Dailyhunt
స్టీల్‌ బర్డ్ నుంచి క్రేజీ హెల్మెట్.. ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

స్టీల్‌ బర్డ్ నుంచి క్రేజీ హెల్మెట్.. ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

Big TV Live 1 week ago

Steelbird SB-120 Helmet Launched:ప్రముఖ హెల్మెట్ తయారీ సంస్థ స్టీల్ బర్డ్ కొత్త మోడల్ హెల్మెట్ ను భారత మార్కెట్ లోకి తీసుకొచ్చింది. SB-120 పేరుతో దీనిని విడుదల చేసింది.

బడ్జెట్ ధరలో ఉండేలా దీనిని రూపొందించింది. ఈ హెల్మెట్ మోనో కలర్ వేరియంట్ ధర రూ. 3,999 నుంచి ప్రారంభమవుతుండగా, డిజైన్, డెకాల్ ఉన్న వేరియంట్లు రూ. 4,499 నుంచి అందుబాటులో ఉంటాయి. తక్కువ ధరలోనే మంచి సేఫ్టీ, స్టైల్ అందించాలనే లక్ష్యంతో కంపెనీ ఈ హెల్మెట్ ను విడుదల చేసింది.

అంతర్జాతీయ భద్రతా ప్రమాణాలతో..

ఈ హెల్మెట్‌ ను అంతర్జాతీయ ప్రమాణాలు విడుదల చేసింది. ECE R22.06, DOT FMVSS 218, ISI సర్టిఫికేషన్లు పొందింది. ప్రయాణికుల భద్రతకు మరింత అనుకూలంగా ఉంటుంది. కార్బన్ ఫైబర్ లుక్ ఉన్నప్పటికీ.. అసలు కార్బన్ ఫైబర్ షెల్ కాదు. దాని డిజైన్ మాత్రం ప్రీమియం ఫీల్‌ ను ఇస్తుంది. బయటి షెల్ పాలిమర్, ఫైబర్ గ్లాస్‌ తో తయారు చేయబడింది. దీనివల్ల హెల్మెట్ బలంగా ఉండటంతో పాటు, బరువు కూడా తక్కువగా ఉంటుంది. మొత్తం బరువు సుమారు 1.5 కిలోల వరకు ఉంటుంది. దీన్ని ఎక్కువసేపు ధరించినా పెద్దగా అలసట అనిపించదు. ఈ హెల్మెట్ 540mm నుంచి 590mm వరకు నాలుగు వేర్వేరు సైజుల్లో లభిస్తుంది. అలాగే గ్లాసీ, మ్యాట్, కార్బన్ ఫినిష్ లాంటి పలు స్టైల్ ఆప్షన్లు కూడా ఉన్నాయి.

హెల్మెట్ డిజైన్ గురించి..

ఈ హెల్మెట్‌ లో ఏరోడైనమిక్ డిజైన్ ఉంటుంది. వెనుక భాగంలో స్పాయిలర్ ఉండడం వల్ల గాలి ప్రవాహం సరిగ్గా జరిగేలా సాయపడుతుంది. ఇది హైవే మీద ఎక్కువ వేగంతో ప్రయాణించే వారికి ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే, వర్షం, చలికాలంలో గ్లాస్‌ పై మబ్బు పడకుండా ఉండేందుకు పిన్‌ లాక్ 30 యాంటీ ఫాగ్ సిస్టమ్ కూడా అందించారు. లోపలి భాగం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. గాలి సులభంగా ప్రవహించేలా మెష్ డిజైన్ ఇచ్చారు. చెక్ ప్యాడ్లను తీసి ఉతుక్కునే అవకాశం ఉంది. కాబట్టి హెల్మెట్ శుభ్రంగా ఉంచుకోవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో హెల్మెట్‌ ను త్వరగా తీసేయడానికి క్విక్ రిలీజ్ సిస్టమ్ కూడా ఉంది. రైడింగ్ సమయంలో సూర్య కాంతి వల్ల కళ్లకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఇందులో ఇన్నర్ సన్ వైజర్ కూడా ఇచ్చారు. ఇది ప్రత్యేకంగా మధ్యాహ్నం సమయంలో ప్రయాణించే వారికి ఉపయోగపడుతుంది.

ఫిట్, సేఫ్టీ గురించి..

ఫిట్, సేఫ్టీ కోసం ఈ హెల్మెట్‌ లో రెండు రకాల లాక్ సిస్టమ్స్ ఉన్నాయి. డబుల్ డి రింగ్, మైక్రోమెట్రిక్ బకిల్ ఆప్షన్లు ఉండటం వల్ల వినియోగదారులు తమకు నచ్చిన ఆప్షన్ ను ఎంచుకోవచ్చు. స్టీల్‌బర్డ్ SB-120 హెల్మెట్ తక్కువ ధరలో మంచి ఫీచర్లు, సేఫ్టీ స్టాండర్డ్స్, స్టైలిష్ డిజైన్ ను కలిగి ఉంటుంది. రోజువారీ ప్రయాణాలు చేసే వారికి మాత్రమే కాకుండా, లాంగ్ రైడ్స్‌ కు వెళ్లే వారికి కూడా అనుకూలంగా ఉంటుంది.

Read Also: భారత సైన్యం కోసం స్పెషల్ వెహికల్, మహీంద్రా కీలక నిర్ణయం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live