Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
స్మార్ట్‌వాచ్ కొనేముందు చాలామంది చేసే తప్పు ఇదే.. ఈ ఒక్క తేడా తెలుసుకోకపోతే మనీ వేస్ట్!

స్మార్ట్‌వాచ్ కొనేముందు చాలామంది చేసే తప్పు ఇదే.. ఈ ఒక్క తేడా తెలుసుకోకపోతే మనీ వేస్ట్!

Big TV Live 4 months ago

Smartwatch vs Fitness Band: ఇప్పుడంతా చాలామంది హెల్త్, లైఫ్‌స్టైల్‌ను ట్రాక్ చేసుకోవడానికి చేతికి ఏదో ఒక గ్యాడ్జెట్ ధరించడానికి ఇష్టపడుతున్నారు.

అయితే మార్కెట్లో ఉన్న స్మార్ట్‌వాచ్‌లు, ఫిట్‌నెస్ బ్యాండ్‌లలో ఏది కొనాలో తెలియక చాలామంది గందరగోళానికి గురవుతుంటారు. ఈ రెండూ ఆరోగ్య విషయాలను పర్యవేక్షించినప్పటికీ.. వీటి ఫీచర్లు, డిజైన్, ధరల్లో చాలా తేడాలున్నాయి. ఈ నేపథ్యంలో రోజువారీ అవసరాలకు ఏది సరిపోతుందో ఇప్పుడు చూద్దాం.

పనితీరులో ఏది బెస్ట్?

స్మార్ట్‌వాచ్‌లు సాధారణంగా పెద్ద స్క్రీన్‌తో, చూడటానికి సాంప్రదాయ వాచీల్లా స్టైలిష్‌గా ఉంటాయి. వీటి ద్వారా ఫోన్ కాల్స్ మాట్లాడటం, మెసేజ్ నోటిఫికేషన్లు చూడటం, రకరకాల యాప్స్ వాడటం వంటివి చేయొచ్చు. మరోవైపు.. ఫిట్‌నెస్ బ్యాండ్‌లు చాలా చిన్నగా, బరువు తక్కువగా ఉంటాయి. ఇవి కేవలం మన అడుగులు, హార్ట్ రేట్, నిద్రను మాత్రమే ట్రాక్ చేయడానికి ఉపయోగపడతాయి.

హెల్త్ రిపోర్ట్స్ సంగతేంటి?

ఈ రెండు డివైజ్‌లు మన శారీరక శ్రమను రికార్డ్ చేస్తాయి. కానీ స్మార్ట్‌వాచ్‌లు మరింత లోతైన విశ్లేషణను ఇస్తాయి. వీటిలో బ్లడ్ ఆక్సిజన్ లెవల్స్ (SpO2), ఈసీజీ (ECG), స్ట్రెస్ లెవల్స్ వంటి అధునాతన ఫీచర్లు ఉంటాయి. రన్నింగ్, సైక్లింగ్ చేసేవారి కోసం వీటిలో ఇన్‌బిల్ట్ జీపీఎస్ కూడా ఉంటుంది. ఫిట్‌నెస్ బ్యాండ్‌లు మాత్రం కేవలం బేసిక్ హెల్త్ ట్రాకింగ్ కోరుకునే వారికి, అంటే రోజువారీ నడకను లెక్కించుకునే వారికి పర్ఫెక్ట్‌గా సరిపోతాయి.

త్వరలో మార్కెట్‌లోకి Nvidia ల్యాప్‌టాప్స్.. మైక్రోసాఫ్ట్, ఆసస్ డివైజ్‌ల ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే!

బ్యాటరీ లైఫ్ తేడా ఇదే:

ఏదైనా గ్యాడ్జెట్ కొనేటప్పుడు బడ్జెట్, బ్యాటరీ బ్యాకప్ అనేవి చాలా ముఖ్యం. ఫిట్‌నెస్ బ్యాండ్‌లు చాలా తక్కువ ధరకే లభిస్తాయి. వీటిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే వారం నుండి రెండు వారాల వరకు వస్తాయి. అదే స్మార్ట్‌వాచ్‌ల విషయానికొస్తే.. వీటిలో పెద్ద స్క్రీన్, ఎక్కువ ఫీచర్లు ఉండటం వల్ల బ్యాటరీ కేవలం ఒకటి నుండి మూడు రోజులు మాత్రమే వస్తుంది. పైగా వీటి ధర కూడా ఎక్కువే.

ఏది కొనడం ఉత్తమం?

కేవలం ఆరోగ్యం, ఫిట్‌నెస్ ముఖ్యం అనుకుంటే.. తక్కువ ధరలో వచ్చే ఫిట్‌నెస్ బ్యాండ్ సరిపోతుంది. అలా కాకుండా, చేతిపైనే ఒక చిన్న స్మార్ట్‌ఫోన్ లాంటి అనుభూతి కావాలి, కాల్స్ మాట్లాడాలి, సరికొత్త ఫీచర్లు ఉండాలి అనుకుంటే మాత్రం స్మార్ట్‌వాచ్ బెస్ట్ ఛాయిస్ బడ్జెట్, అవసరాలను బట్టి సరైన దాన్ని ఎంచుకోవడం ఉత్తమం.

స్టూడెంట్స్ కోసం స్పెషల్ డిస్కౌంట్.. 17 గంటల బ్యాటరీ లైఫ్‌తో Dell XPS 13 వచ్చేసింది!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live