Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సూర్యు శక్తిని, కాంతిని మింగేసే పురుగులు. భూమి అంతాన్ని ఆపడానికి అల్టిమేట్ అడ్వెంచర్

సూర్యు శక్తిని, కాంతిని మింగేసే పురుగులు. భూమి అంతాన్ని ఆపడానికి అల్టిమేట్ అడ్వెంచర్

Big TV Live 1 week ago

Si fi Survival Thriller: కళ్ళు మూసి తెరిచేలోపు సడన్ గా అంతరిక్షంలో ప్రత్యక్షం అయితే… స్పేస్ షిప్ లో పక్కన పడి ఉన్న శవాలతో ఒంటరిగా గడపాల్సి వస్తే… భూమి అంతకాకుండా చూడాల్సిన బాధ్యత మన నెత్తిపై పడితే ఎలా ఉంటుంది ?

ఇదంతా తెలుసుకోవాలంటే ‘ప్రాజెక్ట్ హేల్ మేరీ’ (Project Hail Mary) అనే సినిమాను చూడాల్సిందే. ఒంటరి సైన్స్ టీచర్ అంతరిక్షంలోకి వెళ్ళి ఒంటి చేత్తో భూమిని కాపాడిన సాహసం ఈ మూవీ. 2026లో విడుదలై ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సైన్స్ ఫిక్షన్ మాస్టర్‌పీస్ ఇది. ఆండీ వీర్ రాసిన ప్రసిద్ధ నవల ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో ర్యాన్ గోస్లింగ్ ప్రధాన పాత్రలో అద్భుతంగా నటించాడు. మరి సై-ఫై జానర్లో వచ్చిన జెమ్ లాంటి ఈ మూవీని ఏ ఓటీటీలో చూడొవచ్చు ? తెలుగులో ఉందా ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

అంతరిక్ష నౌకలో మేలుకొంటాడు రైలాండ్ గ్రేస్. కానీ అప్పటికే ఆయన గతాన్ని పూర్తిగా మర్చిపోయి ఉంటాడు. అతనితో పాటు ఉన్న మిగిలిన క్రూ మెంబర్స్ అందరూ చనిపోయి కనిపిస్తారు. నెమ్మదిగా అతనికి తన జ్ఞాపకాలు గుర్తొస్తాయి. “ఆస్ట్రోఫేజ్” అనే ప్రమాదకరమైన సూక్ష్మజీవులు సూర్యుడి శక్తిని మింగేస్తాయి. ఇది ఇలాగే కొనసాగితే 15-20 ఏళ్లలో సూర్యుడు చల్లబడిపోయి, భూమిని మంచు కప్పేసి, మానవాళి అంతరించిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రపంచ దేశాలు కలిసి “ప్రాజెక్ట్ హేల్ మేరీ” అనే అత్యంత రహస్యమైన మిషన్‌ను ప్రారంభిస్తాయి.

ఇలాంటి పరిస్థితులలో భూమికి 12 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న “టౌ సెటి” అనే నక్షత్రం మాత్రమే సురక్షితంగా ఉంటుంది. ఆ నక్షత్రం ఎందుకు ఆస్ట్రోఫేజ్ సోకలేదో తెలుసుకోవడానికి గ్రేస్‌ను ఒంటరిగా అంతరిక్షంలోకి పంపుతారు. ఇది తిరిగి రావడానికి ఇంధనం లేని “వన్-వే మిషన్”. టౌ సెటి కక్ష్యలో చేరుకున్న గ్రేస్‌కు మరో అంతరిక్ష నౌక కనిపిస్తుంది. అందులో “రాకీ” అనే గ్రహాంతరవాసి ఉంటాడు. రాకీ గ్రహం కూడా ఇదే సమస్యతో బాధపడుతోంది. మొదట ఒకరి భాష ఒకరికి అర్థం కాకపోయినా, సైన్స్ – గణితం సహాయంతో ఇద్దరూ కమ్యూనికేట్ చేయడం నేర్చుకుంటారు.

రాకీ ఒక సాలీడు లాంటి ఆకృతిలో ఉండి, శబ్దాల ద్వారా మాట్లాడతాడు. కాలక్రమేణా వీరిద్దరి మధ్య బలమైన స్నేహం ఏర్పడుతుంది. ఇద్దరూ కలిసి పరిశోధనలు చేసి, ఆస్ట్రోఫేజ్‌ను తినేసే “టౌమెబా” అనే బ్యాక్టీరియాను కనుగొంటారు. ఈ బ్యాక్టీరియా సూర్యుడిని, రాకీ గ్రహాన్ని రెండింటినీ కాపాడగలదు. కానీ రాకీ నౌకలో బ్యాక్టీరియా చనిపోవడంతో అతను ప్రమాదంలో పడతాడు. గ్రేస్ ఇప్పుడు ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో పడతాడు. తాను సురక్షితంగా భూమికి వెళ్లడం లేదా రాకీని కాపాడటానికి వెళ్లడం అనే రెండే ఆప్షన్స్ ఉంటాయి తన దగ్గర. తన ప్రాణాలను పణంగా పెట్టి రాకీని కాపాడటానికే గ్రేస్ నిర్ణయించుకుంటాడు.

అతను భూమికి కావాల్సిన సమాచారాన్ని ఒక చిన్న స్పేస్ క్యాప్సూల్ ద్వారా పంపిస్తాడు. మరి గ్రేస్ తన ఫ్రెండ్ ను కాపాడగలిగాడా ? తిరిగి భూమికి ఎలా చేరుకున్నారు ? క్లైమాక్స్ ట్విస్ట్ ఏంటి అన్నది తెలియాలంటే ఈ మూవీపై ఒక లుక్కేయాల్సిందే. ‘ప్రాజెక్ట్ హేల్ మేరీ’ Netflixలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది.

అమ్మాయిల కోసం అంకుల్ యాప్… ఈ సిరీస్ పెద్దలకు మాత్రమే భయ్యా

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live