Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సుభాష్ చంద్ర.. దివాలా కేసులో మలుపు

సుభాష్ చంద్ర.. దివాలా కేసులో మలుపు

Big TV Live 3 weeks ago

Subhash Chandra: 22 వేల కోట్ల రూపాయల రుణ బకాయిల వ్యవహారంలో సుభాష్‌చంద్ర నుంచి కేవలం ఆరు కోట్ల యాభై లక్షలు చెల్లించే ప్రతిపాదన దేశవ్యాప్తంగా కార్పోరేట్ రుణాల తీరుపై మరోసారి ప్రశ్నలు సంధించింది.

తాజాగా ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది. NCLT చరిత్రలో తొలిసారి ఐదుగురు సభ్యుల బెంచ్ ముందుకు ఈ దివాళా కేసు వెళ్లింది. నిజానికి NCLT గత తీర్పు ప్రతిపాదనను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ వంటి రుణదాతలు తీవ్రంగా వ్యతిరేకించారు. తమకు న్యాయంగా దక్కాల్సిన మొత్తం చాలా తక్కువగా ఉందని గట్టిగానే రియాక్ట్ అయ్యారు.

ఈ వ్యవహారంలో గతంలో ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించిన NCLT ఈ కేసును ఐదుగురు సభ్యుల ప్రత్యేక ధర్మాసనానికి బదిలీ చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఆస్తులను ఏవిధంగానూ బదలాయించవద్దని సుభాష్‌చంద్రను ఆదేశించింది. ఇప్పుడు అసలు ఉత్కంఠ ఇక్కడే.. వేల కోట్ల బకాయిలకు ఆరు కోట్ల యాభై లక్షల పరిష్కారాన్ని ఐదుగురు సభ్యుల ధర్మాసనం సమర్థిస్తుందా..? రుణదాతల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటుందా..? లేక మొత్తం వ్యవహారానికి కొత్త పరిష్కార మార్గాన్ని చూపిస్తుందా..? చూడాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live