Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తక్కువ ఖర్చు.. ఎక్కువ మైలేజ్..  రూ.10 లక్షల్లోపు బెస్ట్ CNG ఆటోమేటిక్ కార్లు ఇవే!

తక్కువ ఖర్చు.. ఎక్కువ మైలేజ్.. రూ.10 లక్షల్లోపు బెస్ట్ CNG ఆటోమేటిక్ కార్లు ఇవే!

Big TV Live 1 week ago

Best Budget CNG AMT Cars:భారత మార్కెట్లో CNG కార్లకు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతోంది. పెట్రోల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో తక్కువ ఫ్యూయల్ ఖర్చుతో ప్రయాణించాలనుకునే వారు CNG కార్లను ఎక్కువగా ఎంచుకుంటున్నారు.

ఇక ఆటోమేటిక్ గేర్‌ బాక్స్ ఉంటే సిటీ ట్రాఫిక్‌ లో డ్రైవింగ్ మరింత ఈజీగా ఉంటుంది. మంచి మైలేజ్‌ తో పాటు ఆటోమేటిక్ సౌకర్యం కావాలనుకునే వారికి రూ.10 లక్షల లోపు లభించే బెస్ట్ CNG కార్లు గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

1.టాటా టియాగో CNG AMT

ఈ లిస్టులో అత్యంత సరసమైన మోడల్ టాటా టియాగో CNG AMT. ఫ్యాక్టరీ ఫిటెడ్ CNG కిట్‌ తో పాటు 5 స్పీడ్ AMT గేర్‌ బాక్స్ అందుబాటులో ఉంటుంది. ఇందులో 1.2 లీటర్ పెట్రోల్-CNG ఇంజిన్ ఉంటుంది. ఈ కారు కిలో CNGకు సుమారు 28.06 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. ఈ కారు ఆన్ రోడ్ ధర సుమారు రూ.8.08 లక్షల నుంచి ప్రారంభమై, వేరియంట్‌ను బట్టి రూ.9.79 లక్షల వరకు ఉంటుంది. తక్కువ ధరలో ఆటోమేటిక్ CNG కారు కోరుకునే వారికి బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.

2.నిస్సాన్ మాగ్నైట్ CNG AMT

ఈ లిస్టులో టాటా కాకుండా ఉన్న ఏకైక మోడల్ నిస్సాన్ మాగ్నైట్. ఈ కారుకు ఆథరైజ్డ్ రెట్రోఫిట్ CNG కిట్‌ ను ఫిట్ చేయించుకునే అవకాశం ఉంటుంది. AMT వేరియంట్‌ తో కూడా ఈ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది. కిలో CNGకు సుమారు 24.09 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఆన్ రోడ్ ధర సుమారు రూ.7.83 లక్షల నుంచి రూ.11.23 లక్షల వరకు ఉంటుంది. బడ్జెట్‌లో SUV తరహా కారు కావాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.

3.టాటా ఆల్ట్రోజ్ CNG AMT

టాటా ఇటీవల తన ప్రీమియం హ్యాచ్‌ బ్యాక్ ఆల్ట్రోజ్‌కు కూడా CNG ఆటోమేటిక్ వేరియంట్‌ ను తీసుకొచ్చింది. ఇందులో 1.2 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు CNG సెటప్ ఉంటుంది. ఈ కారు కిలో CNGకు సుమారు 26.2 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. టియాగోతో పోలిస్తే ఇందులో మరిన్ని ప్రీమియం ఫీచర్లు, మెరుగైన ఇంటీరియర్, అత్యాధునిక టెక్నాలజీ ఉంటుంది. దీని ధర సుమారు రూ.9.96 లక్షల నుంచి రూ.12.49 లక్షల వరకు ఉంటుంది.

4.టాటా పంచ్ CNG AMT

మైక్రో SUV కొనాలనుకునే వారికి టాటా పంచ్ CNG AMT మంచి ఆప్షన్. ఇందులో కూడా 1.2 లీటర్ పెట్రోల్ CNG ఇంజిన్‌ తో పాటు AMT గేర్‌ బాక్స్ అందుబాటులో ఉంది. ఇది కిలో CNGకు సుమారు 26.99 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. దీని ఆన్ రోడ్ ధర సుమారు రూ.9.74 లక్షల నుంచి రూ.12.17 లక్షల వరకు ఉంటుంది.

తక్కువ ధరలో బెస్ట్ ఫ్యామిలీ కార్లు.. ఈ 3 సెడాన్లను అస్సలు మిస్ కావొద్దు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live