHM1207SDW)
స్మార్ట్ హోమ్ గ్యాడ్జెట్స్‌లో LG ఎప్పుడూ ముందంజలో ఉంటుంది. రూ. 30వేలలోపు లభించే ఫ్రంట్ లోడ్ మోడల్స్‌లో ఇది బెస్ట్ చాయిస్.

స్మార్ట్ ఫీచర్లు:ఇది ‘6 Motion Direct Drive’ టెక్నాలజీతో వస్తుంది. ఇది బట్టల రకాన్ని బట్టి డ్రమ్‌ను విభిన్న దిశల్లో తిప్పుతుంది. ఇందులో ‘Smart Diagnosis’ ఫీచర్ ఉంది. దీని వల్ల మెషీన్‌లో ఏదైనా సమస్య వస్తే.. మీ స్మార్ట్‌ఫోన్ యాప్ ద్వారానే కనుక్కోవచ్చు.

ప్రత్యేకత:5-స్టార్ ఎనర్జీ రేటింగ్ వల్ల కరెంట్ బిల్లు చాలా తక్కువ వస్తుంది. ఇన్-బిల్ట్ హీటర్ ద్వారా 60 డిగ్రీల వరకు వేడి నీటితో బట్టలను ఉతికి, 99.9% అలర్జీ కారక క్రిములను తొలగిస్తుంది.

2. IFB 6.5 kg 5 Star Fully Automatic Front Load (Senorita DXS 6510):
ఇండియన్ మార్కెట్లో ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్లకు IFB కేరాఫ్ అడ్రస్. కఠినమైన నీరు ఉన్న ప్రాంతాలకు ఇది చక్కగా సరిపోతుంది.

స్మార్ట్ ఫీచర్లు:ఇందులో ‘Aqua Energie’ టెక్నాలజీ ఉంది. ఇది నీటిలోని బైకార్బోనేట్లను విడగొట్టి, డిటర్జెంట్ బట్టల్లోకి బాగా ఇంకేలా చేస్తుంది. దీని వల్ల బట్టలు చాలా తెల్లగా వస్తాయి.

ప్రత్యేకత: 3D వాష్ సిస్టమ్ , క్రిసెంట్ మూన్ డ్రమ్ డిజైన్ బట్టలు చిరిగిపోకుండా సున్నితంగా ఉతుకుతాయి. దీని ఇంటెలిజెంట్ కంట్రోల్ ప్యానెల్ వాషింగ్ ప్రాసెస్‌ను సింపుల్ చేస్తుంది.

3. Samsung 8 kg 5 Star AI EcoBubble Wi-Fi Fully Automatic Top Load:
మీకు ఎక్కువ కెపాసిటీ (8 Kg) ఉండి, పూర్తి స్మార్ట్ ఫీచర్లు కావాలనుకుంటే శాంసంగ్ టాప్ లోడ్ మోడల్ బెస్ట్ ఆప్షన్. ఇది రూ.30వేల బడ్జెట్‌లోనే లభిస్తుంది.

స్మార్ట్ ఫీచర్లు:ఇది ‘AI Control’, ‘Wi-Fi’ కనెక్టివిటీతో వస్తుంది. మీరు ‘SmartThings’ యాప్ ద్వారా మీ మొబైల్ నుంచే వాషింగ్ సైకిల్స్‌ను కంట్రోల్ చేయవచ్చు. మీ వాషింగ్ అలవాట్లను బట్టి ఇది ఆటోమేటిక్‌గా బెస్ట్ మోడ్‌ను సజెస్ట్ చేస్తుంది.

ప్రత్యేకత: ‘EcoBubble’ టెక్నాలజీ డిటర్జెంట్‌ను బబుల్స్‌గా మార్చి, బట్టల్లోని మురికిని తక్కువ ఉష్ణోగ్రత వద్ద కూడా సమర్థవంతంగా తొలగిస్తుంది. డిజిటల్ ఇన్వర్టర్ మోటార్ వల్ల శబ్దం చాలా తక్కువగా వస్తుంది.

4. Whirlpool 7.5 Kg 5 Star Inverter Fully Automatic Top Load (360 Bloomwash Pro Wi-Fi): వర్ల్‌పూల్ బ్రాండ్ నుంచి వచ్చిన ఈ మోడల్ స్మార్ట్ హోమ్స్‌కు పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది.

స్మార్ట్ ఫీచర్లు: ‘Whirlpool App’ ద్వారా దీనిని ఎక్కడి నుండైనా ఆపరేట్ చేయవచ్చు. వాయిస్ కంట్రోల్ సపోర్ట్ కూడా ఉంది.

ప్రత్యేకత:దీనిలోని ‘హీటర్‌క్యాట్’ టెక్నాలజీ నీటిని వేడి చేసి, బట్టలపై ఉండే మొండి మరకలను సులభంగా వదిలిస్తుంది. 360 టంబుల్ మోషన్ వల్ల బట్టలు ఒకదానికొకటి చుట్టుకోకుండా శుభ్రపడతాయి.

కొనేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన గైడ్ టిప్స్:
ఫ్రంట్ లోడ్ వర్సెస్ టాప్ లోడ్: ఫ్రంట్ లోడ్ మెషీన్లు నీరు, కరెంట్‌ను ఆదా చేస్తాయి.అంతే కాకుండా బట్టలను బాగా ఉతుకుతాయి. కానీ ధర కొంచెం ఎక్కువ. టాప్ లోడ్ మెషీన్లు బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండి, వాడటానికి ఈజీగా ఉంటాయి.

ఇన్వర్టర్ టెక్నాలజీ:ఎల్లప్పుడూ ‘Digital Inverter Motor’ ఉన్న మోడల్స్‌నే ఎంచుకోండి. ఇవి తక్కువ శబ్దం చేస్తాయి. ఎక్కువ కాలం మన్నుతాయి.

వారంటీ:మోటార్ పై కనీసం 10 సంవత్సరాల వారంటీ ఇచ్చే బ్రాండ్లనే ఎంచుకోవడం మంచిది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live