Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. ఆ వీధి కుక్కలను చంపేయొచ్చు!

సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. ఆ వీధి కుక్కలను చంపేయొచ్చు!

Big TV Live 22 hrs ago

Supreme Court: దేశవ్యాప్తంగా రోజురోజుకూ పెరుగుతున్న వీధికుక్కల దాడులు, రేబీస్ మరణాలకు సంబంధించి దేశ సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది.

పిచ్చిపట్టిన, దూకుడు స్వభావం కలిగిన కుక్కలను చంపేందుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మనుషుల ప్రాణాలకు ముప్పుగా పరిణమించే కుక్కల విషయంలో చట్టబద్దమైన కారుణ్య మరణం (యూథనేషియా) వంటి చర్యలు చేపట్టవచ్చని దిశానిర్దేశం చేసింది. ఈ మేరకు స్థానిక మున్సిపల్, పంచాయతీ అధికారులకు స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది.

వీధి కుక్కుల తరలింపునకు సంబంధించి గతంలో ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరిపింది. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్.వి. అంజారియాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం.. బహిరంగ ప్రదేశాల్లో కుక్కల సంచారంపై ఆందోళన వ్యక్తం చేసింది. జంతు ప్రేమికులు, స్వచ్ఛంద సంస్థలు వీధికుక్కల హక్కుల గురించి వాదించినప్పటికీ.. కోర్టు మాత్రం మానవ ప్రాణాల రక్షణకే తొలి ప్రాధాన్యం అని తేల్చి చెప్పింది.

మానవ ప్రాణాలకు ముప్పుగా పరిణమించిన.. నయం చేయలేని వ్యాధితో బాధపడుతున్న ప్రమాదకరమైన కుక్కల విషయంలో కారుణ్య మరణం సహా చట్టబద్దంగా అనుమతించబడిన అన్ని చర్యలను అధికారులు తీసుకోవచ్చని సుప్రీంకోర్టు దిశానిర్దేశం. వీధి కుక్కలు ప్రజలపై మరీ ముఖ్యంగా చిన్నారులపై దాడి చేసిన సందర్భాలను తాము విస్మరించలేమని ధర్మాసనం పేర్కొంది. దేశంలో పిల్లలు, వృద్దులపై కుక్కకాటు కేసులు నానాటికి పెరుగుతుండటాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావించింది. కాబట్టి బహిరంగ ప్రదేశాల నుంచి వీధికుక్కలను తరలించాలని గతంలో ఇచ్చిన తీర్పును సవరించలేమని తేల్చి చెప్పింది.

జియో రూ.199 ప్లాన్.. బడ్జెట్ ధరలో అపరిమిత బెనిఫిట్స్.. కానీ ఓ మెలిక ఉంది!

అంతేకాకుండా గతంలో ఇచ్చిన ఆదేశాలను పాటించడంలో విఫలమైన రాష్ట్రప్రభుత్వాలపై కూడా సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఇకనైనా వీధి కుక్కల విషయంలో తమ ఆదేశాలను కఠినంగా అమలు చేయాలని ఆదేశించింది. కాగా, ఆస్పత్రులు, పార్కులు, రైల్వే స్టేషన్లు వంటి బహిరంగ ప్రదేశాల నుండి వీధి కుక్కలను తరిమివేయాలని గతేడాది సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కుక్కలకు సంతాన నిరోధక చికిత్స చేయాలని సూచించింది. అనంతరం వాటిని తీసుకొచ్చిన ప్రాంతాల్లో వదలొద్దని దిశానిర్దేశం చేసింది. అదే విధంగా నిర్దేశిత ప్రాంతాలు మినహా బహిరంగ ప్రదేశాల్లో కుక్కలకు ఆహారం పెట్టడాన్ని సైతం సుప్రీంకోర్టు నిషేధించింది.

'కెనడియన్ బావి' వింత.. పెరట్లో పైపులు పాతి.. ఇల్లంతా కూల్‌గా మార్చేశాడు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live